Wednesday, April 5, 2023

మగువ సృష్టి కే కానుక.


.
అంశం : మగువ సృష్టికే కానుక :
శీర్షిక : మరో బ్రహ్మ .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఆట పాటలాడు వయసు, ఆంక్షలతో  బ్రతుకు గడువు
అడుగడుగున సద్దుబాటు, లేదు జన్మకాట విడుపు
ఆడ జన్మ నీదంటుా అందరదే ఎత్తిపొడుపు .
మనసులోన భాధ పెరిగి కన్నీరై  హృదిని తడుపు॥ 

పుట్టినింటి గడప దాట, మెట్టినింటి పరువు బెరుకు
భాధ్యత నిండిన పనులకు భారమైన బరువు బ్రతుకు .
సుప్రభాత మేలుకొలుపు సుభ్రతలకు తానె తుడుపు
వంట యింటి వేడిలోన పండగైన లేదు విడుపు॥

 ఆడ,మగ, తేడాలేని మగువ కాన్పు యెంపికలు
తొమ్మిదైన నెలల బాధ మగువ కోరు సంపదలు
బిడ్డ యెవ్వరైన గాని పంచి యిచ్చు తన ప్రాణము
బిడ్డ త్రాగు చను పాలలో, నింపు ప్రేమామృతము ॥

కలికి కంట కన్నీరిడ కరగు సుఖము జగము నందు.
ఆమె శక్తి రుాప మెత్త నిలువలేవు ఆమె ముందు.
చేయగలదు కర్యములిల ఘనమైనవి, పుడమి యందు
స్త్రీలు లేని జగమంతా సుాన్యమేగ సృష్టి యందు ॥ 

మారిన కాల మహిమకు ,మగువ లేలె మహిని గనుము 
విద్య , విషయ సంపదలవి నేర్చి వెలిగిరాసాంతము.
ధైర్య సాహసముల కాంతి ఇంట,బయట నేలె శాంతి 
అబల కాదు సబల, యంచు నిరుాపించె నామె గెలిచి ॥

మగువ సృష్టి కందమైన కానుక యని గుర్తించు.
మగువ మహిని మరో బ్రహ్మ మగువే సృష్టిని పెంచు
ఆమె చేయ లేని కార్య మిలను ఒక్కటైన లేదు లేదు.
ఆమె శక్తి గమనించు స్త్రీ ముార్తుల గౌరవించు.॥


హామీ : 
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం
కాని నా స్వీయ రచన.

********

No comments:

Post a Comment