అంశం : ఉదయ సమీరం.
శీర్షిక : ప్రకృతి సంపద మన వరం .
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
ఉదయించే భానుడు ఉదయ దివ్య జ్యోతిగ
ఉదయ సమీరాలవి ఉల్లాసము నిచ్చుగ
ప్రభాత వేళల లో ప్రసరించు కిరణాలు
ఆరోగ్య సంపదను అందించు ఓషధులు.॥
చల్లని చిరుగాలులు జల్లే సుమ గంధాలు
ప్రాణ వాయువు నిండు ప్రకృతి యిచ్చు వరాలు॥
జేగంటా రవములు జేజమ్మల పుాజలు
ప్రతి యింట పడతులా ప్రార్ధనలు పుాజలు ॥
మంచు ముత్యాలవే మరపించు మనసులను
తరుల పులకరింపుల తడి జల్లుల అందము
అలకోయిలలు కుాయు అందాలరాగాలు.
సుక పికా రవములా సుందర సంగీతము ॥
గుడి గంటా రవములు బడి పిల్లల అరుపులు
మలయసమీరంలో మహిలోని అందాలు.
ముచ్చటైన ముగ్గులు ముదితల ముచ్చట్లు.
హాయి పలకరింపులు అందమైన క్షణములు ॥
సుందరమౌ సమయము సుమ బాలల గంధము
పుాల జల్లు కురిసే పుా బాలల అందము.
ఈశ్వరీ మనసులో ఈ రీతి సంబరము
ఉదయ వీచికలలో ఉదయించిన భావము ॥
ప్రకృతిలో అందము ప్రేరణ నిడు సమయము
భావాల తరంగము బయలువెడలె కవనము
మహతీ సంగమముా మంచి కవుల నిలయము
మహదానందమైన మంచి స్నేహ బంధము ॥
No comments:
Post a Comment