అంశం : రుబాయిలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
కొమ్మమీద కోయిలమ్మ పాటపాడె నోచెలియా
పక్షులెన్నొ పలుకుకులుకు నాటలాడె నోచెలియా॥
పచ్చదనపు అందాలవి మనజీవిత సుఖవరాలు
ప్రకృతికన్య పులకరించి నాట్యమాడె నోచెలియా॥
తలలుాపుచు పరవసించె పుాబాలలు ఓ చెలియా॥
చిరు గంధపు వలువ తొడిగె చిరుగాలులు ఓ చెలియా॥
పర్యావరణ రక్షణమన బాధ్యతగద ఈ భువిలో
ప్రకృతి పంచు సిరులె బ్రతుకు పరిమళాలు ఓ చెలియా॥
స్వశ్ఛమైన గాలినిచ్చు చెట్లు పెంచు మొా చెలియా॥
పచ్చదనపు అందాలవి పెంచిపంచు మొాచెలియా ॥
మన పోషక విలువలవే , సిరులమించు సరులుఅవే
మనమేసే ప్రతి యడుగు భవిత కంచు నో చెలియా॥
No comments:
Post a Comment