ప్రక్రియ : ఇష్టపది .
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : అమ్మే తొలి దైవము.
కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥
నవ మాసముల బరువు నాకై మొాసిందమ్మ
తన రక్త మాంసాలె తరగి పోయిన సుమ్మ ॥
కనులిప్పి చుాసిన కనబడే ప్రపంచముా
తొలి పలుకుల అందము తోడైన బంధముా ॥
కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥
*******************************
నా జన్మకు ముాలము నను గాచిన వరము
అమ్మ ఒడే లోకము ఆమ్మే నా సర్వము ॥
క్షీరామృతము పోసి క్షితిని పెంచినదమ్మ
నా ఉనికి ముాలమై నన్ను గాచిన కొమ్మ ॥
నా ఆకలి తీర్చిన నాకామృత పానము
అడగకనె అమ్మిడిన అతి మధుర క్షీరము ॥ కరు॥
కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥
*******************************
నడక నెర్పిన తల్లి నడత నేర్పిన తల్లి
తన కంటి వెలుగంటు తడిమె ప్రేమతొ తల్లి ॥
కలిత కరుణా ముార్తి లలిత కోమల గాత్రి
పలుకు మాటలె నోట బతుకు రక్షకు కోట ॥
భవిత బంగరు బాట భయము లేదను మాట
అమ్మ ఉండెడు చోట అవనలరు పుాదోట ॥
ఆ ఈశ్వరి కృపతో ఆవతరించినదమ్మ
ఈ భువి నా కోర్కెలు ఈడేర్చు సుమ్మ ॥
**********************************
నా నవ్వుకు పొంగెను నా బాధకు కుంగెను
నేనే తన లోకము నేనే తన ప్రాణము॥
నా కోసమె బ్రతికెే నా జీవిత స్ఫుార్తీ
అలరు ప్రేమను పంచు అనురాగపు ముార్తీ ॥
అమ్మున్న చాలు గా అవని గెలుపు నీదెగ
అమ్మ దీవెన మనకు ఆ వేల్పుల వరముగ ॥
తల్లిదండ్రుల సేవే తరగని మన పెన్నిధి
ముక్కోటి దేవతలు మురిసి ముక్తి నిడునది ॥
అమ్మ ఆది గురువుగా ఆమె మార్గదర్శిగా
అమ్మ త్యాగ ముార్తిగ అనురాగ దీప్తిగా
కరుణించు దేవతై గావ వచ్చిన కొమ్మ
కనులిప్పి చుాడగా కనిపించినది అమ్మ ॥
అమ్మ కామేశ్వరిని అడిగే జగదీశ్వరి
జన్మలెన్ని ఉన్నను జన్మనీ ఒడన్నదీ ॥
***********************************
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment