మహతీ సాహితీ కవి సంగమం.
అంశం : విష్ణుపాదం
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
వామనుండతండు వరుసావతారాల
అసురు నణచ వచ్చె నాది విష్ణు.
బలిని అణచి నట్టి బలమైన పాదమ్ము
విమల యశము నొసగు విష్ణు పదము॥
పాము తలను తొక్కి ఫలమిచ్చె పాదమ్ము
బలము రిపుల నణచె భాగ్య పదము
గర్వ మణచి నట్టి ఘనమైన పాదమ్ము
గగన సీమ నేలు ఘనుని పదము ॥
బ్రహ్మ కడిగి నట్టి బ్రహ్మ మీ పాదమ్ము
దుార్వ సాది ఋషుల దుాకు డణచె.
రాతి నాతి జేయు రమ్యమౌ పాదమ్ము
విష్ణు డతడె సకల జిష్ణు డతడె ॥
No comments:
Post a Comment