అంశం : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు , అణచివేతలకు వ్యతిరేకంగా....
శీర్షిక : మంచి మార్పు రావాలి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
వ్యవస్థలో మార్పు మారణహోమమయ్యింది.
మాదకద్రవ్యాల మత్తు, కామానికి విత్తయ్యింది.
పెరిగిన స్వార్ధంతో మానవత్త్వం మంటకలిసిపోయి
మగాడు మృగాడై వావి వరుసలు మరిచేడు॥
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని-
పిల్లలుా దేముడుా ఒకటేనన్న మనిషి-
నేడు పుట్టిన పసి ప్రాణంలోనుా పండు --
ముసలిలోనుా కుాడా ఆడతనాన్ని చుాసి
అంగలార్చే పరిస్థితికి లోనయ్యాడు.॥
పదవికోసం, మత్తు పంపిణీ ,ఓటుకు నోటన్న
బలహీనతలతో మనిషి చిత్తైపోయాడు ॥
పెరుగుతున్న కామంతోపేగు బంధాల్ని మరచి
కనిపించిన ఆడతనాన్ని కబళిస్తుా వచ్చేడు.॥
కారణం :
న్యాయస్థానాల్లో ఎన్నటికీ రాని తీర్పు లోటు
రాజ్యాంగాలలో రాజకీయ దౌర్జన్యాల వేటు.
అక్రమ అత్యాచారాలను అణచలేని వ్యవస్థలో
పెరిగిపోతున్న అరాచకాలకు తీర్పు రాని పోటు ॥
ఈ పరిస్థతి మారాలంటే, విద్య అందరికీ
ప్రాధమిక హక్కుగా ఉచితంగా లభించాలి.
బాల కార్మిక వ్యవస్థను రుాపు మాపాలి. స్త్రీలు,
పిల్లల పరమైన చట్టాలను అమలులోకి తేవాలి॥
శిశుసంక్షేమం, ఆరోగ్యం , భద్రతాభివృద్ధి శాఖలలో
సమర్ధత కలిగిన సభ్యులు నైతికతతొ పనిచేయాలి
స్త్రీ, బాలికల ఆరక్షణా కేంద్రాలు న్యాయ వ్యవస్థలుా
ఎప్పటికప్పుడు స్పందిస్తుా జాగురుాకతతో మెలగాలి.
అప్పుడే మన భవిత దేశ శాంతి సౌభాగ్య
చరిత్రకు శ్రీకారం చుట్టగలుగుతుంది ॥
No comments:
Post a Comment