Thursday, June 16, 2022

సప్త తాళ కీర్తనలు లిరిక్స్

[6/7/2019, 22:37] p3: శ్రీ రాజరాజేశ్వరీ. శివే.   సప్తతాళ కీర్తన మాయామాళవగౌళ  రాగం  మఠ్య తాళం.
[6/7/2019, 22:41] p3:     చతురస్రజాతి మఠ్యతాళం.  10 క్రియలు
1.లఘువు. 1. ధ్రుతం . 1. లఘువు. (1.0.1 )
           మాయామాళవగౌళ రాగం.
  ఆరోహణ =  స ,రిశు,గఅం,మశు ,ప ,ధశు,       నికా ,స  ॥స.॥
అవరోహణ = స , నికా , ధశు , ప,  మశు,  గఅం , రిశు  , స  ॥
--------------------------------------------------------------------
పల్లవి.
----------
శ్రీ రాజరాజేశ్వరీ..శివే...శంకరి.......
అ॥ ప॥
-----------
శ్రీచక్ర సంచారిణీ...చిత్స్వరుాపిణీ శ్యామల గౌరీ..
                ॥   శ్రీ రాజరాజేశ్వరీ.. ॥

చరణం.
------------
పరమ దయాకరి పంకజ లోచనీ
పురభంజను సతి పాహీ భవానీ...॥
సర్వసిద్ధిప్రద త్రిజగత్కల్యాణీ...॥ 2 ॥
సరస సంగీత సాహిత్య మొాదిని  పావని.॥శ్రీ॥

చరణం.
---------
నాదబ్రహ్మమయానందే    నాట్యరతే...
నారాయణేనార్చితశ్రిత నుాపుర పాదే...॥2॥
బిందు మధ్యస్థితానందానందవిభుాతే....
వేదనుతే సద్గుణమణి శైలసుతే...॥2॥

మధ్యమకాలం:
--------------------

చింతామణిమయ ద్వీప నగరే
చిద్ఘనానంద చిన్మయి మంత్రస్వరుాపే...॥2 ॥
సుందర దరహాసోజ్వలదీప్తే లలితే....
కలిత భవార్ణవ తారణ నౌకే...॥2॥
         ॥  శ్రీరాజరాజేశ్వరీ ॥

--------------------------------------------------

రచన , స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------
[6/7/2019, 22:43] p3:   ధ్యాన కీర్తన. 
--------------------
పుార్వికల్యాణి రాగం.  ఆదితాళం.
---------------------------------------------
పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥
అనుపల్లవి.
--------------
కామకోటి పీఠ వాసినీ.....ఈ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥2 ॥  హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ - 
రమణి మణీ రస రాగ రంజనీ..॥ 2 ॥
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
-------------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...॥ 2 ॥
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥2॥.హిమ॥
3. చరణం.
---------------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥
------------------------------------------------------------
రచన + స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
[6/7/2019, 22:45] p3: కల్యాణి రాగం. ఆది తాళం.
అరో॥  స, రిచ, గఅం, మప్ర , ప,  ధచ, నికా, స  ॥
అవ ॥  స  ని  ధ  ప  మ  గ  రి  స  ॥
-----------------------------------
పల్లవి.
-----------
నిరుపమగుణ సదనీ వాణీ
నీరజాక్షి జయ నిత్య కల్యాణి..॥ నిరుపమ ॥
అనుపల్లవి.
--------------
వరదాయకి వాణీ....కర రాజిత
వర మ్రదు వీణా పాణీ....॥ వర॥ నిరుపమ ॥
చరణం.
-----------
శరదిందు శోభిత సుందర వదనీ..
రాగాది స్వర, లయ, సంగీత సదనీ..॥
ఓంకార నాదాది ప్రణవ ప్రసుానే..
వాగ్విలాసిని వరదే కల్యాణీ...॥ నిరుపమ ॥
చరణం.
-----------
బ్రహ్మ  మానస జాయే మాత్రే..
శ్రుతి  సామ గాన సుధా రస పుార్తే..
అక్షయతేజో రుాప సుగాత్రే..
కచ్ఛతి వీణా వాదిని వంద్యే...॥ నిరుపమ ॥
-----------------------------------------------------------
రచన, :స్వరకల్పన...
శ్రీమతి , పుల్లాభట్ల - 
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
[6/12/2019, 11:13] p3:             చతురస్రజాతి..ధ్రువ తాళం.
                        నాట రాగం. 
ఆరోహణ =స, రిష, గఅం, మశు ,ప, ధష  ,నికా ,స.   అవరోహణ =    స  ని  ధ  ప  మ  గ  రి   స  ॥
                  14 క్రియలు.  ( l0ll ).
        లఘవు , ధ్రుతం , లఘువు , లఘువు.
   == =l             0            l              l   .
--------------------------------------------------
పల్లవి .
-----------
అఖిలాండేశ్వరీ శివే ,ఆగమ వినుతే,అంబ భవానీ..
అనుపల్లవి.
----------------
సుఖ సాగర లహరీ, సురేశ్వరీ, సుందరి ,శివసహితే..
                                                  అఖిలాండేశ్వరీ॥
చరణం.
----------
లక్ష్మీ ,వాణీ, సన్నుత చరణే, హరి-సోదరి మాన్యే
యక్షరాజ సఖ, అర్ధ శరీరిణి , దేవీ ముని ధ్యానే..
మధ్యమకాలం.
---------------------
రాకా శశిముఖి, రాజీవ-లోచని, 
రత్న-సింహాసన-రాజిత రాజ్నీ రమణి మణీ ...
మ్రుగ వాహిని గుణమణి సుగుణ ధనీ...॥

ప్రాకారీ ప్రముఖార్చిత సేవిత ..మంజుల తర శుభ కామిని, కోమల పదయుగనే
పాహీ పావని గజగమనే....॥అఖిలాండేశ్వరీ ॥
చరణం 2.
--------------
స్మిత సిత సుందరి, చంద్ర కళాధరి , దేవీ వేదనుతే
నతజన సేవిత త్రిజగద్వందిత దేవీ యొాగ శిఖే..
మధ్యమకాలం.
-------------------
చక్రాయుధ ధరి, శ్రీ చక్రోపరి-స్థిత కమలాశని, 
దుర్దశ నాసిని దురిత శమే....భవ-సాగర- 
తారణి  కలి హరణెే.....॥
ఛిద్రుాపీ శివ తాండవ లయకరి , నాదా నందిత
నాట్యరతే , శివ- శంకరు కామిని శైలసుతే....శివ వినుతే॥ అఖిలాండేశ్వరీ..॥

షట్ శ్రుతి రిషభం.
అంతర గాంధారం.
శుధ్ధ మధ్యమం.
కాకలి నిషాదం.
---------------------------------------------------------
రచన, స్వర కల్పన..
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి..
కల్యాణ్.
-------------

.
[6/12/2019, 14:45] p3:                   శరణాగత వత్సలే...
                      ఆభోగి రాగం.
ఆరో॥    స -  రిచ  -గసా  -మశు  - ధచ -  స  ॥
అవ ॥   స    ధ     మ     గ     రి     స    ॥
            చతురస్ర జాతి ఝంపె తాళం.
10. క్రియలు. 1.లఘవు..1అనుధ్రుతం ..1 ధ్రుతం
        ఆరు వేళ్ళు , అర ఉసి , పుార్తి ఉసి .
---------------------------------------------------------
పల్లవి:
-----------
శరణాగత వత్సలే  శంకరీ శివే...॥

అనుపల్లవి:
-----------------
పరమేశ్వరీ పరే...లలితే...పాహిమాం..॥

చరణం:
-------------

హిమవత్పర్వత రాజకుమారీశ్వరీ...
హైమవతీ హరి సోదరీ..గౌరీ.....
కామకోటి  శ్రీపీఠాది విలసితే.....
కామ రాగాదిరస  షడ్రిపు విదళితే..   ॥

చరణం:
------------

కమలాశన స్థిత ప్రణవాకార దీప్తే
మిధ్యా మాయా..మొాహవికారే పరే...
తామస గుణ ఘన త్రిగుణ రహితే..హితే
సామ గాన ప్రియ సంపుాజిత గుణ నుతే..॥

----------------------------------------------------------

రచన , స్వర కల్పన ,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------
[6/12/2019, 14:57] p3:         53 వ మేళకర్త  ఐన గమనశ్రమ జన్యం          
                     హంసానందిరాగం.
ఆరోహణ =స- రిషట్- గఅం-మప్ర- ధచ- నికా-  స   
అవరోహణ=      స  ని  ధ  మ  గ  రి  స 
చతురస్ర జాతి , రుాపక తాళం. (ఆరు క్రియలు.)
               1. ధ్రుతం. 1.లఘువు. ( 0 . 1).
                            0             1
--------------------------------------------------------------------
పల్లవి :
---------
శివానందమయ లహరీ -- శాంకరి హిమగిరీశ్వరీ
శక్తి స్వరుాపిణి దేవీ-- శ్రీ (చక్రేశ్వరి )లలితే...

అను పల్లవి:
-----------------
కామకోటి శ్రీ పీఠనివాశిని శివ  కల్యాణీ...
కామ దహను ప్రియ సతీ శివే శర్వాణీ...

చరణం:
------------
చింతామణిమయ ద్వీప వాశినీ శ్రీమాత్రే..
చిద్ఘనే శుద్ధ మంత్రమయే... మంగళ గాత్రే..
సోమ సుార్యాగ్ని నయనే....సౌరి భయంకరి
సామవేద సంస్తుత శ్రుతి  కీర్తే  ...శుభంకరి..॥

చరణం :
------------
శబ్ద బ్రహ్మమయి సకల భువన వ్యాప్తే హితే
ఓంకార ప్రణవాది స్వరుాప మంత్ర ద్యుతే..
నాదబిందుమయి నాదానందానురక్తే  స్థితే
నారాయణీ శివ నాట్య రసాద్భుత స్ఫుార్తే..॥

మధ్యమకాలం :
----------------------
తధ్ధిమిత ధిం ధిం సు ఢక్కా నినాదానందే రతే
తధ్ధిమ్మి తకధిమ్మి   సంగీత సాహిత్య సింధే పరే
సిధ్ధే సుసిధ్ధే ప్రపంచైకానంతే అనంతానంతే..
అజేయే అమేయే అభేద్యే శుభే జోత్యఖండే శివాంగే..
            ॥  శివానందమయలహరీ...॥
----------------------------------------------------------------

రచన, స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------
[6/12/2019, 21:56] p3:             బాల త్రిపుర సుందరీ.
                   తోడి  రాగం.
ఆరో ॥   స  , రిశు, గసా , మశు  , ప ,  ధశు ,  నికై  , స   ॥
అవ॥     స ,  నికై ,  ధశు,   ప,   మశు,  గసా,   రిశు ,  స   ॥
      చతురస్రజాతి  త్రిపుట తాళం.
                    7. క్రియలు.
      ఒక లఘువు...రెండు ధ్రుతాలు.
           ( అసావేరిలో  పాడేను).
----------------------------------------------------------
పల్లవి:
బాల త్రపుర సుందరీ.. ,పాహిమాం పరమేశ్వరీ...

అనుపల్లవి:
శైల రాజ ప్రియ నందినీ , ఫాలనేత్రు ప్రియ భామినీ॥

చరణాలు :
------------

1.  కోటి సుార్య ప్రకాశినీ  --   ఖేటకాస్త్ర కర ధారిణీ..
     దుష్ట  దైత్య సంహారిణీ -- శిష్టత్రాణ పరాయణీ ॥

2.  మంత్ర తంత్ర సంవాస గుహే -- శ్రీకరీ ప్రణవాక్రుతే
     పంచాక్షర మంత్రార్చితే --బీజాక్షరి శ్రీ   మాత్ర్రుకే

3.  ఆగమాది నుత శ్రీప్రదే.----శ్రితజనాత్కల్ప లతికే
     శైల తీర్ధ వర వైభవే ---- శాంకరీ కరుణార్ణవే....॥

4.  ధ్యానయొాగ సంపుార్ణమయే- జ్ఞాన కమల -                                           మకరందమయే....
    వేద విదిత సంపుాజ్యమయే- నాద భరిత-
                                       స్వర శబ్దమయే....॥

5.  చక్ర రాజ స్థిత శ్రీకరీ..  త్రిపురాది చక్రేశ్వరీ...
     శక్తి అష్ట - శిద్ధేశ్వరీ  -  సుందరీ  జగదీశ్వరీ.....॥

-------------------------------------------------------------

రచన, స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------
[6/12/2019, 22:07] p3:              6. పద్మలోచనీ..భవానీ...
                శంకరాభరణం రాగం.
ఆరో=   స, రిచ, గఅం, మశు ,ప , ధచ , నికా , స.॥
అవ== స  , ని , ధ , ప , మ , గ , రి , స ॥
            ఖండజాతి అట తాళం.
                   14. క్రియలు. 
          2- లఘవులు,2- ధ్రుతాలు
            ( 4.వేళ్ళు ఒక లఘవు. )
-------------------------------------------------------------------
పల్లవి:
--------
పద్మలోచనీ..భవానీ...పాలయమాం గౌరీ..పరి
పాలయమాం..గౌరీ....

శివంకరి శంకరి శివసతి ఈశ్వరీ.....॥

చరణం:
-----------
-పాశాంకుశ ధ్వజ  సుదర్శన రాజిత సింహాసనే..
-పద్మ మాలా ధరీ  పద్మ సులోచనీ పావని శశి వదనే
-పద్మనాభ ప్రియ సొిదరీ సుందరి గుణ సదనే
- పద్మాశనాది సుర ముని వందిత కోమల శుభ చరణే......॥ ॥

చరణం:-
-----------
నాదబిందుమయి యొాగజ్ఞానానందే నిగమ వినుతే
మ్రుదు మందస్మిత మ్రుగమదోజ్వల ఫాల తిలకే
సాధు జనాశ్రిత త్రిజగద్వందిత శ్రీచక్ర రాజ నిలయే
బోధానందామ్రుత రస పుారిత భావనే సంపుార్ణే...॥

---------------------------------------------------------------
రచన, స్వరకల్పన-
శ్రీమతి, పుల్లాభట్ల, 
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------------
[6/12/2019, 22:43] p3:                      శ్రీ....రాజరాజేశ్వరీ...
                     శ్రీరాగం. మంగళం.
ఆరో॥  స ,  రిచ ,  మశు ,   ప ,  నికై,   స  ॥
అవ॥   స  , ని  , ప  , మ ,  రి,   గసా ,  రి ,  స   ॥
                 ఖండజాతి ఏక తాళం.
                   దెబ్బ..నాలుగు వేళ్ళు.
       ---------------------------------------------------------
పల్లవి:
-----------
శ్రీ.....రాజరాజేశ్వరీ....పాలయే..శంకరీ....శివే...

అనుపల్లవి:
----------------
శ్రీ.....చక్ర సంచారిణీ..శ్రీకరి , మణిద్వీప  వాసిని లలితే--------॥శ్రీ....॥

చరణం:
-------------
ఇందుకళాధరు సుందరీ..నారాయణి
నంద నందను సోదరీ ....ఘనీ...॥
బిందు మణ్డలా..వాసినీ...పావని..
కామకోటి పీఠ విలాసినీ..జననీ...॥ శ్రీ ॥
మధ్యమకాలం:
---------------------
కోటి బాలార్కవర్ణే  అపర్ణే...
కనక కుసుమ కీర్ణే ...శ్యామల వర్ణే
కరధ్రుతేక్షు పాశాంకుశ పుష్ప బాణే
కామేశ్వరీ శ్రీ లలితే భవానీ.. ॥ శ్రీ ॥

చరణం:
------------
నిఖిల నిగమాంత నుత పదే మానిని
క్షిత్యాదీ  తత్వ స్వరుాపిణీ   భవానీ..
అ క చ ట త   పా..దివర్ణే...సంపుార్ణే
అక్షర మాత్రుకే త్రిపుర సుందరీ భవానీ..॥శ్రీ॥

మధ్యమకాలం.
---------------------
చింతామణిమయ మందిర స్థితే 
శివ కామేశ్వరి చిన్మాత్రే పరే
బ్రహ్మ , శివా , విష్ణుా నఖ ప్రకటిత
బ్రహ్మాండ నాయమకి , 
శివయువతే..శైలసుతే..॥-

---------------------------------------------
రచన , స్వర కల్పన,
శ్రీమతి పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
--------------
[6/13/2019, 16:25] p3:            రజతాచలాగ్ర నిలయే..
            మధ్యమావతి రాగం.
ఆ ==   స,  రిచ,   మశు,  ప ,  ని కెై ,  స.॥
అ====స    ని    ప     మ     రి     స ॥
          చతురస్ర జాతి ఏకతాళం.
                   4. క్రియలు.  
           (4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
   శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..

   అను పల్లవి:
---------------------
   అజయే దయార్ద్ర ,  హ్రుదయే జయే
   జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥

  చరణం:
--------------

--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన   స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి   ॥ రజతా ॥

చరణం:
------------

----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే......   ,.హితే...
----సర్వ సుపర్వ  ,  సంపుాజిత  కీర్తే...

మధ్యమకాలం:
---------------------

      షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి 
                     చక్ర రాజ వలయే...
      షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
                     సుందరి శ్రీ గిరి నిలయే..
     శుంభ-నిశుంభాది కైటభ భంజని
                    మహిషాద్యాసురగణ దమనే..
      అరిషడ్వర్గ విదారిణి గుణమణి
                  జగదంబా పరమశివే.....॥ రజతా ॥

---------------------------------------------------------------

రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------
[8/27/2019, 18:54] p3:            రజతాచలాగ్ర నిలయే..
            మధ్యమావతి రాగం.
ఆ ==   స,  రిచ,   మశు,  ప ,  ని కెై ,  స.॥
అ====స    ని    ప     మ     రి     స ॥
          చతురస్ర జాతి ఏకతాళం.
                   4. క్రియలు.  
           (4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
   శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..

   అను పల్లవి:
---------------------
   అజయే దయార్ద్ర ,  హ్రుదయే జయే
   జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥

  చరణం:
--------------

--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన   స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి   ॥ రజతా ॥

చరణం:
------------

----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే......   ,.హితే...
----సర్వ సుపర్వ  ,  సంపుాజిత  కీర్తే...

మధ్యమకాలం:
---------------------

      షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి 
                     చక్ర రాజ వలయే...
      షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
                     సుందరి శ్రీ గిరి నిలయే..
     శుంభ-నిశుంభాది కైటభ భంజని
                    మహిషాద్యాసురగణ దమనే..
      అరిషడ్వర్గ విదారిణి గుణమణి
                  జగదంబా పరమశివే.....॥ రజతా ॥

---------------------------------------------------------------

రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------

Wednesday, June 15, 2022

గోరసంవారి కథానిక ( ప్రథమస్థానం .)

గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.1 కొరకు

అంశం: ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర

శీర్షిక: రైలు పట్టాలు
పేరు: గుడిపూడి రాధికారాణి
ఊరు: మచిలీపట్నం

*రైలు పట్టాలు*

     గేటు చప్పుడైతే ఎవరా అని వంటింట్లోంచి తొంగిచూసిన జానకి మొహం కూతుర్ని చూసి  చేటంతైంది.
    ఇడ్లీ పిండి కలిపే చేతుల్తోనే సంబరంగా ఇవతలకి వచ్చి  ఆమె వెనకగా చూస్తూ, " అల్లుడుగారేరీ?" అంది ఆరాటంగా.
     ట్రాలీ బ్యాగ్,లాప్టాప్ బ్యాగ్ పక్కన పడేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళింది సాహి మౌనంగా.
     " ఒక్కదానివే వచ్చావేంటే?" మంచినీళ్ళు అందిస్తూ మళ్ళీ అడిగింది జానకి.
     " ఏం? ఇద్దరం వస్తేనే రానిస్తావా? సరే.వెళ్ళిపోతాలే." కస్సుమంది సాహి.
    " అదసలే అలిసిపోయి వస్తే నీ గోలేంటి? నోర్మూసుకుని వెళ్ళి మంచి కాఫీ పట్రా. రెస్ట్ తీసుకోనీ."  అని భర్త సుధాకర్ అనడంతో అనుమానంగా భయంగా తిరిగి పనిలో పడింది జానకి.
    రెండు రోజులు గడిచాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ముభావంగా గడుపుతోంది సాహి.
    ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా కూతురు,అల్లుడు  మంచి పొజిషన్ లో ఉన్నారని మురిసిపోయే తల్లిదండ్రులకు ఆందోళన కలిగింది.
అల్లుడికి కాల్ చేస్తే రెండుసార్లు కట్ చేసి తర్వాత " తననే అడగండంకుల్" అని ముక్తసరిగా చెప్పి పెట్టేశాడు. 
   ఏం చేయాలో పాలుపోని జానకి పల్లెనుండి తల్లిని రప్పించింది.
     అమ్మమ్మని చూసి సాహి మొహం వికసించింది. మనవరాలిని ఏమీ ప్రశ్నించకుండా తెచ్చిన సున్నుండలు,జంతికలు, మామిడిపళ్ళు ఇచ్చి భోజనం‌చేసి కాసేపు తాతయ్య కబుర్లు,మామయ్యల విశేషాలు చెప్పింది కనకమ్మ.
    నాలుగయ్యిందో లేదో వెళ్ళొస్తానని బయలుదేరింది.
  " అదేంటమ్మమ్మా! ఇందాకేగా వచ్చావ్?" అంటూ గారంగా నడుం చుట్టూ చేతులేసింది సాహి.‌ 
     మనవరాలి బుగ్గలు పుణికి నవ్వి " తాతయ్య నేను లేకుండా ఉండలేరే బంగారం!" అంది మురిపెంగా.
  ‌" తాతయ్యకు వంట వచ్చుగా" అనబోయిన సాహి ఈ జవాబుతో ఆగిపోయింది. 
    " ఎప్పుడూ గొడవలు పడలేదా అమ్మమ్మా! మీరిద్దరూ?" అంది.
     " పిచ్చితల్లీ! కాపురమన్నాక కలతలు రావా? చిన్నచిన్న  గొడవలూ,అలకలూ బతిమిలాటలూ లేని సంసారం ఉప్పు లేని పప్పు." అంది కనకమ్మ.
  ‌‌‌‌‌  " మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు పోగొట్టుకోవాలి? మన ఇగో హర్ట్ చేస్తే ఎందుకు సహించాలి?"  అంది సాహి కోపంగా. 
    " అంతెందుకు? నిన్న నా ముందే నాన్న అమ్మని నోర్మూసుకోమన్నారు.అయినా అమ్మ సిగ్గు లేకుండా నాన్నతో కూర్చుని నవ్వుతూ కాఫీ తాగింది. నావల్ల కాదు బాబూ" అంటున్న సాహికి తెలియకుండానే ఏడుపు వస్తోంది.
 ‌‌చిన్నప్పటినుండి హాస్టళ్ళలో బతికి యంత్రాల్లా చదివి ఇలా అయిపోతోంది తరం అని నిట్టూర్చిన సుధాకర్ అమరావతి కథలు, మిథునం, మరికొన్ని పుస్తకాలు తెచ్చి కూతురికి ఇచ్చాడు. 
ఇంతలో తాతయ్య రానే వచ్చాడు. 
    వారి గిల్లికజ్జాలు చూస్తూ, కాపుర విశేషాలు వింటూ ఆ పుస్తకాలు చదువుతున్న సాహి వారం తర్వాత   మెల్లిగా తండ్రితో " అశోక్ తో మాట్లాడాను నాన్నా! బెంగగా ఉంది.వెళ్ళిపోతా. టికెట్ తనే బుక్ చేశాడు. " అంది. కొన్ని డ్రెస్ లు పక్కన  ఉంచేసి బుక్స్ ట్రాలీలో సర్దుకుంది. 
       ఆధునిక సమాజంలో యువత మంచి  సాహిత్యానికి దూరమై ఎలా పతనమైపోతున్నారో అని బాధపడుతున్న పెద్దవాళ్ళు వికసించిన మొహాలతో సాహిని సాగనంపారు.

ప్రక్రియ : స్వరం : లక్షణాలు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹
సమదర్శిని తెలుగు సాహిత్య పరిశోధనా సంస్థ నిర్మల్ వారి e సంకలనం కొరకు మీ రచనలకు ఆహ్వానం

💐💐💐💐💐💐💐💐
రామప్ప వైభవం ను గొప్పగా వర్ణించుటకు ఈ కింది అంశాలవారిగా
మీ స్వరాలను పంపించండి.

అంశాలు
1. శిల్పకళా నైపుణ్యం
2. శిల్పి ప్రతిభ
3. వాస్తు సంప్రదాయం
4. నిర్మాణ కౌశలం
5. పూర్వ గాధలు
6. మహిమలు -- లీలలు
7. స్థల పురాణం
8. ఆలయ చరిత్ర
9. శాసనాలు .. భాషా పరిశీలన
10. నిధి నిక్షేపాలు

పై అంశాలలో ఒక అంశాన్ని ఎన్నుకొని 5 స్వరాలకు తగ్గకుండా 20 స్వరాలు మించకుండా మీ రచనలు పంపాలి.
💐💐💐💐💐💐💐💐

స్వరము లక్షణాలు

1. దీనిలో 5 వరుసలు ఉంటాయి
2. మొదటి వరుస లో 10 అక్షరాలు మించద్దు
3. రెండవ వరుసలో 10 అక్షరాలు మించద్దు
4.మూడవ వరుసలో 10 అక్షరాలు మించద్దు
5. నాల్గవ వరుసలో 10 అక్షరాలు మించద్దు
6. ఐదవ వరుసలో 10 అక్షరాలు మించద్దు
7. ఒక స్వరంలో 50 అక్షరాలు మించరాదు
8. అర్థవంతమైన భావవ్యక్తీకరణ ఉండాలి
9. ప్రాసలు, అలంకారాలు, వర్ణణలు వాడవచ్చు

💐💐💐💐💐💐💐💐💐
చివరి తేదీ 30 సెప్టెంబర్ 2021
💐💐💐💐💐💐💐🌹💐


💐💐💐💐💐💐💐💐💐

సుార్యవర్ణాలు

[6/13, 19:33] +91 98494 81823: వివరాలు తెలుసా మీకు

శీర్షిక రెండు లేక మూడు అక్షరాలు

5,, వరుసలు
6 అక్షరాలు
ఉండాలి
[6/14, 07:04] +91 98494 81823: శుభోదయం

సూర్య వర్ణాలు మొదలు పెట్టారని.భావిస్తున్నాను
[6/14, 07:05] +91 98494 81823: ఇంకా రాసే వాళ్ళు ఉంటే చెప్పండి మళ్ళీ గ్రూప్ ఓపెన్ చేస్తాము
[6/15, 11:43] +91 98494 81823: 100  రాయాలి
శత సూర్య వర్ణ కవి బిరుదు

Monday, June 13, 2022

ఆటవెలది

13.6.23
మహతీసాహితీకవిసంగమం
అంశం:చిత్రకవిత:
మ.సా.క.సం: 19
క.సం:1
ప్రక్రియ:   ఆటవెలది పద్యాలు.

శీర్షిక :పిల్లల్లారా రారండోయ్ .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


కణపు రుాపు లోన  కరకుక రోనాయె
కలత లేపె నుగద కాటు వేసి
పాఠ శాల లేక  బాలల లసిరింట.
నేడు స్కుాలు పోవ నెగిరి మురిసె ॥

ఆను లైను స్కుాళ్ళు అలసత్వ మునుపెంచె
ఆట పాట లేని అసహ నములు.  
అట్టి సమయ మిపుడు అలవోక గాపోయె
బడికి పోవ నెంచె  బాల సఖులు ॥

చదువు మాట జెప్ప చాలనల్లరిజేయు
పిల్ల లెంతొ మురిసె పిలువ స్కుాలు
బరువు పొత్త ములతొ  బాల బాలికలంత
పాఠ శాల జేర పరుగు లిడెగ ॥

విద్య నేర్చు వారు విషయ యొాచన గల్గి
జ్ఞాన వంతు లౌచు జగము లేలు
భాగ్య వంతులు గద బాలలం దరుచాల
చదువ నేర్చు వారి  చరిత ఘనము॥

****************************

Sunday, June 12, 2022

మంచి మార్పు రావాలి.

అంశం : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు , అణచివేతలకు వ్యతిరేకంగా....

శీర్షిక :  మంచి మార్పు రావాలి.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


వ్యవస్థలో మార్పు మారణహోమమయ్యింది.
మాదకద్రవ్యాల మత్తు, కామానికి విత్తయ్యింది.
 పెరిగిన స్వార్ధంతో మానవత్త్వం మంటకలిసిపోయి
మగాడు మృగాడై వావి వరుసలు మరిచేడు॥

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని-
పిల్లలుా దేముడుా ఒకటేనన్న మనిషి-
నేడు పుట్టిన పసి ప్రాణంలోనుా పండు --
ముసలిలోనుా  కుాడా ఆడతనాన్ని చుాసి
 అంగలార్చే పరిస్థితికి లోనయ్యాడు.॥

పదవికోసం, మత్తు పంపిణీ ,ఓటుకు నోటన్న
 బలహీనతలతో మనిషి చిత్తైపోయాడు ॥
 పెరుగుతున్న కామంతోపేగు బంధాల్ని మరచి
 కనిపించిన ఆడతనాన్ని కబళిస్తుా వచ్చేడు.॥
 కారణం :
న్యాయస్థానాల్లో ఎన్నటికీ రాని తీర్పు లోటు
రాజ్యాంగాలలో రాజకీయ దౌర్జన్యాల వేటు.
అక్రమ అత్యాచారాలను అణచలేని వ్యవస్థలో
పెరిగిపోతున్న అరాచకాలకు తీర్పు రాని పోటు ॥

ఈ పరిస్థతి మారాలంటే,  విద్య అందరికీ
ప్రాధమిక హక్కుగా ఉచితంగా లభించాలి.
బాల కార్మిక వ్యవస్థను రుాపు మాపాలి. స్త్రీలు,
పిల్లల పరమైన చట్టాలను అమలులోకి తేవాలి॥

శిశుసంక్షేమం, ఆరోగ్యం , భద్రతాభివృద్ధి శాఖలలో
 సమర్ధత కలిగిన సభ్యులు నైతికతతొ పనిచేయాలి
 స్త్రీ, బాలికల ఆరక్షణా కేంద్రాలు న్యాయ వ్యవస్థలుా
 ఎప్పటికప్పుడు  స్పందిస్తుా జాగురుాకతతో మెలగాలి.

 అప్పుడే మన భవిత దేశ శాంతి సౌభాగ్య 
 చరిత్రకు శ్రీకారం చుట్టగలుగుతుంది ॥
 

Monday, June 6, 2022

ప్రక్రియ : గజల్స్.


[7/27/2021, 18:13] p3: శీర్షిక  :   నా ప్రేమ. 


ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు  నాచెలీ

ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన 
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ 

నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ

 నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
 ఆకళలె కలలందచందాలు నాచెలీ

కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి

 కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు  నాచెలీ

నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ

సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ

అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు  నాచెలీ

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 21:49] p3: ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి  జ్ఞాపకాలు .


అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..

ఆగాలి ఆనీరు  ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ  తలుచుకోవేలనీ ॥

బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ  ॥

ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి  ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥

స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ  ॥

కరువాయె ధర్మముా  బరువాయె బంధముా
అవినితి బాటనే  వదుకోవేలనీ ॥

తరిగేను విలువలుా తొలగేను వలువలుా 
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥

మేధావి తానని  మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥

ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచేవు ఏలనీ॥


శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.


హామీ:
ఈ నా  "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[8/17/2021, 17:28] ఇష్టపది సత్యం మాష్టారు: దుర్నీతుల దురాచార దుశ్శాసన  పాలనలో
నిశ్ఛయమౌ నియమమేది యసలులేదు  ఈజగాన ॥

అన్యాయపు అక్రమాల అగడాల సమాజాన
స్వార్ధమేలు మనిషికేమొ సుఖములేదు ఈజగాన ॥

వయసుమీర తల్లితండ్రి బరువాయెను బ్రతుకులోన
కన్నపేగె ,కాలరాసె , వలపులేదు ఈజగాన ॥

ఆడతనము అమ్మతనము అప్పచెల్లి అన్నమాట
వావివరుస బంధమన్న మాటలేదు ఈజగాన ॥

అవినీతులె రాజ్యమేలె ఆదర్శమె అణగారే
న్యాయమైన ధర్మమైన బాటలేదు  ఈజగాన ॥
[10/15/2021, 13:37] p3: [10/14, 19:14] p3: తెలుగు వెలుగు సాహిత్యవేదిక ..కొరకు'
గురువారం: 14/10/2021.
అంశం : ఐచ్ఛికం.

రచన : శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

ప్రక్రియ : గజల్.

శీర్షిక : నీలాల ఆకాశంలో....

నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥

వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥

మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥

పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥

నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై  పలకాలని ఉన్నది.॥

ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥

***********************************

 1️⃣3️⃣పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు! 
వెన్నెల వెలుగు గా,రాగాల గీతిక గా,మరుమల్లే సందేశం గా,పాటల పల్లకి లో పరువాల  కన్నేనెగా...
అద్భుతః..చప్పట్లు... 
👏👏👏👏👏👏💐👌💐👍🌷

********************************
ప్రక్రియ : గజల్.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .

మార్పురాని లోకంలో  మంచితీర్పు  రాదటలే
మంచి చెడుల భావాలిక మేల్కొల్పులు కావటలే

మారరులే మానవులే మహినందరు దానవులే
మానమునకు మర్యాదకు మంచికుార్పు రాదటలే॥

జీవహింస పాపమనీ  అన్నమాట  పలుకుటలే
అహింసలార్తనాదాలు అడుగడుగున వినికిడులే 

కన్న పాపమేమొ తల్లి విలువలేని శిలువేగా
స్త్రీ పుట్టుక శాపమిలను విధి చేతల బాధితులే ॥

ఆడజన్మ  ఆడతనముకడుగడుగున ఆరడులే
చలించనీ కర్కశులకు చదరంగపు టాటలులే

బాలలైన బామ్మ లైన బలవంతపు వేటటలే ॥
నీడలేని జాడలలో తోలుబొమ్మ లాటలులే ॥

మానవులను ప్రేమించే గుణముకాన  రాదటలే
జగతినిండు అక్రమాల కన్నీరిడె నీశ్వరిలే ॥

*********************************

ప్రక్రియ : గజల్.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర


మమతనిండు  ప్రేమముార్తి  మహిని ఆమెఅమ్మేగా
ఆమ్మ ఒడిని వెచ్చదనం పంచువారు లేరుకదా॥

నవమాసపు రక్షణిడిన నరరుాపపు వేల్పుకదా
 కష్టములను ఇష్టముగా తలచినదీ అమ్మ కదా  ॥
 
నీవు పలుకు మొదటి మాట అమ్మా అను పిలుపేరా
అమ్మవంటి  తొలిదైవం భువినెవరుా లేరుకదా ॥

నీ ఆటకు నీ బాటకు నీ స్నేహం అమ్మేరా
మంచికోరు మార్గదర్శి  ఇంకెవరుా లేరుకదా ॥

నీ ఉన్నతి నీ సంతతి  నీ బాగే కోరునురా
నీవే తన ప్రాణమనీ  తలచేదీ అమ్మకదా ॥

జవసత్వాలుడిగేకా జనని ఋణము తీర్చుకోర 
కన్నీటిని రానీయకు  కన్నకొడుకు నీవుకదా ॥

**********************************