[7/27/2021, 18:13] p3: శీర్షిక : నా ప్రేమ.
ఎదలోన మెదిలేను భావాల అలజడీ
ఎందెందు దాగె నీ అందాలు నాచెలీ
ఊహలే ఉయ్యాలలుాగేను మదిలోన
బ్రతుకంత నీ తలపు బంధాలు నాచెలీ
నీ పలుకు లేతీపి తేనీటి జల్లులై
కురిసేను నీప్రేమ గంధాలు నాచెలీ
నీమొాము లోనిండెనాచంద్ర కళలవే
ఆకళలె కలలందచందాలు నాచెలీ
కదిలేటి ముంగురులె మేఘ సందేశమై
కవ్వించ ననుచేరు కందాలు నాచెలి
కనులలో కదలేటి నీమౌన బాసలే
నీప్రేమ పంచేతరంగాలు నాచెలీ
నీ ప్రేమ తెలిసేను నిన్నునే వలచేను
నా వలపు వర్ణనలభంగాలు నాచెలీ
సఖినీదు ఈశ్వరీ సరదాగ వినిపించె
వయ్యారి నీసొగసు విందులుా నాచెలీ
అందాలె నాబ్రతుకు బంధమై పోయెలే
నాతోడు వైవేయు సంకెళ్ళు నాచెలీ
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
[7/27/2021, 21:49] p3: ప్రక్రియ : గజల్ ..
శీర్షిక : అలనాటి జ్ఞాపకాలు .
అలనాటి రోజులని తలచేవు ఏలనీ
మారింది నీవనీ తెలుసుకోవేలనీ..
ఆగాలి ఆనీరు ఆపుడమి ప్రకృతీ
ఆనాటి వేననీ తలుచుకోవేలనీ ॥
బంధాలె బరువాయె ఈనాటి మనిషికీ
విడరాని బంధాల కలుపుకోవేలనీ ॥
ఆ అమ్మ ఆ అక్క ఆచెల్లి ఆచెలీ
ఆప్రేమ నీదిగా మసలుకోవేమనీ ॥
స్వార్ధమే జీవముా ధనమాయె ముాలముా
నిస్వార్ధ బాటలో నడుచుకోవేలనీ ॥
కరువాయె ధర్మముా బరువాయె బంధముా
అవినితి బాటనే వదుకోవేలనీ ॥
తరిగేను విలువలుా తొలగేను వలువలుా
మనదైన సంస్కృతిని మరచేవు ఏలనీ ॥
మేధావి తానని మారినది మనిషనీ
తెలిసినీ తలపులను మార్చుకోవేలనీ ॥
ఆనాటి కాలమే ఈనాడు ఉండగా
కాలాన్ని తిరగేసి వగచేవు ఏలనీ॥
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర
8097622021.
హామీ:
ఈ నా "గజల్ " ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
[8/17/2021, 17:28] ఇష్టపది సత్యం మాష్టారు: దుర్నీతుల దురాచార దుశ్శాసన పాలనలో
నిశ్ఛయమౌ నియమమేది యసలులేదు ఈజగాన ॥
అన్యాయపు అక్రమాల అగడాల సమాజాన
స్వార్ధమేలు మనిషికేమొ సుఖములేదు ఈజగాన ॥
వయసుమీర తల్లితండ్రి బరువాయెను బ్రతుకులోన
కన్నపేగె ,కాలరాసె , వలపులేదు ఈజగాన ॥
ఆడతనము అమ్మతనము అప్పచెల్లి అన్నమాట
వావివరుస బంధమన్న మాటలేదు ఈజగాన ॥
అవినీతులె రాజ్యమేలె ఆదర్శమె అణగారే
న్యాయమైన ధర్మమైన బాటలేదు ఈజగాన ॥
[10/15/2021, 13:37] p3: [10/14, 19:14] p3: తెలుగు వెలుగు సాహిత్యవేదిక ..కొరకు'
గురువారం: 14/10/2021.
అంశం : ఐచ్ఛికం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : గజల్.
శీర్షిక : నీలాల ఆకాశంలో....
నీలాల ఆకాశంలో నేనో చిరు తారకనై
నెలరేయి వెన్నెల వెలుగై కురవాలని ఉన్నది॥
వేవేల మువ్వల సడిలో రాగాల గీతికనై
శృతి నిండిన పల్లవి నేనై పాడాలని ఉన్నది.॥
మరుమల్లె గంధం నేనై సందేశపు ప్రేమకు తావై
చిరుగాలుల చల్లని వీచిగ సాగాలని ఉన్నది.॥
పాటల్ల పల్లకి లోనా పరువాల కన్నెను నేనై
వాడల్ల నాదపు సిరినై కురవాలని ఉన్నది॥
తాళాల పదగతి నేనై ఆడాలని ఉన్నది॥
నాట్యాల నవరస భావం వాద్యాల వలపుల తాపం
సందేళ మురళిని నేనై పలకాలని ఉన్నది.॥
ఈశ్వరీయ కలల అలల వేణునాద తరంగాల
ఆమాధవ చరణాలను తాకాలని ఉన్నది ॥
***********************************
1️⃣3️⃣పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి గారు!
వెన్నెల వెలుగు గా,రాగాల గీతిక గా,మరుమల్లే సందేశం గా,పాటల పల్లకి లో పరువాల కన్నేనెగా...
అద్భుతః..చప్పట్లు...
👏👏👏👏👏👏💐👌💐👍🌷
********************************
ప్రక్రియ : గజల్.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర .
మార్పురాని లోకంలో మంచితీర్పు రాదటలే
మంచి చెడుల భావాలిక మేల్కొల్పులు కావటలే
మారరులే మానవులే మహినందరు దానవులే
మానమునకు మర్యాదకు మంచికుార్పు రాదటలే॥
జీవహింస పాపమనీ అన్నమాట పలుకుటలే
అహింసలార్తనాదాలు అడుగడుగున వినికిడులే
కన్న పాపమేమొ తల్లి విలువలేని శిలువేగా
స్త్రీ పుట్టుక శాపమిలను విధి చేతల బాధితులే ॥
ఆడజన్మ ఆడతనముకడుగడుగున ఆరడులే
చలించనీ కర్కశులకు చదరంగపు టాటలులే
బాలలైన బామ్మ లైన బలవంతపు వేటటలే ॥
నీడలేని జాడలలో తోలుబొమ్మ లాటలులే ॥
మానవులను ప్రేమించే గుణముకాన రాదటలే
జగతినిండు అక్రమాల కన్నీరిడె నీశ్వరిలే ॥
*********************************
ప్రక్రియ : గజల్.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ . మహారాష్ట్ర
మమతనిండు ప్రేమముార్తి మహిని ఆమెఅమ్మేగా
ఆమ్మ ఒడిని వెచ్చదనం పంచువారు లేరుకదా॥
నవమాసపు రక్షణిడిన నరరుాపపు వేల్పుకదా
కష్టములను ఇష్టముగా తలచినదీ అమ్మ కదా ॥
నీవు పలుకు మొదటి మాట అమ్మా అను పిలుపేరా
అమ్మవంటి తొలిదైవం భువినెవరుా లేరుకదా ॥
నీ ఆటకు నీ బాటకు నీ స్నేహం అమ్మేరా
మంచికోరు మార్గదర్శి ఇంకెవరుా లేరుకదా ॥
నీ ఉన్నతి నీ సంతతి నీ బాగే కోరునురా
నీవే తన ప్రాణమనీ తలచేదీ అమ్మకదా ॥
జవసత్వాలుడిగేకా జనని ఋణము తీర్చుకోర
కన్నీటిని రానీయకు కన్నకొడుకు నీవుకదా ॥
**********************************
No comments:
Post a Comment