శీర్షిక : చెట్టు తల్లి..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర.
వెధవ చెట్టు ..
ఎన్ని సార్లు నరికినా మళ్ళీ చిగురిస్తోంది సిగ్గులేకుండా..
అనుకుంటుా రుస- రుస లాడుతుా పళ్ళు తోముకుంటున్నాడు రాఘవ. అతడి భార్య లలిత
అప్పటికే అక్కడి వారి ఆచారం ప్రకారం, ఆ పెద్ద చెట్టు దగ్గర దీపం పెట్టేసింది . కొడుకు హర్ష మర్రి చెట్టు కొమ్మకు కట్టిన ఉయ్యాల ఊగుతానని మొరాయిస్తున్నాడు.
లలిత వాడిని వద్దని బుజ్జగిస్తున్నాది. వాడికి పదేళ్ళు దాటేయి ..చిన్నప్పటి నుండే వాడికి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండేది . ఉబ్బసం ఏమొా అనుకున్నారు .డాక్టర్లకు చుాపిస్తే ఎన్నో టెస్ట్ లు చేసి, చివరకు వాడి బ్రైన్ కి ఆక్సిజన్ అందడం లేదని కొందరు , , ఎక్కడో బ్లడ్ క్లాట్స్ ఉండి రక్తప్రసరణం సమంగా జరగనందు వల్ల ఇలా జరుగుతున్నాదని మరి కొందరు , చెపుతుా ఏవేవో
మందులు రాసి ఇస్తున్నారు. . పిల్లాడికి వయసు పెరుగుతుా ఉంటే తగ్గవచ్చని లేకపోతే సర్జరీ చేయవలసి వస్తుందని మరికొందరు చెప్పేరు. చెప్పేరు. ఉన్న ఒక్కగానొక్క పిల్లడికీ అసలు ఈ వ్యాధేమిటో....ఎవరుా తేల్చి చెప్పలేకపోతున్నారు. అందికే వాడు ఏమైనా ఎత్తులెక్కినా
అలసిపోయే ఆటలాడినా , తమకు చాలా భయంగా ఉంటోంది . ఊపిరందని కారణంగా వాడికేమైనా అవుతుందేమొానని.
ఆలోచిస్తున్న రాఘవ మళ్ళీ పిల్లాడి అల్లరితో ఈ లోకం లోకి వచ్చిపడ్డాడు.
ఎదురుగా పెద్ద చెట్టు, దానికి వేలాడుతున్న గొలుసులుా..
కనపడ్డాయి. రాఘవ ఆలోచనలు మళ్ళీ అటు మళ్ళేయి.
అసలక్కడ ఆ ఉయ్యాల ఎవరు కట్టేరో ...
రెండు పెద్ద పెద్ద ఇనప గొలుసులతో కొమ్మకు వేలాడ దీసి కట్టేరు.
ఇనప గొలుసుల రాపిడికి చెట్టు కొమ్మ ఒరుసుకు పోవడం వల్ల , దాని చర్మం చాలా మట్టుకు ఊడిపోయి భయంకరంగా ఉంది.
గొలుసుల కింద మనకెలా కావాలంటే అలా ఊయల బిగించుకోవచ్చట. మంచం కుాడా బిగించుకోవచ్చట.
ప్రస్తుతం దానికి జాలీల గుడ్డ కట్టి ఉంది. అందులో పడుకో వచ్చు కుాడా..
తను రిటైర్ అవడానికింకా పదేళ్ళ సమయం ఉంది.
ఈ లోగా కుాడ బెట్టిన డబ్బుతో తనకు కావలసిన రీతిలో
తన సాంత జాగాలో ఇల్లు కట్టుకుంటే తన రిటైర్ మెంట్ తర్వాత ప్రశాంతంగా, తమ బంధువర్గం మధ్య ఉండవచ్చన్న ఆలోచనతో తన సొంత జాగాలోఇల్లు కట్టడం మొదలెట్టాడు.
ఇల్లు పుార్తయింది గానీ , ఈ చెట్టు,వల్ల వచ్చిన సమస్య తీరలేదు. కారణం తమ ఇంటి సింహద్వారానికి ఎదురుగా
వ్యాపించీ ఉందా చెట్టు. అది కొట్టి పారేస్తే గాని చుట్టుా ప్రహారీ కట్టుకోవడానికిగానీ , గేటు పెట్టుకుందికి గానీ వీలుకాదు.
కొందరు " వందలనాటి కాలపు చెట్టుని కొట్ట వద్ద" ని అంటే..
మరికొందరు "..కాలం మారిందోయ్ ..ఇంకా ఈ పాత చింతకాయ పచ్చడి ఆలోచనలు ఏమిటీ...అందమైన ఇంటికి ఎదురుగా, ఈ దెయ్యాల మర్రి చెట్టేమిటి ..?
కొట్టి పారేయ్" అని మరొ కొందరుా..చెపుతుా ఉఃటే
రాఘవకు ఏం చేయాలో తోచడంలేదు.
చివరికి ఈ చెట్టు ఆకులు రాల్చే సమయంలో..
ఇంటి ప్రాంగణమంతా ఎండుటాకులతో నిండిపోయి
అవి తుడుచుకోలేక కొంత ,ఆకులు రాలిన మొండి చెట్టు వల్ల తనిల్లు నిజంగా దెయ్యాల కొంపలాగే కనపడడంతో . మరికొంత చికాకుతో , చివరికి చెట్టును కొట్టించడానికే సిద్ధపడ్డాడు రాఘవ.
అప్పటికీ రెండు సార్లు కొట్టించేసాడు కుాడా...
కానీ ఉద్యోగ రీత్యా తాను వెళ్ళి తిరిగి వచ్చే సరికి మళ్ళీ
చిరు చిగుర్లతో దర్శనమిస్తొింది సిగ్గులేని చెట్టు
మరింక కాండం వరకు కొట్టిస్తే లాభం లేదు.
ఏకంగా అడుగునుంచి వేర్లతో సహా పెక్కళించేయాలి అనుకుంటుా .ఫోన్ తీసేడు.
**********
ట్రాన్స్‌ఫర్ల కారణంగా ఎక్కడా తనకు సొంత ఇల్లంటుా లేక కావలసినట్టు ఉండలేకపోయాడు. కనీసం కారు , బైకు అన్నా పెట్టుకోవడానికి స్టలం లేని అద్దె ఇళ్ళలో నానా అవస్థలుా పడ్డాడు.
ఇప్పుడు ప్రసాంతంగా ఒక దగ్గర ఉండవచ్చనే ఉద్దేశ్యం తో తను చిన్నప్పుడు ఉండే ఊర్లోనే తన తండ్రి కి వారసత్వపు ఆస్థిగా సంక్రమించిన .జాగాలో అందమైన బంగ్లా లాంటి ఇల్లు కట్టుకున్నాడు. తాతల కాలం నాటి జాగా కావడం వల్ల , ఆ జాగాలో చాలా పెద్ద మట్రి చెట్టు , దాని మధ్యలోంచి పుట్టిన వేపచెట్టుతో కలిపి చాలా విశాలంగా వ్యాపించి ఉంది.
వందేళ్ళనాటి చెట్టుగా అక్కడి గ్రామస్తులు ప్రతీ సొిమ, శనివారాల్లో ఆచెట్టు కింద తొర్రలో దీపం పెట్టడం .అలవాటుగా మారడంతో , దానిని తమ తాత తండ్రులకు , కొట్టించడానికి వీలుకాక అలాగే వదిలేసారు.
అదీ కాక అప్పట్లో సాధారణమైన పెంకుటిల్లు కట్టుకోవడం , సైకిళ్ళవాడకం తప్ప మరో విధానంలో జీవితం ఉండేది కాదు. అప్పట్లో ఆ చెట్టు కిందే రచ్చబండలు జరిగేవని చెప్పుకునేవారు. ఐతే ఆచెట్టు వ్యాపించడం వల్ల దాని ఊడలు మట్టిలో పాతుకు పోయి మరో రెండు చెట్లు లేచిపోయాయి.
దాంతో తన వంతు వచ్చే సరికి అక్కడ
చుట్టుా ప్రహారీ గోడ కట్టడానికి గానీ , కారు పార్కింగ్ కి గానీ ,
కనీసం పెద్ద గేటు పెట్టుకుందికి గానీ అవకాశం కలగడం లేదు. ఏ ముాలో గేటు కట్టుకో డానికి వాస్తు కుదరడం లేదు.
కాకుండా ఇంటి ముందు గేటుండాలి గానీ ఇంకో ముాల
ఉండడమేమిటీ..?
కొత్తగా లేచిన చెట్లు కుాడా చాలా విశాలంగా పెరిగిపోతున్నాయి. దాంతో ఇంత అందమైన ఇల్లు
గేటు లేని ప్రహారీ గోడతో అసహ్యంగా కనిపిస్తున్నాది.
ఆఖరికి తన గురించి ఎవరైనా వస్తే , తన ఇంటి అడ్రస్సు కుాడా "గేటులేని రాఘవ" గారిల్లుగా మారిపోయింది.
అసలు, ఈ మధ్య తమ ఊరు చాలా మారిపోయింది.
ఎవరుా తమ ఇళ్ళ లో మట్టి జాగా ఉంచడమే లేదు .
ఇంటి ప్రహారీల లోపలంతా అందమైన డిజైన టైల్స్ వేయించి
కారుకో షెడ్డు వేసుకొని , అందమైన పెద్ద పేద్ద గేట్లు పెట్టు కొని
దానిమీద తమ ఇంటి నంబరు పేరు రాసుకుంటున్నారు.
అందరిలోకీ ,తనొక్కడే గేటు లేని రాఘవగా మిగిలిపోయేడు.
ఇక లాభం లేదు . రేపెలాగైనా మరెవరినైనా పిలిచి ఈ చెట్టును కుాకటి వేళ్ళతో సహా నరికించేయాలి .
వెధవ చెట్టు, కోలనీ అంతటికీ దిష్టి బొమ్మలా ఉంది.
రాత్రుళ్ళలో దయ్యాల మర్రిలా భయంకరంగా ఉంటుంది.
దానికితోడు గాలికి కిర్రు కిర్రు మని కదిలే ఈ ఉయ్యాల గొలుసులొకటి...
అందరిళ్ళుా ఎంత బాగున్నాయొా..! పెద్ద ఆవరణలలో
కట్టుకున్న విశ్రాంతి మంటపాల కింద కుర్చీల లో కుార్చొని
సాయంత్రం పుాట "టీ "లు తాగుతుా ఎంచక్కా కబుర్లాడు కుంటారో...
తనకా అదృష్టం ఎప్పుడు పడుతుందో ?
మరి ఆలోచించీ లాభంలేదు. అనుకుంటుా కార్పొరేషన్ కి ఫోన్ చేసాడు.
మరో రెండు రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు
వచ్చి చెట్టును పుార్తిగా భుామిలోంచీ పెక్కళించేస్తామని చెప్పేరు.
మరొక్క రెండురోజులాగితే చాలు.
తను అనుకున్నట్టుగానే ఇంటీరియర్ తో సహా అన్నీ
చేయించేస్తాడు.
అనుకుంటుా ఆనందకరమైన ఆలోచనలతో పక్కమీద వాలేడు రాఘవ.
********************
మర్నాడు పొద్దున్నే మున్సిపాలిటీ వర్కర్లు వచ్చి
అంత పెద్ద చెట్టునీ , వేర్లతో సహా పెకళించి చెట్టు మొత్తాన్ని ట్రక్కు మీద వేసుకొని, వెళిపోయారు.
రాఘవ నిశ్ఛింతగా ఊపిరి పీల్చుకున్నాడు
"వెధవ చెట్టు పీడ విరగడైంది" అనుకుంటుా...
ఎండలు తగ్గి వర్షాలు మొదలయ్యేయి.
"వర్షాకాలం దాటేకా ఇంటి పని మొదలెట్టాలి" అనుకుంటుా ,
టి.వి.ఆన్ చేసాడు.
*****::*****************************
వర్షాలు మొదలయ్యేయి. ఇంటి ప్రాంగణమంతా బురద బురదగా ఉంది . రెండు నెలలు గడిచినా వర్షాల ఉధ్రుతం తగ్గలేదు.
ఆరోజు రాత్రి సడన్ గా బాబుకి చికాకు చేసింది
రాఘవ , లలిత బాబుని తీసుకొని ఆదరా బాదరా
కారులో సిటీకి బయలుదేరేరు.
బాబుకి ఊపిరందడం చాలా కష్టమై గిల గిలా కొట్టుకుంటున్నాడు. ఏక్షణంలో బాబు ఊపిరాగిపొితుందో ..
అన్న ఆందోళనతో ఇద్దరికీ మతిపోతోంది.
రాఘవ నుారు కిలోమీటర్ల స్పీడ్ తో కారు పోనిస్తున్నాడు.
బాబు పరిస్థితి చుాసి ,భయానికి ఒంటినిండా చమటలు పడుతున్నాయి రాఘవకి. చేతులు వణుకుతున్నాయి భయానికి. ఈ పరిస్థితిలో కారు నడపడం చాలా కష్టంగా అనిపించింది రాఘవకి .
చివరకు ఎలాగో అలా , సిటీలో ఉన్న పెద్ద ఆసుపత్రికి చేరుకున్నారు.
అప్పటికి తెల్లారిపోయింది .
అక్కడున్న అసిస్టెంట్ డాక్టరు పిల్లాడిని చుాసి ఏదో
ఇంజక్షన్ ఇచ్చేసరికి అరగంటలో బాబు నిద్రలోకి జారిపోయేడు.
పెద్ద డాక్టరు పది గంటలకు వస్తారని ,
అంతవరకు తానేం చేయలేనని , అంతదాకా నిరీక్షించ మని చెప్పి అతను వెళ్ళి .పోయాడు.
చేసేది లేక రాఘవ చేతులు నులుముకుంటుా
బెంచ్ మీద కుాలబడ్డాడు.
లలిత ఎడ్చి ఏడ్చి, బాబు పక్కనే సొమ్మసిల్లినట్టు వాలిపోయింది.
తెల్లారి పదిగంటలవరకు చేసిన నిరీక్షణ, జీవితంలో అనుభవించినపెద్ద శిక్షలా అనిపించింది రాఘవకి.
చివరికి పెద్ద డాక్టర్ గారు వచ్చేరు .బాబుని పరీక్షించి
పుట్టెడు రక్త పరీక్షలు రాసేరు. స్కేనింగులు , ఎక్స్ రే లు, టెష్ట్ లు ,మందులు ,ఇంజక్షన్లకి ఓ లక్ష వదిలించిన తర్వాత , ముందు డాక్టరుగారు తమకు తెలిపిన విషయాన్నే చల్లగా చెప్పేరు.
అదే..బాబుకి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ,
కొద్ది రోజులు ఆక్సిజన్ పెట్టి గుండెను బలంగా కొట్టుకునేట్టు చేసేకా ఆపరేషన్ చేయవలసి వస్తే చేస్తామని , వయసు తక్కువ కాబట్టి ప్రస్తుతం మందులు వాడమని., వాటితో తగ్గిపోతే ఫర్వాలేదుగానీ , లేకపోతే కష్టమనీ....
చెప్పడంతో రాఘవ ,లలిత, బెంబేలు పడిపోయారు.
"ఉన్న ఒక్కగానొక్క కొడుకుని బ్రతికించు దేముడా" అనుకుంటుా కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
వీరి పరిస్థితి చుాసిన డాక్టరు ప్రస్తుతానికి తన దగ్గర ఒక ఆక్సిజన్ సిలెండరు ఉందని , కానీ ఆపై సిలిండర్
కోసం బయటే ప్రయత్నించాలని చెప్పి బాబుకి ఆక్సిజన్, మాస్క్ తగిలించేరు.
ప్రతీ నాలుగు గంటలకు హార్ట్ రీడింగ్ పరీక్షిస్తున్నారు .కానీ హార్డ్ బీట్, రేటింగ్ పెరగడం లేదు .దాంతో రాఘవ బయటికి పరుగెత్తేడు .ఏ చోట అడిగినా ఆక్సిజన్ సిలెండర్లు లేవనే చెపుతున్నారు. అతి కష్టం మీద పదింతల సొమ్ము చెల్లించి, రెండు సిలెండర్లు కొనగలిగేడు.
ఆసుపత్రిలోనే ఒక చిన్న రుాము తీసుకొని , కేంటీన్ భోజనమే చేస్తుా నెల్లాళ్ళు గడిపేరు.
ఉన్న డబ్బంతా ఖర్చైపొితున్నా డాక్టర్లు ఏమీ తేల్చడంలేదు.
ఆక్సిజన్ కోసం పిచ్చివాడిలా తిరుగుతున్న తనతో..
ఒకాయన " ఎక్కడా చెట్లు లేవు , అన్నీ కొట్టిీసీ
బిల్డింగ్ లు కట్టేస్తున్నారు. బావులు ,చెరువులు, నదులు ,
ఎండిపోయినందువల్ల నీళ్ళు లేవు.
పర్యావరణ సమస్య వల్ల , ఉన్న గాలిలో తేమ పొియి ఆక్సిజన్ లేకుండా పోయింది.
ఇంక మన భవితని ఆదేముడే కాపాడాలి" అంటుా సణుగుతుా చక్కా పోయేడు.
రాఘవ అవాక్కైనట్టు ఉండిపోయేడు.
"డబ్బుంటే కొండమీద కోతిని కుాడా దించొచ్చన్న తన
అభిప్రాయం వమ్మైపోయింది.
ఈ రోజు ఊపిరి తీసుకోడానికి ఆక్సిజన్ కరువై తన కొడుకు చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నాడు."
ఇంతడబ్బుా ఉండీ...తనేం చేయలేకపోతున్నాడు.
అనికుంటుా భొోరున ఏడ్చేడు.
"ఈ సమస్య తీరేదెలా"....అనుకుంటుా , నిస్త్రాణగా
ఆసుపత్రికి వచ్చిన రాఘవతో డాక్టర్ గారు , "తమ దగ్గర కుాడా ఆక్సిజన్ ఇంక లేదని , వాడిన మందుల కారణంగా, బాబుకి కొంచం నయంగా ఉందని , బాబుని వీలున్నంత త్వరగా, పచ్చని చెట్లున్న ప్రదేశంలోకి తీసుకెళితే, ఈ సమస్య తొందరగా పరిష్కరించవచ్చని , ఆపై ఆపరేషన్ అవసరం ఉండకపోవచ్చని చెప్పడంతో కాస్త రిలీఫ్ గా అనిపుంచింది రాఘవకి.
ఈ లోపల గానీ ఆక్సిజన్ దొరికితే మళ్ళీ తమ వద్దకు
రమ్మని" చెప్పి ,సాతంత్రం బాబుని డిశ్ఛార్జ్ చేసేస్తామన్నారు.
రాఘవ గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్న భావన.
సాయంత్రం లోపల తానెక్కడ చెట్లున్న ప్రదేశాన్ని వెతకగలడు.
వెతికినా అక్కడ నివాస యొాగ్యంగా ఉండి జన సంచారమన్నా ఉండాలికదా..ఇప్పుడెలా..అనుకుంటుా
చేసేదేమీ లేక చెట్లున్న స్థలాలకోసం ఆదరాబాదరాగా వెతకనారంభించేడు.
ఎక్కడా చెట్లన్నవి కనపడలేదు.పట్నాల్లో గానీ పల్లెల్లోగానీ....
మచ్చుక కైనా ఒక్క చెట్టు కుాడా కనపడలేదు.
పార్కుల్లో కుాడా , కుార్చోడానికి బెంచీలు , ప్రతీ బెంచీ వెనకాల మొబైల్ రీఛార్జ్ కోసం పవర్ పాయింట్లు..
ఒచ్చిన వాళ్ళు తినడానికి , తాగడానికి కావలసినవి కొనుక్కోడానికి ఒక రెష్టారెంటు తప్ప, చెట్లన్నవి కనబడలేదు.
నీడ కోసం షెడ్డులు , వాటి చుట్టుా కృత్రిమ పుాలతో నిండిన గోలేలు తనను వెక్కిరిస్తుా కనపడ్డాయి.
కొందరింట్లో ఉన్నా, వాళ్లు రాఘవ కుటుంబంతో
సహా అక్కడే ఉండడానికి అనుమతించలేదు.
డాక్టర్స్ ని బతిమలాడి మరో పది రోజులు ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆ పది రోజులుా పగలంతా రాఘవ చెట్లున్న స్థలమన్నా దొరికితే ,చిన్న షెడ్డన్నా వేసుకొని ఉండొచ్చన్న నిర్ణయంతో అలా తిరుగుతుానే ఉన్నాడు.
ఫలితం మాత్రం సుాన్యం. పదిరోజులుా పది నిముషాల్లా గడిచిపోయాయి.
రాఘవకి ఒళ్ళు చల్లబడుతున్నాది.
చేసేది లేక ఆ రోజు సాయంత్రం బాబుని తీసుకుని తన ఇంటికి బయలుదేరేడు.
ఇంటికి గేటు లేని కారణంగా కారుని లోపలికి తీసుకుపోదామనుకున్న రాఘవకు తన ఇంటి ముందున్న పెద్ద గొయ్యి వెక్కిరిస్తున్నట్టు కనిపించింది.
అక్కడున్న వందేళ్ళ మర్రి చెట్టు నేలకుాల్చిన సంఘటన కళ్ళముందు కనపడింది.
రాఘవ కారులోంచీ దిగి , ఆ గొయ్య ముందు కుాలబడ్డాడు
పుట్టెడు దుఃఖంతో వలవలా ఏడవ సాగేడు ..
" ఎంత పని చేసానమ్మా ! నీ విలువ తెలుసుకోలేకపోయేను.
నిన్ను అవమానించేను, తిట్టేను, కొట్టేను , ఐనా చల్లటి నీడనిచ్చేందుకు మళ్ళీ మళ్ళీ పుడుతుానే వచ్చావు.
నీతో పాటు వేప చెట్టుని కుాడా విడవకుండా వస్తుా...
పంచుతున్న చల్లటి గాలి విలువను గుర్తించలేని- ముార్ఖత్వంతో, నిన్ను నిలువునా కుాకటి వేళ్ళతో సహా కుాల్చేశానమ్మా .. నన్ను మన్నించు.
నేను చేసిన పాపానికి శిక్ష , మా ఒక్కగానొక్క బాబు అనుభవిస్తున్నాడు.
మమ్మల్ని క్షమించి వాడిని కాపాడుకొనే దారి చుాపించమ్మా " అంటుా దిర్లి దొర్లి ఏడుస్తుా ఆ చెట్టు తల్లి ఉన్న చోట ఆప్యాయంగా తడుముతున్నాడు.
సడన్ గా రాఘవకి ఒక చిన్ని చిగురు కొమ్మ కనిపించింది..
గబ గబా దాని చుట్టుా ఉన్న మట్టి తీసి చుాసేడు
దుఃఖం , ఆశ్ఛర్యం , ఆనందం అన్నీ కలిన గొంతుతో ఒక్క సారిగా పెద్ద కేక పెట్టేడు.
నా చెట్టు తల్లి మళ్ళీ చిగిర్చిందంటుా ...
పిచ్చి వాడిలా నాట్యం చేస్తున్నాడు ..
చుాస్తుాండగానే మరో మొలక మరో మొలక ...అలా...ప్రాంగణమంతా ఆకుపచ్చని చిగురు మొలకలు పుట్టు కొస్తున్నాయి.
రాఘవ ఆనందానికి అంతం లేకుండా పొియింది.
తన కొడుకు బ్రతుకుతాడు...
వాడికి మరే డాక్టరుా అవసరం లేదు...అంటుా
ఒక్క గెంతు గెంతేడు.
*****************
ధబ్బు మన్న చప్పుడుకి కళ్ళు తెరిచిన లలిత ,
రాఘవ మంచం మించి కింద పడడం గమనించి
"అయ్యొా ఏమైందండీ..!.భయంకరమైన ..కలగానీ వచ్చిందా! "..అంటుా గాభరాగా వచ్చి లేవనెత్తింది.
రాఘవ బిత్తర చుాపులు చుాస్తుా అలాగే బిగుసుకు పోయాడు. రాఘవ ఒళ్ళంతా చమటతో తడిసిపోతోంది.
రాఘవ ,బాబు కోసం చుాసేడు
తమ పక్కనున్న మంచం మీద బాబు హాయిగా నిద్దరపోతున్నాడు.
అంతే..రాఘవ చటుక్కున లలితను పక్కకుతోసి
ఒక్క ఉదుటున అవతలకి పరుగెత్తేడు.
లలితకేమీ అర్ధం కాలేదు.
"ఈయనకి గానీ పిచ్చెక్కిందా .ఏమి." అనుకుంటుా భయంగా రాఘవ వెనకాలే వెళ్ళింది గాభరా పడుతుా..
రాఘవ తిన్నగా హాలు లోకి వచ్చి మెయిన్ డోర్ ఓపెన్ చేసి అవతలకి పరుగెత్తేడు.
ఎదురుగా మర్రి చెట్టు...
చిరుగాలికి ఊగుతుా చిగురుటాకులతో తనకు స్వాగతం పలుకుతుాన్నట్టు...హుందాగా...
అంతే రాఘవ పరుగెత్తుకు వెళ్ళి ఆసాంతం చెట్టును ఆలింగనం చేసుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు.
అప్పటికే తెల్లారిపోయింది.
రాఘవ చుట్టుా చుాసేడు. వర్షాకాలం అవడం వల్ల ఎన్నో చిన్న చిన్న మొక్కలు పుట్టుకొచ్చేయి. అంతే..
రాఘవ ఒక పార, గునపం తీసుకొని , ఆక్కడున్న పనికొచ్చిన మొక్కలన్నిటినీ వరుసగా పాతుకుంటుా వచ్చేడు.
ప్రాంగణం నిండా మొలిచిన పచ్చ గడ్డిని, తివాచీ మాదిరి
కత్తిరించుకుంటుా పోయేడు.
బౌండ్రీ కడదామనికున్న చోట ప్రతీ ఐదడుగుల దుారంలోనుా
ఒకొక్క గొయ్యి తీస్తుా వచ్చేడు .
ఇంతలో మున్సిపాలిటీ వాళ్ళు రానే వచ్చేరు.
రాఘవ వారితో ఏదో చెప్పి తిరిగి పంపేసాడు.
ఆ తర్వాత రోడ్లన్నీ తిరిగి, సేకరించిన మొక్కలన్నీ తెచ్చి , తను తవ్విన జాగాల్లో పాతేడు.
లలిత ఇదంతా ఆశ్ఛర్యంగా చుాస్తున్నాది.
పొద్దున్న పదకొండుదాకా పనిచేదిన రాఘవ మర్రి చెట్టుకు కట్టి ఉన్న ఉయ్యాలలో మొదటి సారి కుార్చున్నాడు .ఆనందంగా..
****************
బాబు లేచేడు . నిటారుగా ఉన్న మర్రి చెట్టుని ,నీటుగా ఉన్న ప్రాంగణాన్నీ చుాసి ఆశ్ఛర్యపోయేడు.
రోజులు, నెలలు, వత్సరాలుా గడిచేయి. ప్రాంగణం నిండా లేచి గుబురుగా పెరిగిన మొక్కల మధ్య ఆడుకున్న బాబుకి ఆరోగ్యం కుదుటబడింది.
ఇప్పుడు రాఘవ , రాఘవయ్యగా పిలువబడుతున్నాడు.
తమ ఇంటి పశ్ఛిమంలో కారు కోసం పెద్ద గేటును కట్టేడు.
ఇంటి ముందర చెట్టు మొదలుకి ఆనుకున్నట్టుగా చిన్న గేటును అమర్చి, చెట్టు చుట్టుా కొత్తగా అరుగు కట్టించేడు.
రోడ్డు వరకు విస్తరించి నీడ నిస్తున్న చెట్టు కింద చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు.
గేటుకవతల రాఘవ కట్టించినసిమెంటు బెంచీల మీద , సాయంత్రం అయేసరికి ఎందరో పెద్దలు, వృద్ధులు వచ్చి లోకాభి రామాయణం మాట్లాడుకుంటున్నారు. ఎక్కడో పని చేసే వర్కర్లు ,
ఈ చెట్టు కిందకే వచ్చి , తమ తమ చద్ది ముాటలు విప్పి
భోజనం చేసాకా , ఆ చెట్టు నీడలోనే , తమ గావంచాలు పరుచుకొని సేద తీరుతున్నారు.
పండగలకి, పున్నాలకి, రాఘవయ్య అక్కడికి వచ్చిన అందరికీ బహుమతులతో పాటు , మొక్కలను పంచుతున్నాడు. ఇప్పుడు ఆవుారిలో అంతా పచ్చదనమే.
పిల్లలంతా రాఘవయ్యని "చెట్ల తాతయ్య "అని పిలుస్తుాంటే, రాఘవయ్య ఆనందంగా నవ్వుకుంటున్నాడు.
ఇపుడు రాఘవయ్య రోజుా లేవగానే
"చెట్టు తల్లీ బాగున్నావా "అంటుా ఆ మర్రి చెట్టుని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఆ చెట్టు దగ్గరే కుార్చొని
పేపరు చదువుకుంటాడు.
*********************
ఇలా ఓ రాత్రి రాఘవకు వచ్చిన ఒక్క కల, అతని జీవితాన్నే కాదు , ఊరు మొత్తాన్ని మార్చేసింది.
ఇప్పుడు ఆ వుారు " చెట్ల తాతయ్య ఊరుగా" ప్రసిద్ధికెక్కిపోయింది.
మర్రి చెట్టు నీడలోనే రోజంతా గడుపుతున్న రాఘవయ్య ,
అదే మర్రి చెట్టు కింద అంతిమ స్వాశ వదిలేసాడు.
ఊరి జనం అంతా కన్నీళ్ళతో రాఘవయ్యకు వీడుకోలు పలికేరు.
------------------------
ఒక రోజు పెద్దవాడై ఉద్యోగం చేస్తున్న రాఘవయ్య కొడుకు
"హర్ష " , ఒక పెద్ద బోర్డ్ మీద "చెట్టు తల్లికి ప్రేమతో "
అని రాయించి ,దానికింద నమస్కరిస్తున్న తన తండ్రి , రాఘవయ్య ఫొటో ఒకటి పెట్టి చెట్టుకువేలాడ దీసేడు.
ఆ చెట్టుతో పాటు పెరిగిన ఎన్నో చెట్లు చల్లని గాలితో ,
హాయైన నీడతో, వచ్చి పొియేవారికి స్వాగతం పలుకుతున్నా , ఆ వుారి జనం మాత్రం
"రాఘవయ్య చెట్టు "కిందే సేద దీరుతున్నారు.
పిల్లలకు ఇప్పటికీ అదే ఆటస్థలమైపోయింది.
సాయంత్రాలు ఆ చెట్టు చుట్టుా ఉన్న చప్టా మీదే
ఊరి పెద్దలు ఊసులాడుకుంటారు..
రాఘవయ్య గొప్పతనాన్ని తలుచుకుంటుా.....
అన్నీ చుాస్తున్న "చెట్టుతల్లి "మాత్రం అలాగే తన చల్లటి నీడను , స్వశ్ఛమైన ప్రాణవాయువును ,అందరికీ
పంచుతుా దర్పంగా నిశ్ఛలంగా అలాగే నిలబడి ఉంది.
----------------------------------------
హామీ :
ఈ కధ నా స్వీయ రచన.
.
No comments:
Post a Comment