13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.
శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
క్రమసంఖ్య : 2023.
నేను అమ్మనయ్యాకా తెలుసుకున్నాను
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥
నా పాప పగలంతా నిదరోతుా
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని" ఎందుకంటారో...॥
సమయానికి అందరికీ అన్నీ
అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥
నా పాప నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి
"అమ్మకు అమ్మే సాటని ,".॥
ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది.,
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥
హమీ :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment