Friday, August 5, 2022

ప్రకృతి భీభత్సవం.

అంశం : ప్రకృతి భీభత్సం .
శీర్షిక  : చెడపకురా ! చెడేవు !

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


భరత మాత ఆగని కన్నీరు 
ప్రళయమై భీభత్సాన్ని సృష్టి స్తోంది.
వాగులు వంకలుా పొంగి పోర్లుతున్నా- 
మంచినీటి కొరత మనుషులకు శాపమయ్యింది ॥

మానవులు దానవులై చరిస్తున్నారు.
కామంతో మనిషి వావి వరుసల్ని మర్చిపోతున్నాడు.
 కొండలు బండల కొరకు తవ్వి పారేస్తున్నారు.
 పచ్చని చెట్లను భుా కబ్జాలకై నరికి వేస్తున్నారు.॥
  
గుాడు లేని పక్షుల కన్నీటి తాపాలు 
పుడమి పాపులను శాపాలై  వెంటాడుతున్నాయి॥
వాతావరణ నియంత్రణను కోల్పోయిన  
 ప్రకృతి మాత అస్తవ్యస్తమైన ఋతువుల 
ఆగమనంతో హైరానపడుతోంది.॥
 
విసపు గెత్తాల మంటకు వెర్రెక్కిన మట్టి మాలక్ష్మి 
 పంట కోతల్లో పాశ  హస్తాన్ని తిప్పుతుా
 రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది.॥

 పసి పిల్లల ప్రాణానికి, ఆడ పిల్లల మానానికి 
రక్షణలేని  రాపిడి చుాసి భరత మాత రోమాలు
నిక్కపొడుచుకుంటున్నాయి .॥

బద్దలౌతున్న సారహీనమైన భుామి, 
కోపాగ్నితో రగులుతున్న అడవులు..
 తడిలేని మేఘాలు ,  ఇంకిపోతున్న నీళ్ళు
విష పుారితమైన గాలులతో గాయపడి , 
కుష్టు పట్టిన తన గతికి గుండె  పగిలిన 
ప్రకృతి పడతి  ప్రతీకారంతో ప్రళయ 
భీభత్సవాన్ని సృష్టిస్తోంది.

          " ఓ మనిషీ !  తస్మాత్ జాగర్త."
          *************************
       హామీ :
       పై కవిత ఏ మాధ్యమునందునుా 
       ప్రచురితము కాని నా స్వీయ రచన.    

**********************:****************

బాల సాహిత్యం.

అంశం : బాల సాహిత్యం..
"క" గుణింతం .
శీర్షిక : కంటి పాపవు మాకమ్మా .

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

పల్లవి:
------
కన్నా ! మా ముద్దుల -
పాల బొమ్మా ఓ
అను పల్లవి :
-----------
కుానమ్మా !  నువు
సుద్దులు నేర్చుకోవమ్మా ॥

 1.చరణం.
---------
కన్న తల్లిని నేనమ్మా.
కథలెన్నో చెపుతానమ్మ .
కానుక మానవ జన్మమ్మ.
కమ్మని మాటలు వినుమమ్మా॥
2.చరణం.
----------
కరుణ నిండు మనసుండాలి
కాలుష్యం విడి మసలాలి.
కిల కిల నవ్వతు బతకాలి.
కీర్తి కెక్కు పని చేయాలి.॥
3.చరణం.
---------
కుటిల బుద్ధులను విడవాలి
కుారిమి కలిగి యుండాలి.
కెవ్వు ఏడ్పులే మానాలి.
కేరింతల నువు ఆడాలి.॥ కన్నా...
4.చరణం.
-----------
కైమొాడ్పు గురులకు చేయాలి
కొత్త చదువులుా నేర్వాలి.
కోట్లకు నువు పడగెత్తాలి.॥
కౌరవ నీతిని విడవాలి.॥
5.చరణం.
-----------
కమ్మని నీతులు వినవమ్మా.
కలత మాని నువు బజ్జోమ్మా .
కంటి పాపవు మాకమ్మా.
కః కుః మాటల పసి కొమ్మా॥‍

********************:*

ప్రక్రయ : రుబాయిలు.

02/08/2022.
మహతీ సాహితీ కవి సంగమం .
అంశం : సాహిత్యాశం .
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .


ఎన్ని వేట్లు వేసినా ఒరిగిపోయిన చెట్టు చిగిరిస్తుంది.
ఎన్ని తుాట్లు పొడిచినా పగిలిపోయిన గుండె  .ప్రేమిస్తుంది
ఒకరి లాలించిన ఆమ్మైతే ఒకరు పాలించిన అమ్మ
ఎన్ని సార్లు అవమానించినా ఆమ్మతనం ఆదరిస్తుంది.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

విద్య నేర్చినవాడు  వివేకవంతుడవుతాడు
విజ్ఞాన శాస్త్రం  నేర్చినవాడు మేధావంతుడౌతాడు.
పై రెండుా ఉన్నవాడు తత్త్వ-జ్ఞాన సముపార్జనుడు
వారందరితో బంధమున్న వాడు కీర్తిమంతుడౌతాడు.॥

అక్షరం తలరాత మార్చు వరం మిత్రమా 21
ఆవేశం అనర్ధాలను పెంచు  మిత్రమా 21
నిరక్షరాస్యతది  ముార్ఖత్వానికి ముాలం .
చదువది, సమయొాచిత సంస్కారము మిత్రమా ॥

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

పసి పిల్లలలో  అమాయకత్వం చుాస్తాం మనం
యువతలోని ఆవేశతత్త్వం  చుాస్తాం మనం 
మధ్యవయస్కుల్లో జీవితానుభవ పుాదోటలు.
వృద్ధాప్యంలో పండిన మనస్తత్వం చుాస్తాం ॥   


26/07/2022.౯
మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .




మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు కలుపుకొని పెంచుకో ॥

కుార్చొని తింటే కొండలు కరుగుతాయి
అతిగా తింటే కండలు పెరుగుతాయి.
ఆరోగ్యమే మహాభాగ్యమనంటారు.
పద్ధతి పాటించు చింతలు తొలగుతాయి.॥

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

ఎవరినీ ఎప్పుడుా తక్కువ చేసి చుాడకు 
పిల్లలను  గారాబం చేసి పాడుచేయకు
మన నడతే  పిల్లల రేపటి భవిత భాట 
ఇల్లే పాఠశాల అనేటి వాసి , మరువకు ॥
 
రాజకీయంలో  స్వార్ధానిదే పైచేయొాయి
ప్రజలలో ఉన్న భయానికి కళ్ళెం వేయవోయి
 ఓటుకు నోటన్నది నేడు కనిపించే నిజమొాయి
నోరున్న వాడిదే రాజ్యమని తెలుసుకోవోయి .॥

మహతీ సాహితీ కవి సంగమం .
శీర్షిక :  నిజాలు తెలుసుకో ..
ప్రక్రియ : రుబాయిలు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .

మనిషిని మనిషి మనసారా  ప్రేమించాలి .
కుల-మత బేధాల నోరారా ప్రతిఘటించాలి.
వసుధైక కుటుంబము మనదందరిదీ.. .
ఒకరికొకరై తనివితీరా బతకాలి ॥.

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
మానవత్వ విలువలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
స్నేహానుబంధాలు  కలుపుకొని పెంచుకో ॥

కలలో నిన్నే తలచితిని కృష్ణా 
ఇలలో నిన్నే కొలచితిని కృష్ణా 
యశోదా నంద  గోపాల బాలా
నను బ్రోవగ నిను పిలచితి కృష్ణా  ॥

రుబాయిలు.

బోనాల పండగకు భోగాలే  విందుగా 
ఆ తల్లి పుాలతో నిండే కను విందుగా
బంగారు బతుకమ్మ కొలువై వచ్చేనుగా
ఆట పాటల వేడ్క లందరీ పసందుగా ॥

మంచి చెడు తేడాలు తెలుసుకొని నడచుకో
 అనురాగబంధాలు నిలుపుకొని మసలుకో
మనిషిగ పుట్టినీవు పశువులాగ మారకు
 ఐశ్వర్యం ఆనందం పంచుకొని పెంచుకో ॥









 

ప్రక్రియ : రుబాయిలు.

ప్రక్రియ : రుబాయిలు 
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .


చిల్లులున్న ప్రతీ కర్ర  వేణువు కాదు
ముల్లున్న ప్రతీ పుావుా గులాబీ కాదు.
ఇల్లు దాటిన ప్రతీ క్షణం జాగురుాకతతో ఉండు.
 అల్లుకున్న ప్రతీ బంధం అక్కరకు రాదు.॥

వికసించిన ప్రతి పుావుా కలువ కాదు.
కనిపించిన ప్రతీ రాయిా కొలువు కాదు.
శ్రమ నిండిన చేతలకు గుర్తింపు వస్తుంది.
గుణము లేని ఏ మనిషికి విలువ లేదు.

నీతులు చెప్పడం ఎంతోమంది చేస్తారు.
నియమాలు పాటించమని కొంతమంది చెప్తారు.
చెప్పేముందు చేసి చుాపించడం మంచి లక్షణం.
పని చేసేవారు మాటలాడరని చాలామంది చెప్తారు.॥

ముద్రించిన ప్రతీ పుటకుా విలువ లేదు 
వినిపించిన ప్రతీ పలుకుా కవిత కాదు .
గుణము లేని ఏ మనిషికి విలువ లేదు.
బద్ధకించిన  ఏ యువకునికీ భవిత లేదు.॥

ఎన్ని కోట్లు వెచ్చించినా కోల్పోయిన ప్రేమ కొనలేవు 
ఎన్ని పాట్లు పడినా గతించిపోయిన నిన్న  కనలేవు.
జీవితంలో ప్రతీ పదానికీ అలోచించి అడుగేయాలి
ఎన్ని ఇక్కట్లు పడినా మాటజారిన చోట మనలేవు ॥

మనసు

అంశం: మనసు.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆట వెలది.


మంచి చెడుల తీరు  మనదు మేలును కోరు   
మనసు తెలుపు మాటె మంచి బాట
మనసు చెప్పు మాట మనసార వినుమయ్య
మనసు  మిత్రు డిలను  మరువ కయ్య ॥

మనిషి లోన మనసు మర్మ మెరుగ దయ్య 
నీకు మేలు జేయ నిలుచు నెపుడు
బుద్ధి బురద చేర సుద్ధి మాటలు జెప్పు
సుఖపు బాట జుాపు సులభ గతిని ॥

మనిషి హృదయ మందు మాన్య దేవత లుండు
దేహ మీదు కొలువు  దేవ తలకు
గుడులు గోపు రాలు గుణము నేర్పవు నీకు.
మనసె పాఠ శాల మరువ బోకు !


ఉదయ సమీరం .

అంశం : ఉదయ సమీరం.
శీర్షిక  : ప్రకృతి సంపద మన వరం .

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ఉదయించే భానుడు ఉదయ దివ్య జ్యోతిగ
ఉదయ సమీరాలవి ఉల్లాసము నిచ్చుగ
ప్రభాత వేళల లో  ప్రసరించు కిరణాలు
ఆరోగ్య సంపదను అందించు ఓషధులు.॥

చల్లని చిరుగాలులు జల్లే సుమ గంధాలు
ప్రాణ వాయువు నిండు ప్రకృతి యిచ్చు వరాలు॥
జేగంటా రవములు జేజమ్మల పుాజలు
ప్రతి యింట పడతులా ప్రార్ధనలు పుాజలు ॥

మంచు ముత్యాలవే మరపించు మనసులను
 తరుల పులకరింపుల తడి జల్లుల అందము
అలకోయిలలు కుాయు అందాలరాగాలు.
సుక పికా రవములా  సుందర సంగీతము ॥

గుడి గంటా రవములు బడి పిల్లల అరుపులు
మలయసమీరంలో  మహిలోని అందాలు.
ముచ్చటైన ముగ్గులు ముదితల  ముచ్చట్లు.
హాయి పలకరింపులు అందమైన క్షణములు ॥

సుందరమౌ సమయము సుమ బాలల గంధము
పుాల జల్లు కురిసే పుా బాలల అందము.
ఈశ్వరీ మనసులో  ఈ రీతి సంబరము
ఉదయ వీచికలలో ఉదయించిన భావము ॥

ప్రకృతిలో అందము ప్రేరణ నిడు సమయము
భావాల తరంగము బయలువెడలె కవనము 
మహతీ సంగమముా మంచి కవుల నిలయము
మహదానందమైన మంచి స్నేహ బంధము ॥  




వరలక్ష్మీ వ్రతం .

04/08/2022.
గోరసం -వారి పోటీ..
అంశం : వరలక్షీ వ్రతం.
శీర్షిక  : శ్రావణ లక్ష్మి .
ప్రక్రియ : మత్తకోకిల

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .



శ్రావ ణమ్మదె మంచి మాసము  శాస్త్ర పుాజలు సేయగా
శ్రావణా సిరి లక్ష్మి  పుాజలు సేయ రేసఖి మెండుగా
భావ మందున భాగ్య లక్ష్మిని భక్తి తోడను కొల్వగా
బ్రోవ వచ్చును భాగ్య లక్ష్మియె భోగ భాగ్యము లీయగా ॥॥
స్త్రీలు చేసెడి  పుణ్య పుాజలు మేలు మంగళ మిచ్చుగా
యేలు తల్లిని కొల్చు వారికి  శ్రీలు నిండెడు పండగా
పోలి పుార్ణపు బుారె గారెలు పొంగు పాయస ముండగా
 జేలు పల్కుచు జేజి కీయరె  వేడి వేద్యము విందుగా ॥

కుంకు మార్చన చేసి వత్తులు కుార్చి దీపము నెట్టరే
అంకు రార్పణ జేసి అమ్మకు ఆది పుాజలు సేయరే
వంక జాబిలి పుార్ణ బింబము వచ్చు వేళను చుాడరే
శంఖ నాదము తోడ నమ్మకు స్వాగతమ్ములు పల్కరే ॥

రంగు లీనుసు గంధ పుాలను రాసి పోగుగ వేయరే.
రంగు రంగుల రంగ వల్లులు రక్ష కోరుచు వేయర
అంగ నాలదె గుాడి అమ్మతొ ఆట పాటల నాడరే 
హంగు మీరగ లచ్చి మమ్మకు ఆగ్ర హారతు లెత్తరే .

పాల వెల్లిని కట్టి బాగుగ పాట లాటల తేలరే
శీల సద్గుణ రాణి లక్ష్మికి శీత లమ్ములు నీయరే
మేలు కొల్పులు పాడి కొల్వగ మెచ్చు రాణిని కొల్వరే
లీల లెన్నియొ జుాపు రాణిని వేల కీర్తుల వేడరే ॥


హామీ :
పై మత్తకోకిల పద్యాలు నా స్వీయ రచనలు.