[10/16, 18:17] p3: సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: నెల్లుట్ల సునీత గారు
తేదీ:: 16-10-2021
వారం: శనివారం
అంశం ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం.
శీర్షిక : ప్రపంచ శాంతికై శ్రీకారం.
రచన, శ్రీమతి, పుల్లాభట్ల
జగదీశ్వరీముార్తి.కల్యాణ్ : మహారాష్ట్ర .
151.
అంతర్జాతీయ చట్టభద్రత, ఆర్థిక-
సామాజికాది మానవహక్కుల సమష్టి-
కృషికై ఐక్యరాజ్యసమితి ఆవిర్భావం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
152.
ప్రపంచశాంతి పరిరక్షణకై తీర్మానం.
శాస్త్ర సాంకేతికరంగాలకు సహకారం.
వైజ్ఞానిక - సాంస్కృతిక విద్యాస్థాపనలు
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
153.
ప్రపంచ సమస్యలను పరిష్కరించడం
బాలల సమగ్రాభివృద్ధికై కృషిచేయడం
ప్రపంచ ఆరోగ్యసంస్థగా గుర్తింపు.
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
154.
ప్రపంచ పర్యావరణ పరిరక్షణ,
అణ్వస్త్రవ్యాప్తి నిరోధనకై కృషి
ప్రపంచ పార్లమెంట్ గా వ్యవహరించడం.॥
చుాడచక్కని తెలుగు సున్నితంబు.॥
155.
ఆలివ్ కొమ్మల మధ్య ,
తెలుపురంగు గ్లోబుల్ చిత్రం.
నీలిజండాపై నిలిచిన శాంతిచిహ్నం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు.
హామీ:
ఈ సున్నితాలు ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచనలు.
[10/22, 20:48] p3: సాహితీ బృందావన జాతీయ వేదికలో
22/10/2021 .
అంశం : సర్దార్ వల్లభ భాయ్ పటేల్ సేవలు.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
ఊరు: కల్యాణ్. మహారాష్ట్ర .
శీర్షిక : ఉక్కు మనిషి.
156
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
స్వదేశీ జాతీయొాద్యమాల ఆకర్షణతో
మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉద్యమం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
157
బార్దోలిలో సత్యాగ్రహానికి విజయం
ప్రజల సంక్షేమానికై పోరాటం
అల్లర్లను అణచివేయగల చాకచక్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
158
హైదరాబాదు, జునాగఢ్ సంస్థానాలను భారతదేశములో విలీనం చేయుటలో
సఫలుడైన వల్లభ్ భాయ్ ఘనత
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
159
నెహ్రూ నేతృత్వంలో కేంద్రమంత్రిమండలిలో హోంశాఖ,ఉపప్రధానమంత్రిగా బాధ్యత
భారతరత్నగా బిరుదందిన ఉక్కుమనిషి
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
160.
కిసాన్ ఉద్యమ విజేత
ది గ్రేటెస్ట్ఇండియన్పోల్ లో మూడవ స్థానం
అత్యుత్తమ వ్యక్తిగా సర్దార్ -వల్లభ భాయ్-పటేల్
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
[10/30, 20:51] p3: 30/10/2021.
ప్రక్రియ : సున్నితం.
అంశం : దీపావళి
శీర్షిక : నరకాసుర వధ.
రచన:శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
161
వరహావతారునకుా భుామాతకును శిశువు
ముద్దుదీర్చు పుత్రుడు నరకాసురుడు.
అసుర లక్షణములున్న ముార్ఖుడాతడు.
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
162
కామాఖ్యాదేవికి కడు భక్తుడీతడు
బాణాసురు చెలిమితో కడుధుార్తుడు-
అమ్మచేత మరణమని తెలియనివాడితడు
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
163
దేవ్వోపాసనల దేహ బలుండాయెను
దేవతలనుల హింసించి బాధించుచుండెను
ఇంద్రపదవి నాక్రమించి స్వర్గమేలెను
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
164
దేవతల మొరవినెను జగన్నాధుడు .
సత్యభామ సహితుడైన శ్రీకృష్ణుడుా
పోరుసల్ప కుాలినాడు నరకాసురుడుా
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
165
భుాదేవీ వరమదే శాపమాయెను
అమావాస్యరోజున నరకుడు కనుముాసెను.
జనులు దీపవళులుపేర్చి సంతసించెను॥
చుాడ చక్కనీతెలుగు సున్నితంబు ॥
హామీ :
పై సున్నితములు నా స్వీయ రచనలు.
[11/6, 18:21] p3: 6/11/2021.
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
అంశం : దాశరథీ కృష్ణమాచార్యులు
శీర్షిక : ప్రజాకోటి.
166.
నిజాం పాలకుల నిరసనతో
కలాయుధంతో కఠినమైన ఉద్యమం
పద్య విన్యాసాలతో పదపోరాటం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
167.
తెలంగాణ విముక్తికై ఆరాటం.
తెలంగాణ రతనాల వీణంటుా.
ప్రేరణిచ్చిన స్ఫుార్తికి నిదర్శనం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
168.
సముద్ర గర్భంలో బడబానలం
సాయుధ రైతాంగ పోరాటానికి
ఎలుగెత్తిన దాసరధీ కలం
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
169.
నీలాకాశంలో కానరాని భాస్కరులు
గాయపడిన కవి గుండెలలో
రాయబడని కావ్యాలన్న క్రిష్ణమాచార్యులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
170.
నా పేరు ప్రజాకోటి -
నా ఊరు ప్రజావాటన్న
తెలంగాణ తెలుగుబిడ్డ దాశరధి
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ: పై సున్నితాలు నా స్వీయ రచనలు.
[11/13, 17:28] p3: 13/11/2021.
సాహితీ బృందావన జాతీయ వేదిక
అంశం : నేటి బాలలే రేపటి పౌరులు .
ప్రక్రియ : సున్నితం.
రుాపకర్త : నెల్లుట్ల సునీతగారు.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..
శీర్షిక : భవిత చరితకు పునాదులేద్దాం.
171.
బాల్యం భగవంతుడిచ్చిన వరం.
పసితనపు అమాయకత్వమే ఆభరణం.
అందరిలో సమానత్వ భావం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
172.
విద్యావిధానాలలో ప్రధాన లోపం
సామాజికాంశాలు తెలీని అవివేకం.
విద్యార్ధి జీవితాలకొక శాపం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
173.
విద్యార్థుల వినాశనానికి మాధ్యమం
ప్రధాన భుామిక మీడియారంగం .
కరన్సీ యంత్రాలుగా యువతరం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
174.
నాయకుల త్యాగాలను వివరించు
యువతలో దేశభక్తి కలిగించు.
చైతన్యపు దీపాలను వెలిగించు .
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
175.
అపుడౌతారు సంస్కారాలకు ప్రతిరుాపాలు
సభ్యత సంప్రదాయాలకు ఆలంబనలు.
సమసమాజ స్థాపనకు పునాదులు
చుాడచక్కని తెలుగు సున్నితంబు ॥
హామీ : ఈ సున్నితాలు నా స్వీయ రచనలు.
No comments:
Post a Comment