[22/04, 7:20 pm]
JAGADISWARI SREERAMAMURTH: 22/04/2023.
మహతీ సాహితీ కవి సంగమం .
బాల సాహిత్యం ( ర -ద్విత్వం = ర్ర )
శీర్షిక : చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .
మర్రి చెట్టు నీడలోన ఆడుకోండందరుా.॥
ఎర్ర నైన గులాబీకి ముళ్ళుంటాయ్ బాలలుా
ముల్లు గుచ్చ ఎర్ర నైన రక్త మొచ్చు పిల్లలుా॥
కర్రతో నదిలిస్తుా వచ్చె తాత పిల్లలుా
బుర్ర మీసాల తాత తోలుకొచ్చె బర్రెలు
బర్రె పాలు తాగొచ్చవి బాగుంటాయ్ పిల్లలుా
గొర్రె మందలాగల్లరి చేయకండి పిల్ల లుా ॥
విర్రవీగు కాకమ్మను రెచ్చగొట్ట పిల్లలుా
బుర్రమీద ఒక్కతన్ను తన్నుతుంది పిల్లలుా॥
ముద్దొచ్చిన కుక్కపిల్లను ముట్టకండి పిల్లలుా
గుర్రు మంటు తల్లి కుక్క మీదకొచ్చు పిల్లలుా॥
ఎర్ర ఆవు అంబాయని పిలువ గానె పిల్లలుా
కర్రి ఆవు పిల్ల తల్లి పొదుగు చేరె పిల్లలుా ॥
జుర్రుమంటు పాలు కుడిచి తాగుతున్న దుాడను
కుర్ర కుంక లెల్ల జేరి మురిసి చుాచె పిల్లలుా॥
బుర్రు పిట్ట గుబురులోకి ఎగిరి దాగె పిల్లలుా
తుర్రు మంటు చిలకపిట్ట గుాడు చేరె పిల్లలుా ॥
చెట్టు తొర్ర లోన ఉడుత గంతులేసె పిల్లలుా
సర్రు మంటు జారి పడెను చిట్టి ఉడుత పిల్లలుా॥
వెర్రెక్కిన కోతి లాగ గెంతకండి పిల్లలుా
సర్రు మంటు కాలు జారి పడతారోయ్ పిల్లలు
కొర్ర మీసమున్న తండ్రి మాట వినరె పిల్లలుా
వర్ర కాదు మీదు భవిత , తీపి నిండు పిల్లలుా ॥
వెర్రి-మొర్రి వేషాలను వేయకండి పిల్లలుా
గుర్రు మన్న గురువు మాట వినరె పిల్లలుా ॥
కొర్రుమాట లాడి పరిధి దాటకండి పిల్లలుా
బుర్ర కొంత పదును బెట్టి చదవండోయ్ పిల్లలుా॥
హామీ :
పై కవిత నా స్వీయ రచన.
[22/04, 7:40 pm] +91 99890 18003: 2️⃣9️⃣
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.కల్యాణ్.గారు, మీ
శీర్షిక : చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా
చిర్రు బుర్రు లాడకండి చిన్నారి పాపలుా .
మర్రి చెట్టు నీడలోన ఆడుకోండందరుా.॥
ఎర్ర నైన గులాబీకి ముళ్ళుంటాయ్ బాలలుా
ముల్లు గుచ్చ ఎర్ర నైన రక్త మొచ్చు పిల్లలుా👌
బుర్రమీద ఒక్కతన్ను తన్నుతుంది పిల్లలుా॥👌
సర్రు మంటు జారి పడెను చిట్టి ఉడుత పిల్లలుా॥
కొర్రుమాట లాడి పరిధి దాటకండి పిల్లలుా
బుర్ర కొంత పదును బెట్టి చదవండోయ్ పిల్లలుా॥
👉 అధ్బుతమైన లయ మీ రచనలో .. అభినందనలు 🙏🎉💐
No comments:
Post a Comment