ప్రక్రియ: గజల్.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
ఈ వీణ పలికించు రాగాలె నీకొరకు
నాకీర్తు లేనీకు భోగాలు క్రిష్ణయ్య
నీ పెదవి పలికించు ఆవేణు నాదాలు
నామనసు మురిపించి మరపించు క్రిష్ణయ్య ॥
అందాల మొాముపై కదలాడు నీనవ్వు
అరవిరియు సుమగంధ మధురిమే క్రిష్ణయ్య
ఆనీలి కన్నుల్లొ కదలాడు నీడలే
నాప్రేమ చిత్రాలు గమనించు క్రిష్ణయ్య ॥
నీపాద సవ్వడే నాగుండె లయలుగా
ఉచ్ఛ్వాశ నిశ్వాశ గతులాయె క్రిష్ణయ్య
ఏ జన్మ బంధమొా ఏ పుణ్య ఫలితమొా
నీరాగ సుధల లో తేలేను క్రిష్ణయ్య ॥
సమీక్ష
అందాల మొాముపై కదలాడు నీనవ్వు
అరవిరియు సుమగంధ మధురిమే క్రిష్ణయ్య
ఆనీలి కన్నుల్లొ కదలాడు నీడలే
నాప్రేమ చిత్రాలు గమనించు క్రిష్ణయ్య ॥
అంటూ తమరు వ్రాసిన గజల్ చాలా చాలా బాగుంది మేడం 🙏🙏🙏
No comments:
Post a Comment