Friday, May 12, 2023

(మాతృదినోత్సవం )అమ్మా...! నన్ను క్షమించవుా."..?

13/05/2023.
అంశం : మాతృదినోత్సవం.

శీర్షిక :"అమ్మా...! నన్ను క్షమించవుా."..?

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .
 
క్రమసంఖ్య :  2023.

నేను అమ్మనయ్యాకా  తెలుసుకున్నాను  
అమ్మంటే ఏమిటో.."
నా బిడ్డ అకలికి ఏడుస్తుాంటే 
తెలుసుకున్నా.,"తల్లి ప్రేమంటే " ఏమిటో..॥

నా పాప పగలంతా నిదరోతుా 
రాత్రి ఆటలాడుతున్న పుడు తెలుసుకున్నా..
"అమ్మని , సహనానికి ప్రతీకని"  ఎందుకంటారో...॥

సమయానికి అందరికీ అన్నీ
 అమరుస్తున్నపుడనుకున్నా....
"అమ్మంటే, అవిశ్రాంత రాట్నమని...".,॥

నా పాప  నన్నెదిరించినపుడు తెలిసింది,
అమ్మ  నావల్ల "మానసికంగా ఎంత కుంగిపోయిందో .."
.
అమ్మ అనంతలోకాలకు చేరుకున్నాకా 
తెలిసుకున్నా ,పరిపుార్ణమైన త్యాగానికి 
"అమ్మకు అమ్మే సాటని ,".॥

ఈ నాడు అమ్మనైన నాకు "అమ్మంటే ఏమిటో"
తెలిసింది., 
కానీ నా తప్పులు క్షమించమని అడగడానికి 
"అమ్మ" లేదు., ఐనా అడుగుతున్నా....
"అమ్మా...! నన్ను క్షమించవుా."..?॥







No comments:

Post a Comment