Monday, February 27, 2023

శివుడు

" మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి నాడు
శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి, లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అందుకే, రాత్రి పదకొండు గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు

మరొక కథనం ఏమిటంటే...
ఒకానొక సందర్భంలో భృగుమహర్షి శివుడి దగ్గరికి వస్తాడు. కానీ శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోలేదు. దీంతో కోపోదృక్తుడైన మహర్షి "నేటి నుండి నీ శివలింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది" అని శపిస్తారట.
ఆ శాపం కారణంగానే శివ లింగాన్ని, శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైందని చెపుతుంటారు.)"

శివలింగం లో మూడు భాగాలు ఉంటాయంటారు .
బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో,
శివ భాగం మనకు కనిపించే పూజా భాగంగా
శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా ,
నిర్మిస్తారు.

ఈ శివ లింగాల లో కొన్ని ...
స్వయం భూ లింగములు . అవి స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.

దైవిక లింగములు : దేవతలు ప్రతిష్ఠించినవి.

రుష్య లింగములు : ఋషులు ప్రతిష్ఠించినవి

మానుష లింగములు : ఇవి మానవ నిర్మిత లింగములు.

బాణ లింగములు : ఇవి నర్మదా నదీతీరాన దొరికే బొమ్మరాళ్ళు.

ఇవిగాక  పంచభూత లింగాలుగా వెలసిన ప్రసిద్ధ దివ్య క్షేత్రాలు కొన్ని ఉన్నాయి .అవి...
.
1. తేజో లింగం : అన్నామలైశ్వరుడుగా - అన్నామలైలోనుా,

2. జల లింగం : జంబుకేశ్వరునిగా, జంబుకేశ్వరంలోనుా,

3. ఆకాశ లింగం : చిదంబరేశ్వరునిగా  చిదంబరంలోనుా,

4. పృథ్వీ లింగం : ఏకాంబరేశ్వరునిగా  - కంచిలోనుా,

5. వాయు లింగం : శ్రీకాళహస్తీశ్వరునిగా - శ్రీకాళహస్తి లోనుా
వెలసి ,మానవ జీవితాలను తరింపజేస్తున్నాడు శివుడు.

ఇక మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ.
ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది
ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజుగా.
ఆ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజుగా ,
శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు,  మాఘ మాసంలో   వచ్చే మాఘ బహుళ చతుర్దశిని " మహాశివరాత్రి "  పర్వ దినంగా  హిందువులు ఆచరిస్తుా శివారాధనలు చేస్తారు.

శివరాత్రి రోజు, ఉత్తర ధ్రువం లోని గ్రహ స్థానాలు ఎంతో బలమైనవిగా ఉండి  ఆధ్యాత్మిక శక్తి పెంచడానికి
సహాయంగా ఉంటాయని అంటారు..
మహా మృత్యుంజయ మంత్రం వంటి శక్తి వంతమైన పురాతన సంస్కృత మంత్రాల యొక్క ప్రయోజనాల శక్తి ,
ఈ రాత్రి గొప్పగా పెరుగుతుందని ప్రతీతి.

No comments:

Post a Comment