Tuesday, November 28, 2023
ప్రతీకలు*రూపకర్త: *పసుపునూరి శ్వేత*〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*ప్రతీకలు*
రూపకర్త: *పసుపునూరి శ్వేత*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) *ప్రతి ప్రతీకకు 4 పాదాలుండాలి*.
2) *ప్రతి ప్రతీకలో మొదటి ,చివరి పాదం యొక్క మొదటి, చివరి అక్షరం ఒకటే అయి ఉండాలి.*
3) *మిగిలిన పాదాలకు అంత్య ప్రాస అనుసరించ వలసిన అవసరం లేదు.*
(అంత్యప్రాస వాడకూడదు)
4) *ప్రతీ పాదంలో 11అక్షరాలు మాత్రమే ఉండాలి*.
5) *రోజుకు 3 ప్రతీకలు మాత్రమే వ్రాయాలి*.
*మా* నవ జన్మ అద్భుత మహి *మా*
త్రిమూర్తులు ప్రాణంపోసి భువిపై
ఆటలాడుటకే పంపు తరుణం
*మా* ర్పుల మనసు విచిత్రం కను *మా*.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
అధ్యక్షులు..
*ప్రశాంత్ కుమార్ ఎల్మల*
9494300188
.
రచన :శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ప్రతీకలు.
నిర్మలమైనట్టి మనసుతోని
అందరితోను కలసి మెలసి
ఆ స్నేహ మాధుర్యంలోనిలో ఉన్నట్టి
నిత్యానందాన్ని అనుభవించనీ ॥
తోడబుట్టినవారు అందరితో
మా అన్నయ్య చాలా మంచివాడంటే
ఆ ఆనందం ఎంతటి .మధురమొా
తోటి వారినభిమానించడంతో ॥
విద్యలన్నవి జ్ఞానాన్నిస్తాయవి
వినయంతోడ వాటిని నేర్చుకో
వివేకంతో వ్యవహరిస్తేమాత్రం
విశ్వం లో కీర్తిని పెంచుతాయవి.॥
1.
నిర్మలమైనట్టి మనసుతోని
అందరితోను కలసి మెలసి
ఆ స్నేహ మాధుర్యంలోని ఉన్నట్టి
నిత్యానందాన్ని అనుభవించనీ ॥
2.
తోడబుట్టినవారు అందరితో
మా అన్నయ్య చాలా మంచివాడంటే
ఆ ఆనందం ఎంతటి .మధురమొా
తోటి వారినభిమానించడంతో ॥
3.
విద్యలన్నవి జ్ఞానాన్నిస్తాయవి
వినయంతోడ వాటిని నేర్చుకో
వివేకంతో వ్యవహరిస్తేమాత్రం
విశ్వం లో కీర్తిని పెంచుతాయవి.॥
4.
కవిత్వం మనోభావాల పొందిక
చెప్పాలనుకున్నది చెప్పవచ్చు
అందమైన పదాల పొందికతో
కలం పట్టి కవితలు అల్లిక ॥
5.
నరక చతుర్దశి పండగన
చెడును తుడిపేయడం అంటారు.
తప్పు పనులను చేసి పడకు
నరకాన్ని తలపించే పాపాన ॥
6.
సత్యమే జయాన్నిస్తుంది మనసా
కష్టమైనా మంచిదారిలో నడు
ఆనందమంటే ఏంటో తెలుస్తుంది
సహజానందాన్ని పొందు మనసా॥
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులే
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నీ గడబిడలే ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు తెలుసా
రగిలే మనసదుపు చేయరా ॥
-------------------------------------------
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులె
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నీ గడబిడలె ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు తెలుసా
రగిలే మనసదుపు చేయరా ॥
-------------------------------------------
10.
మగ, ఆడలు సమానము సుమ
అన్నారు. మితిమీరిన స్వాతంత్ర్యం
ఆడ వారికి శాపమౌతుందమ్మా
మగాళ్ళు కొందరు చెడ్డోళ్ళు సుమ॥
11.
కట్టుా, బొట్టుా, స్త్రీల నడవడిక-
సాంప్రదాయబద్ధంగానే ఉండాలి.
మగవారితో అన్ని రంగాల్లోనుా
కలసి నడవండి. పదండిక .॥
12.
ముఖాలకు పెదాలకు అందము
సహజ సౌందర్యాల పద్ధతులు.
రంగులతో ఉన్న అందం పోతుంది
ముచ్చటది సహజ సౌందర్యము ॥
7.
లెక్కల్లో ఎప్పుడుా మంచి మార్కులే
చాలా బాగా చేయగలను మరి.
డబ్బుల సంపాదనలో పడ్దాకా
లెక్కల్లో అన్నియుా గడబిడలే ॥
8.
నాయకుడిని చేయండి నాయనా
మీకష్టాలన్నీ నావిగా తలుస్తా ।
ఐదేళ్ళకు మళ్ళీవచ్చడిగేడు-
నా మాట నమ్మరెందుకు నాయనా॥
9.
.రాజ్యాంగాల లో రణ నీతుందిరా
వాటిని చక్కబెట్టాలంటే నీకు
ఎప్పటికీ సాధ్యం కాదు నాయనా
రగిలే మదినదుపు చేయరా ॥
-------------------------------------------
10.
స్త్రీ , పురుషులు సమానము సుమా ,
అన్నారు. మితిమీరిన స్వాతంత్ర్యం
ఆడ వారికి శాపమౌతుందమ్మా
మగాళ్ళు కొందరు చెడ్డోళ్ళు సుమా॥
11.
కట్టుా, బొట్టుా, స్త్రీల నడవడిక-
సాంప్రదాయబద్ధంగానే ఉండాలి.
మగవారితో అన్ని రంగాల్లోనుా
కలసి నడవండి. పదండిక .॥
12.
ముఖాలకు పెదాలకు అందము-
సహజ సౌందర్యాల పద్ధతులు.
రంగులతో ఉన్న అందం పోతుంది
ముచ్చటది సహజ సౌందర్యము ॥
--------------------------------------------
13.
నీతులు ఎన్నో చెప్పొచ్చును కానీ
పాటించడము మర్చిపోకుాడదు.
ముందు మనము అనుసరించాలి
నిర్మలమైనట్టి మనసుతోని ॥
14.
మాట అనే ముందు ఆలోచించుమా
నాలుకకు పదునెక్కువంటారు
మాటను జారితే మరలిరాదు.
మనసు నొప్పించే మాటాడకుమా..॥
15.
సమాజము బాగులేదంటుా నస
రోజుా సమాజాన్ని నిందిస్తుా మాట
నువ్వుా, నేను, మనం, సమాజ కోట
సంగతెరిగితే చేసుకో "బాస" ॥
--------------------------------------
16.
తాగుబోతులను రోజుా తిడతా
పెళ్ళాలనెపుడుా కొడతారని
పిల్లలంతా చెడిపోతున్నారని.
తాగేందుకు సారా నేనే అమ్ముతా॥
17.
నా భార్యను చుాస్తే ఒప్పుకుంటానా
అందంగా ఉంటుంది.అందికే భయం.
మా పక్కింటామె అందంగా ఉంటుంది.
నా చుాపులన్నీ పక్కింటామె పైన ॥
18.
నీలాకాశంలో అందాలు చుాడనీ
చందమామ లో నీ ముఖ సౌందర్యం
ఆలోచనల అందలమెక్కనీ
నీతలపుల తో హాయి నిండనీ ॥
-----------------------------------------
19.
చిన్నారి నవ్వులు వెన్నెల్లు కాచి-
ఇల్లంతటా వెలుగులు నింపింది.
చిట్టి తల్లి ముద్దు ముచ్చటలతో-
చిందెలే ఆనందం సందడే తోచి.॥
20.
చిన్న పనిని కుాడా ఆలోచించి
చేయాలని పెద్దలంటారు కదా ।
పెద్దలు చెప్పిన మాటలు విను.
చిర సాంప్రదాయాల గౌరవించి ॥
21.
నీతి నియమాలు ఆచరించని-
బ్రతుకుకు అర్ధమన్నది లేదు.
తెలుసుకో తప్పు చేసి ఎపుడుా
నిత్య సుఖంగా జీవించలేవని ॥
----------------------------
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥
22.
కన్న వారికి విలువనివ్వక
వృద్ధాశ్రమాలపాలు చేస్తున్నారు
విలువలను పోగొట్టుకుంటారు
కానిపన్లతో కాపాడుకోలేక ॥
23.
తెలుగులోను మాట్లాడకపోతే
ఎలాగ ? తెలుగు విలువలైతే
కాపాడవలసిన బాధ్యతది
తెలుగు వారము మనమే ఐతే ॥
24.
సంస్కృతి -సాంప్రదాయాలు,తెలుసా
అంటుా ప్రశ్నించడం చేస్తారందరుా।
ఎవరుా పాటించేది మాత్రం లేదు
సరి బాట లేనాటికి మనసా..॥
25.
విలాసాలకు వేల ఖర్చులవి-
వింత జీవితాల విచ్చలవిడి.
చదువు సంధ్యలు లెక్కలేనివి
వివేకహీన వెక్కిరింతలవి ॥
26.
దయ లేని కర్కసకుల ఎద
మాన రక్షణ లేని సమాజంలో
శాపంగా మారిన స్త్రీ మానో వ్యధ
దయాపుారిత మౌ కన్నీటి గాధ ॥
27.
ముద్దులు కారే చిన్నారి తనము
కల్లా కపటమెరుగని తనం.
అమాయకపు నవ్వుల జల్లులు
ముచ్చట గొల్పును అహరహము ॥
28.
దశలు మార్చేది గ్రహాలన్నారు
జాతకాలంటుా చేతులు చుాస్తారు.
గ్రహ దోష ప్రభావ ఫలితంగా
దశల బాధలు తప్పవు కద ॥
29.
చెట్లకు చిగురులు చిగురించె
కొమ్మలతో చెట్టు పరవశించె
కృుార గొడ్డలి వేటుతో ఖండించె
చెట్టిచ్చే గాలికై గుండె రోదించె ॥
30.
కాలం జాలంలో చిక్కేవు నీవిక
తప్పని స్థితికి కుంగపోకిక
నియమాలను పాటించు నీవిక
కష్టం నష్టం కొని తెచ్చుకోక ॥
31.
జీవితం తో పడకెపుడుా రాజీ
రెండు మనసులు కలవాలంటే
సమయస్ఫుార్తి, సద్దుబాటుండాలి.
జీవిత గమనమౌతుంది ఈజీ ॥
32.
నెల వంక చిందించె వెన్నెలనె,
పున్నమి వెన్నెలల కాంతుల లో-
తీయని జ్ఞాపకాలు మది నిండి,
నెచ్చెలి సరసనుంటే హాయనె ॥
33.
నీలి మేఘమాల సందేశాలని
అందుకున్నాను ఆనందంతోడ నే
వెన్నెల నిండు మల్లెల నీడలో
నిలచి యుంటి చెలికోసమని ॥
34.
మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥
35.
కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥
36.
మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి ప్రేమ పంచండి ॥
34.
మంచి వారిని బాధ పెట్టకుమా
వారికి మనసు బాధ పడితే
మన కది మంచిది కాదంటారు.
మంచి చెడులు ఆలోచించుసుమా ॥
35.
కల్లా కపటం తెలియ నందుకా
పసి వారిని కాలరాస్తున్నారు
బాల కార్మికులను బాధించేది
కడుపు కింత అన్నం పెట్టేందుకా ॥
36.
మాతృత్వమది తల్లికి భారమా
ఆడపిల్లను అంతం చేయవద్దు.
ఆడపిల్ల ఇంటికి లక్ష్మంటారు.
మహిలో వారికి ప్రేమ పంచుమా ॥
37.
నిత్య సత్యుడైన భగవంతుని
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥
38.
నిగమ సారం తెలిసినా గానీ
చదివినంతనే జ్ఞాని కాలేడు,
మంచి గుణాలు, నడవడికలే
నిత్య జీవితోపయొాగములవి.॥
39.
తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥
37.
నిత్య సత్యుడైన భగవంతుని
నియమ నిష్టలతో కొలవాలి..
అభయ హస్తుని, ఆది దేవుని
నిత్యానంద దీక్షతో పుాజించనీ ॥
38.
నిగమ సారం తెలిసినా గానీ
జ్ఞాని యైనా, తెలుసుకోలేడు
మంచి గుణాలు, నడవడికలే
నిత్య జీవితోపయొాగములని॥
39.
తెలియక చేసిన తప్పులైతే
తెలియపరచి క్షమించవచ్చు.
తెలిసి తప్పు చేస్తే ఏమిచేస్తాం,
తెలిపి ప్రయొాజనం లేకపోతే॥
నిత్య కర్మాచరణలెందుకని
వాటిని అశ్రద్ధ చేయకుసుమీ !
తెలుసుకో మన సాంప్రదాయాలు
నిత్య ఆరోగ్య సాధనలేనని ॥
నీ మాటే నీకు శత్రువౌతుందని
తెలుసుకో. ఆలోచించి మాట్లాడు.
మనసు కష్టపెట్టని మాటకు
నీ వారంతా నిన్ను గౌరవించనీ ॥
తపస్సువంటి నీ సాధన చేత
సానుకుాల పడతుంది జీవితం.
చేస్తున్న పని మధ్యలో విడకు.
తరువాత పోతుంది చేసిందంతా ॥
పున్నమి కాంతి నిండిన తలపు
మేఘమాలికలిడు సందేశమై
నా మదిలో విరిసిన ప్రేమకు
పుాచిన పుావంటి చెలి వలపు.॥
వసంత కోకిల రాగాల నావ
నీ జ్ఞాపక విహారం చేయిస్తోంది
కలువలవంటి నీ కన్నులతో
వలపు పంచి అలరింప రావ ॥
పుాల వనంలో వచ్చే గుభాళింపు
మనసు పరవసింపజేస్తుంది.
చెలి పక్కనుంటే ఆ పరవశం
పుాల పరిమళం నిండు వలపు ॥
46.
రాముని రుాపు చుాడు కనులారా
రాముని కీర్తించుచుండు నోరారా
రాముని పుాజించుము చేతులారా
రామ నామమే ముక్తిల కదరా ॥
47.
సీతా రాముల అన్నోన్యత చుాసి
దంపతులెలా ఉండాలో చెప్తారు.
రాముని ధర్మ పాలనను చుాసి
సీమ రాజ్యాంగాలన్నీ సరిచేసీ..॥
48.
రామ లక్ష్మణుల ప్రేమ చుాడరా
అన్నదమ్ములంటే అలా ఉండాలి.
మారిన మనస్తత్వాల బాటలో
రగిలిపోయే బంధాలు చుాడరా ॥
49.
పదునాల్గు భువనాలను చుాప
మన్ను తిన్నాననుచు మాయజేసి
యశోద జన్మ తరింప జేసేవు
పద్మనాభా రావ కరుణ జూాప ॥
50.
కాళీయు నణచ చిన్ని బాలకా
కాళింది దుాకేవు భయము లేక
నారాయణుడవీవు నాధ కృష్ణా
కావుమా మమ్ము సమయమిదిక ॥
51.
దుష్టు లైన వారి కుాడ వలదు.
మంచి కోరు వారి మరువ వద్దు.
యొాచనెంచి చేయు మైత్రి ముదము
దుారమాలోచించు జయము నీదు ॥
52.
నాన్న అమ్మల అనురాగమన
అమృతము కన్నా తీయనైనది.
అవసానకాలంలో నువు వారి-
నమ్మకాన్ని వమ్ము చేయకు కన ॥
53.
ముాగ జీవులపై దయచుాపుము
విస్వాసాన్ని చుాపు జంతువులవి.
మనిషి కన్నా కుక్క నయమని-
మునుపన్నది తెలుసుకొనుము ॥
54
మనిషిగా మానవత్వం చుాపుమా
మంచి చెడులు తెలిసి వర్తించు.
మనమంతా ఒక్కటను భావంతో
మంచిగా నువు మహిని మనుమ ॥
తిరగడానికెళ్ళే ,తిరుపతి.
దైవ దర్శనం ముాడ్రోజులు పట్టి,
హుానం అయ్యింది ఒళ్ళంతా.బాబోయ్-
మళ్ళీ వస్తే ఉండాలి పరపతి.॥
రైతన్న వ్యవసాయంతో బేజారై ॥
ఉన్న పొలం అమ్ముకొని వచ్చేడు.
నోట్లై పోయేకా బతకడంకోసం
రైలెక్కేసాడు బతుకు బేజారై ॥
కరోనాలో విసిగా । పని లేక l
డిగ్రీ చేత నున్నా, కుాలీనయ్యేను.
అది చేయ లేక కుారలమ్మేను.
కష్టం తెలిసింది.కన్నీళ్ళొచ్చేక ॥
చంద్రుడు ఆకాశంలో కనుపించ
చెలి జ్ఞాపకాలే చెలరేగెను.
పరవసాన మది పులకించె
చక్కిలి గిలి కవితలు తోచ ॥
చక్కదనము ఉందని గర్వించ
చెదిరిపోవునది వయసు మీర
మంచి గుణివై మహిని మనిన
చరిత ఘనమగును గర్వించ ॥
చక్కనైన చెలి పలకరించ
వెచ్చని వలపు తలపు తోచె.
చెలి నవ్వులు చెంత కురిసెగా
చల్లని జల్లై మది మురిపించ ॥
దైవ ప్రార్ధన నిస్వార్ధమైనదై ,
నిర్మల భక్తితో నిండి ఉండాలి-
అప్పుడే దేముడు కరుణిస్తాడు.
ధేర్యం నిండు దైవ కృప మనదై ॥
పేద- సాదలపైన నువు చుాపే
దయా-ధర్మాలు మాత్రమే నీ అస్థి.
నీతి -నియమాల నడవడిక
పేరు తెచ్చే పెన్నిధికి పిలుపే ॥
మన సాంప్రదాయ రీతుల శ్రమ
మనం పెంచే మహా వృక్ష మంటిది.
ఎంతగా పాటిస్తే అంత ఆరోగ్యం.
మన ఆరోగ్యం , మహా భాగ్యం సుమా ॥
గోవిందుని శ్రీవాసము అదిగో
ధన్య మొంద ముక్తి ధామ మేలుకో
దరిసించీ దీవెనల నందుకో
గోవిందు సప్త గిలులు అవిగో ॥
దినదినముా మారే కాలమిది
మానవత్వం లేని మనిషి మది
ఏ జన్మ పాపమొా ఈనాటి విధి
దిన దిన గండం మార్పు రానిది ॥
ముత్య మంత బొట్టు నిండు ముఖము
చిరు నవ్వు నిండు పలకరింపు
సంస్కారమును మించు సౌశీలము
ముదితలందరి కది అందము ॥
మానవత్వాన్ని మర్చిపోయినారు.
ఈ మార్పులకు కారణం ఏమిటి ?
మార్పు ప్రగతికి భారముసుమా ॥
మనిషి స్వార్ధపు బానిస సుమా
పాపం పండి ప్రకృతి కోపించింది.
మంచన్నదై కలుషిత మయ్యింది.
మారని సమాజమే ప్రళయమా ॥
ముద్దు మురిపాలవి ఎరగము.
పిడికెడు అన్నానికి బానిసలం.
కాముకుల వలలో చిక్కుకున్నాం.
ముళ్ళ బాటలో మేమనాధలము ॥
కేలుమొాడ్చడిగిన వరాలకే
శ్రీరాముడు అడవిపాలయ్యేడు.
దశరధుడు ప్రాణం కోల్పోయేడు.
కేవలం నమ్మి మాట విన్నందుకే ॥
నలు దెసలా చుాచి శోకమున
యుద్ధము చేయనన్న పార్ధునకు
ఉపదేశించిన గీత సారము
నారాయణుడుపదేసించె ఘన ॥
దుర్యోధను నేను దునుమాడుదు.
ద్రౌపతినవమానించినవాడు.
అని భీముడు శపధం చేసేడు.
దుష్టులనదె వదల కుాడదు ॥
మధురమౌ సాహిత్య సంగీతమా
సృతి లయాద్భుత రస పానమా
మది మయుారైన మధుర గానమా ॥
గలగల మువ్వల సవ్వడిగ
మంజీర రవళులిడు పాదమా
అందమైనట్టి గతి గమనమా
గంభీర వాద్య లయ సందడిగ ॥
మనసార రామ నామ మనుమా
కోటి జప సార ఫల మహిమ
మక్కోటి దేవతల వేల్పునిది
మనసార జపించి తరించుమా ॥
మనసు మైమరపించే భావమా
మధురమౌ సాహిత్య సంగీతమా
సృతి లయాద్భుత రస పానమా
మది మయుారైన మధు గానమా ॥
గలగల మువ్వల సవ్వడిగ
మంజీర రవళులిడు పాదమా
అందమైనట్టి గతి గమనమా
గంభీర వాద్య లయ సందడిగ ॥
మనసార రామ నామ మనుమా
కోటి జప సార ఫల మహిమ
మక్కోటి దేవతల వేల్పునిది
మనసార జపించి తరించుమా ॥
కోపతాపాలు మది లో దాచుకో
కోపమన్నది నిన్నే దహిస్తుంది.
ఆలోచించిమాట్లాడడం నేర్చుకో
కోరి వలచే వారి గుర్తుంచుకో ॥
కుహుా కుహుా కోయిల రాగాలకు
మనసు ఆనందడోలికలుాగె
మనసు చెలి జ్ఞాపకాలై వేచె
కులుకు వయ్యారి చెలిరాక కు॥
నాదలోలుని వేణుగానమే, నా
మదిలో పొంగె మధురానందమై
అందాల కృష్ణుని రాక కై మది
నాట్య మయుారై నర్తించెను ఘనా ॥
తల్లి గోదమ్మ చుాపెడు అత్రత
రంగనాధుని పుాజ చేయుటకై
తెల్లారే చెలులందరినీ లేపి
తనియలుగ కీర్తనల జోత ॥
తరలి వచ్చిన ఆ సతులంతా
తల్లి గోదమ్మతో తరలి వెళ్ళి
రంగని కృపకు పాత్రులయ్యేరు.
తమ జన్మ ధన్య మాయెను మాత ॥
తథ్యముగా భక్తి కొలువు చేత
భాగ్యమదె కదా రంగని సేవ
పాశురములు పాడి కొలువరే
తరియింప, జన్మ కర్మపు రాత ॥
ముాడు నామాల వానికి మొక్కుము.
తిరునేడు కొండలనే ఎక్కుము.
తిరుపతి పురము పవిత్రము.
ముదము వేంకటేశుని చుాడుము.॥
ముద్దులొలుకు పసివారి మొాము
కల్లా కపటము లేక యుండును.
స్వశ్ఛమైన నవ్వులు కురియగ
మురిపాల తేలుదుమందరము ॥
ముసలితనము అతి భారము.
ఆధారపడితే ఇంకా ఘోరము.
ప్రేమ చుాపరెవరుా వారిపైని.
ముందరి బ్రతుకంతాను హీనము.॥
ముసలివారి ప్రేమగా చుాడుము.
అనుభవాల జ్ఞాన సంపంన్నులు
ఏ నిధికీ తుాగని చరితలు.
ముందు తరాల ముాల చరితము ॥
ముఖానికి బొట్టు స్త్రీ లకందము.
మనిషికి సంస్కారమది అందం.
మాటలో తీయదనము అందము.
ముంగిలి లో ముగ్గు ఇంటికందము.!!
మన నిధులను గమనించుమా
సాంప్రదాయాలు ఆరోగ్యసుాత్రాలు.
మన సంస్కృతి మహత్తర మేలు.
మార్గదర్శకాల మరువకుమా ॥
కులమతాలు ఎప్పుడుా చుాడకు
ధనం కన్నా కులమన్నది గొప్ప.
కులంకన్నా మిన్నయైనది గుణం
కుార్మిని మంచి గుణుల వీడకు ॥
ధర్మాన్న నుసరించమన్న బోధ
కృష్ణుడు అర్జునునికి చేసేడు.
కర్మ ఫలితాలు భగవదేచ్ఛ.
ధరలో పాటించడమదే బాధ ॥
కంటి పాపల్లా పిల్లల్ని పెంచేకా
వారు మనని వదిలేస్తే ఎలా....
వృద్ధాశ్రమంలో మన మనోవ్యధ.
కర్మఫలితానుభవమదిక ॥
మహాత్ములు చేసే తపోమహిమ
ధరణి ని కాపాడుతుందంటారు.
ఈ కాలంలో అటువంటివారేరీ..
మంత్రోచ్ఛారణే రాదు రామ రామా ॥
నిష్టా , నియమం, శుచికోసమని
పుార్వీకులు పద్ధతిగా పెట్టేరు.
పాత చింతకాయ పచ్చడన్నారు.
నిత్య నిష్టిపుడు "కరోనా" అని ॥
దిద్దని బొట్టు తో నుదురన్నది
పచ్చని పసుపుతో గడపది
నిత్య దీపంతో దేవ గది ఉంటే
దివ్యమై మంగళకరమౌనది
"దిన దిన గండ దీర్ఘాయు వది
పుార్వకాలపు ఒక సామెతది.
ఇప్పుడు సమంగా సరిపోయింది.
దీర్ఘ కరోనా తో గండంలా ఉంది.॥
కుారలు కడగనిదే వండకు.
విషపు నీటిలో ముంచుతున్నారు.
ధన స్వార్ధం ప్రాణాలు తీస్తున్నారు.
కుశలం కోసమై మరచిపోకు ॥
కొత్త వైరస్ వచ్చింది . తెలుసుకో
నిలవ మాంసాహారాన్ని తినకు.
సుచిగా, వేడిగా, వండుకు తిను.
కోరికలు కొన్నిటిని చంపుకో ॥
"దిన దిన గండ దీర్ఘాయు వది
పుార్వకాలపు ఒక సామెతది.
ఇప్పుడు సమంగా సరిపోయింది.
దీర్ఘ కరోనా తో గండంలా ఉంది.॥
కుారలు కడగనిదే వండకు.
విషపు నీటిలో ముంచుతున్నారు.
ధన స్వార్ధం ప్రాణాలు తీస్తున్నారు.
కుశలం కోసమై మరచిపోకు ॥
కొత్త వైరస్ వచ్చింది . తెలుసుకో
నిలవ మాంసాహారాన్ని తినకు.
సుచిగా, వేడిగా, వండుకు తిను.
కొనుక్కు తినే కోరిక చంపుకో ॥
మా ఇంటిలో మల్లెల ఘుమ ఘుమ.
క్రిష్ణ మందిరంలో పుాలంగిసేవ
క్రిష్ణునికి రోజుా మల్లెలార్చన-
మా తోట లో పుాలతో పుాజింపుమా॥
మాధవుని మనోహర రుాపమా
మాటలకందని పరవశమా
లీలా కృష్ణుని ఆ వేణు నాదమా
మదిలో భక్తి నిండు ఆనందమా ॥
గోదమ్మ కృష్ణ భక్తి చుాడదిగో
తన్మయత్వంతో పాశురాల సేవ
ఆమె భక్తికి దిగివచ్చెనదే
గోవింద గోపాలుడు , చుాడడుగో ॥
మార్గశిర మాస మంత్ర మహిమ-
పాడుతుా వినిపిస్తీంది గోదమ్మ .
నిద్రలేచి రమ్మంటోంది పుాజకై
మా గోదమ్మతో కలిసి పోదామా
గోపికలు వస్తున్నారు అదిగో...
గుంపుగా చేయ సరిగంగ స్నానాలు.
వలువల జాగర్తగా చుాసుకో
గిొవింద గోపాల బాలురదిగో ॥
వెన్న దొంగ వేంచేస్తున్నాడు రావెే
ఉట్టి పగలగొట్టక మునుపే
వెన్న పాలను ఆరగింప నిద్దాం
వెన్నుని రుాపదని తెలియవే ॥
మార్గశిర మాస మంత్ర మహిమ-
పాడుతుా వినిపిస్తీంది గోదమ్మ .
నిద్రలేచి రమ్మంటోంది పుాజకై
మా గోదమ్మతో కలిసి పోదామా
గోపికలు వస్తున్నారు అదిగో...
గుంపుగా చేయ సరిగంగ స్నానాలు.
వలువల జాగర్తగా చుాసుకో
గిొవింద గోపాల బాలురదిగో ॥
వెన్న దొంగ వేంచేస్తున్నాడు రావెే
ఉట్టి పగలగొట్టక మునుపే
వెన్న పాలను ఆరగింప నిద్దాం
వెన్నుని రుాపదని తెలియవే ॥
తల రాతను మార్చగల వింత
కరోనా జన్మ మన కర్మ చేత
మంచి పద్ధతుల అవాటుకు
తరచి పద్ధతి పాటించు కొంత ॥
తిరిగే అలవాటుకు దుర్గతి...
తిట్టే నోరున్న వారికి నిర్భయం
మర్యాదున్న వాడికి సిగ్గు భయం
తిడితే పోయిందట ఉన్న మతి. ॥
రాతలు మారని రైతు గోడురా
అన్యాయాలకు వెరుపు లేదురా
రైతు చావులు మనకు శాపంరా
రాజే రైతు . వారిని కాపాడరా ॥
-----------------------------------------
Wednesday, November 22, 2023
శీర్షిక :మనుజ తెలుసు కొనుమ మంచి మాట ॥
Saturday, November 18, 2023
కార్తీక పూర్ణిమ.
తపస్వి మనోహరం కవిత కొరకు,
18/11/2023.
అంశం : కార్తీక కార్తీక పూర్ణిమ.
శీర్షిక : సాంప్రదాయాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
ప్రక్రియ : ఆటవెలది
ఆక సమ్ము నంటు నాకాశం దీపాలు
ఆల యాల వెలుగు నాది గాను.
దారి చూపు కంబ ధ్వజము నందున నిల్చి
పాత్ర లోన దివ్వె పాప హరిణి ll
కార్తికమ్మునందు కార్తీక పౌర్ణమీ
దీప వళుల తోడ దివ్య ముగను
వెలుగు నిండు జగము వేల సిరులు పంచు
హరియు హరుడు గూడీ నలరుచుండ ll
శక్తి తోడ. గూడి శివుడు యుద్ధము జేసె
సురుల నరుల కెల్ల శుభము జేసే
త్రిపుర సురుల గూల్చ త్రేలోక్య విజయమ్ము.
పౌర్ణ మదియె మనకు పుణ్య దినము ll
కార్తి కమ్ము నందు కడుభక్తి తోడనుా
దీప దాన మిడిన దివ్య ఫలము
మాస మియ్య దిలను మహిమాన్వి తంబనీ
ఋషులు మునులు జెప్పె ఋజువు తోడ॥
సాంప్ర దాయ రీతి సద్ధర్మ ములతోడ
శివుని కొల్తు రిలను శీల వతులు
పాప ములవె బాయ పడతులం దరుగుాడి
పుాజ సేతు రిలను పుణ్య మలర ॥
పేర్చి దీప వళుల పేర్మిపుా జలుజేసి
నెయ్య మునను గలసి నెయ్యి బోసి
ఆక శమ్ము జేర నాకాశ దీపమ్ము
వెలుగ సంత సముల వేల్పు గొలచి ॥
ఉదయ సంధ్యలు వారు ఉపవాస దీక్షతో
మహిమ దలచి మాత దుర్గ గొలచి
శంక లవియె తొలగ శక్తి వేల్పుల గొల్చి
ఫలము పొందె దరుగ పడతు లెల్ల ॥
నిష్ట తోడ జేయు నిత్య కార్యము లెల్ల
సఫల మౌను అదియె సత్య మిలను
అణువు ఆణువు లోన అగుపించు నీశ్వరుడు.
మనసె తీర్ధ మౌను మహిని మనుజ॥
సత్య ధర్మ ములను సరిమార్గ ములదెల్ప
వ్రతము నోము లనుచు వర్ణ నలిడి
సకల జనుల గుణము సన్మార్గ ములనేల
సంప్ర దాయ మేలె సార గతుల ॥
******************************
Tuesday, November 14, 2023
శీర్షిక : కుదిరితే చిన్న చిరునవ్వు.....
Friday, November 3, 2023
Friday, October 13, 2023
గీతా సారం , మినీ వ్యాసం
09/10/2023.
తపస్వి మనోహరం "ఈ బుక్ " కొరకు,
అంశం : గీతా సారం.
శీర్షిక : నిన్ను నువ్వు తెలుసుకో..
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.
ఈ జగతిలోప్రతి మనిషి పుట్టుక కర్మానుబంధమే.
ఈ భూమి ఒక కర్మ క్షేత్రం.
చేసే కర్మను అనుసరించే మనిషి బుద్ధి కూడా ఉంటుంది.
ప్రతి మనిషి జీవితమూ, , కష్ట-సుఖాలు, సుఖ-దుఃఖాలు నిండిన ఒడిదుడుకుల ప్రయాణమే.
ఈ ప్రయాణంలో కష్టానికి గాని, సుఖానికి కానీ, వెరవకుండా,
కష్టాన్ని భరిస్తూ, సుఖాన్ని ఆస్వాదిస్తూ రెండింటి మధ్యలో దేనికి చలించకుండా , తన పని తాను చేసుకుంటూ పోతూ ఉన్నవాడు, స్థితప్రజ్ఞుడు అనబడతాడు.
అటువంటివాడు అన్ని పరిస్థితులకు ఎదురీది నిలబడగలడు.
----------
కష్టానికి భయపడుతూ, పరిస్థితులకు ఆందోళన పడుతూ,
బ్రతుకు ప్రయాణాన్ని భారంగా నడుపుతున్న వారికి అన్ని భయాలే, అన్నీ ఆందోళనలే .
నాది, నా వాళ్లు , నా బంధువులు, నా కుటుంబం, అన్న చోట స్వార్థం నిండి ఉంటుంది .
కొందరిలో ఈ స్వార్థం ఎంతవరకు దారితీస్తుందంటే,, నా వాళ్లు, అనుకున్న ప్రతి ఒక్కరి తప్పులను ,కప్పిపుచ్చుతూ, వారి మీద ప్రేమతో, అవమానాలను ఎదుర్కొంటూ, ఆందోళకరమైన బాటలో అశాంతి పాలవుతూ ,ఆత్మవంచనకు లోనవుతూ
ఆత్మశుద్ధిని కోల్పోయి అధోగతి పాలవుతారు.
మరికొందరు చిత్తశుద్ధితో," మేము, మనము, "అన్న బాటలో నడుస్తూ, అందరి పట్ల సమాన దృష్టితో వ్యవహరిస్తూ,
సత్యం, ధర్మం ,శాంతి అనే బాటలో , నిశ్చల నిర్మలత్వానికి ప్రతీకలై , చిరకాల "కీర్తులై " ఆ చంద్రార్కం, అందరి మనసుల్లో నిలిచిపోతారు.
-------
ప్రతి మనిషి జీవితమూ, ఒక గెలుపు పోరాటమే.
ఈ ,"నీ "పోరాటంలో "నా "అన్న వారు ఎవరూ నీకు తోడు రారు.
కానీ నీ "గెలుపు "జీవితంలో, భాగస్వాములు మాత్రం అవుతారు.
అదే "మనమంతా ఒక్కటే" అంటూ, నడిచిన బాటలో, అందరూ నీ వారే . వారంతా నీకు తోడే.
ఇక్కడ "ఏది మంచి, ఏది చెడు" అన్న విశ్లేషణ చేసుకుంటూ పోతే, నీ ,నా ,బంధాలు కనుమరుగవుతాయి .
అక్కడ ఒక ధర్మం, న్యాయం, మాత్రమే బంధమై నిలిచి ,నీకు బలమై నడిపిస్తుంది.
ఈ పోరాటంలో ధర్మం గెలుస్తుంది .
అధర్మం నాశనం అవుతుంది.
ఆత్మ శుద్ధితో చేసే నీ పోరాట ఫలితం, పరమాత్మగా నిన్ను నిలుపుతుంది .
అప్పుడు నీ ఆత్మే, పరమాత్మ స్వరూపమై నిన్ను , నన్ను. , అందరిని , నడిపిస్తుంది.
ఆ నువ్వే ,భగవత్ స్వరూపానికి ప్రతిరూపమై, నువ్వు ఆడే ప్రతి మాట "భగవద్వాక్య" మౌవుతుంది.
అటువంటి పలుకుల సారమే " లోక కళ్యాణ కారణమై",
జగతిలో వెలుగులను ప్రసరించే " భగవద్గీతగా"
ఆమోదించబడి, ఆచరించబడుతుంది..
దీనిని అనుసరించిన మానవ జీవితం, పాప
ప్రక్షాళనమై "ధన్యం" అవుతుంది.
--------------
"భగవద్గీత "అంటే కురుక్షేత్రంలో, శ్రీకృష్ణుడు, అర్జునుడికి బోధించినది మాత్రమే కాదు.
మన నిజ జీవితంలో,
భక్తి , జ్ఞాన, వైరాగ్య, కర్మ, యోగాలకు నిలయమైన, మన" సాంప్రదాయ సంపదలై" , మనకు నిత్యం మార్గదర్శకం చేస్తునే ఉన్నాయి.
పుట్టిన ప్రతి మనిషి జీవితానికి కొన్ని పరిధులుంటాయి.
ఆ పరిధులే నీతి ,న్యాయం , ధర్మం, బుద్ధి, వివేకాలతో
నిండి ఉన్న మన సభ్యత , సంస్కారాలు .
అవే మనిషి వ్యక్తిత్వాన్ని , నడవడికని శాసించే "గీత"లు.
ఆ" గీత"ను దాటనంతవరకు, మనిషి తన జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ , అదే ఆనందాన్ని పదిమందికి పంచగలిగే "పరమాత్మ స్వరూపుడౌతాడు.
---------
అదే మనిషి " గీత దాటితే" రాక్షసత్వం నిండిన దశ దుష్ట అహంకారాలకు బానిసై,
తన వినాశనానికి తానే కారకుడైన రాక్షసాధముడౌతాడు.
---------------------------------------------
ప్రక్షాళింపబడిన మన ఆత్మయే "భగవత్స్వరూపం"
ఆ భగవంతుడి నోటి నుండి వెలువడే పలుకుల సారమే
"భగవద్గీతా సారం".
ఈ విషయాన్ని అర్థం చేసుకుని" నిన్ను నువ్వు తెలుసుకోగలిస్తే"
నీలో ఉన్న ఆత్మే , పరమాత్మ స్వరూపమని గ్రహించగలవు.
-----------------
శీర్షిక: మనసు" లో"మాట విను.. (కథ)
తపస్వీ మనోహరం పత్రిక కొరకు.
అంశం : చిత్ర కథ.
రచన :శ్రీమతి ; పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ :మహారాష్ట్ర.
----------------
కథా ప్రారంభం.
శీర్షిక: మనసు" లో"మాట విను..
-------------
మనోహర్ కష్టపడి చదువుతున్నాడు.
మనసులో నిండా కసి ప్రకాష్ మీద .
వెధవ ,వాడే ఎప్పుడు కాలేజీలోని ఫస్ట్ వస్తూ ఉంటాడు .
కాలేజ్ ఎలక్షన్లో వాడే ఎప్పుడు లీడర్ గా ఎన్నుకోబడతాడు.
ఇప్పుడు ఎలాగైనా సరే వాడిని నేను ఓడించాలి.
ఓడించాలంటే చదవాలి .కాలేజీలో నాకు మంచి పేరే ఉంది. కానీ ఏం లాభం..?
తను ఎలాగైనా" లీడర్ "అవ్వాలి అంతే ....
మనోహర్ "లో" మనసు బాధగా మూల్గింది.
" నువ్వు పైకి రావాలని చదువుకో"...
"ఆ ప్రకాష్ మీద పంతంతో మాత్రం చదవకు మనోహర్." అంటూ....
తన బుద్ధిని విమర్శిస్తున్న మనసును కోపంగా
పక్కకు నెట్టాడు మనోహర్.
"నువ్వు ముందు నోరుముయ్..."
"ఈసారి నేను లీడ్ లీడర్ అవ్వకపోతే వాడి పని చెప్తా..",..
----------------------
రిజల్ట్స్ వచ్చాయి. మనోహర్ డిష్టెన్షన్ లో పాస్ అయ్యాడు. మనోహర్ ప్రవర్తన, చదువు ,చూసిన మీదట ,ఆ సంవత్సరం కాలేజీ "లీడర్ "గా మనోహర్ ఎన్నుకోబడ్డాడు
తనను కంగ్రాట్స్ చేస్తున్న ప్రకాష్ వైపు, మనోహర్ క్రూరంగా చూశాడు.
-----------------
మనోహర్ ఇంటికెళ్లగానే తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిదనే చెప్పాలి .మనోహర్కి కూడా చాలా ఆనందం వేసింది .
తండ్రి మనోహర్ ని పిలిచి, ఓ" తాళం చెవి "చేతిలో పెట్టాడు ఏంటి నాన్నా.,? అన్నాడు మనోహర్ .
తండ్రి బయటికి చూపించాడు .
"స్కై బ్లూ కలర్" లో ఉన్న కొత్త "బైక్ "తనకు స్వాగతం చెప్తోంది.
మనోహర్ ఆనందం అంతా ఇంతా కాదు .
వెంటనే ,అవునులే..
తను ఒక్కడే గా కొడుకు. తన తర్వాత ముగ్గురు అప్పచెల్లెళ్లు ఉన్నారు. వాళ్లకు పెళ్ళవగానే వాళ్ళు వెళ్ళిపోతారు. తనేగా నాన్నని చూడవలసింది. మరి తనకు ఇవ్వక మరెవరికి ఇస్తాడు.
మనసులో స్వార్థంగా ఆలోచించినా , పైకి మాత్రం మనోహర్
సంతోషంగా డాడీని హత్తుకున్నాడు.
-------------------
మనోహర్ డాబా మీద నిల్చుని బైనాక్యులర్తో ఎదురింటి
" మీనాక్షిని" అదేపనిగా చూస్తున్నాడు . "మీనాక్షి" ఎదురింట్లో ఉన్న "చంద్రం". భార్య.
చంద్రం కి తనంటే ఎంతో అభిమానం . తన "క్యారెక్టర్" అంటే చంద్రం కి ఎంతో ఇష్టంట. అవును మరి తను అందరి
దగ్గర అలాగే బిహేవ్ చేస్తాడుగా....
తన మనసులో జరుగుతున్న యుద్ధం ఎవరికీ తెలుసు..?
తను రోజూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. చంద్రం వెంటనే భార్యను పిలిచి , కాఫీ టిఫిన్ తెప్పిస్తాడు .ఇద్దరు కూర్చుని చాలా సరదాగా తనతో మాట్లాడుతూ ఉంటారు .
తన కళ్ళు మాత్రం , నఖ సిఖ పర్యంతం మీ మీనాక్షి అందాన్ని,.
పరిశీలిస్తూనే ఉంటాయి... దొంగతనంగా.,...
కానీ తను వెళుతుంది మీనాక్షి కోసమే అని చంద్రం కి తెలియదు ఇంతకీ తనకు ప్రత్యేకంగా "మీనాక్షి" అంటే ఏమీ అభిమానం లేదు ,
కానీ ఆమె ఫిగర్ ఉందే.....అబ్బ....
ఏదో రోజు దీని పని పట్టాలి. "తనే "అని తెలియకుండా ,ఏదో చేసేయాలి..... కాఫీ తాగుతూ మనోహర్ "కామ వాంఛతో"
.. రగిలిపోతున్నాడు.
మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"నమ్మిన వాళ్లని మోసం చేయకురా"... అంటూ..
నువ్వు " పో " అవతలికి అంటూ, నెట్టేసాడు నిర్లక్ష్యంగా.,
-----------------------
పిల్ల నచ్చిందా మనోహర్..?
ఎన్నో సంబంధాలు చూసాం రా .కానీ మాకే పిల్లా నచ్చలేదు ఈ పిల్ల నీకు బాగా నప్పుతుందని అనిపించింది .
చూడు ఎంత అందంగా ఉందో.
కట్నాలు, కానుకలు కూడా మనకు తగ్గట్టుగానే ఇస్తామంటున్నారు ...అంటూ మెల్లగా చెప్పింది మనోహర్ చెవులో..
పెళ్ళంటకు ఏం బాగోలేదు కొంచెం లావు కూడాను అయినా
మనోహర్ కి , వాళ్ళు ఇస్తున్న కట్నం మాత్రం భలే నచ్చేసింది .
అందుకే ,మనోహర్ కళ్లు దించుకొని అన్నాడు
,మీ ఇష్టమేనమ్మా,! మీరు ఎలా చెప్తే అలా "
పిల్ల పేరు రాజ్యలక్ష్మి. రాజ్యం ,రాజ్యం అని పిలుస్తూ ,కొన్నాళ్లు చుట్టూ తిరిగాడు .కానీ పై కిటికీ లోంచి మీనాక్షిని చూడడం మాత్రం మానలేదు.
". ఛి..ఛీ .. నీ బుద్ధి మరి మారదా ? మనసు మళ్లీ హెచ్చరించింది ...
"ఏయ్ ! మళ్లీ నన్ను డిస్టర్బ్ చేయకు".. అంటూ మనసు తలుపులను అప్పటికి మూసేశాడు మనోహర్.
-----------------
తన పెళ్లయిన సంవత్సరం తర్వాత ,తండ్రి వీలునామా రాశాడు ఆస్తి తనతో పాటు, ముగ్గురు ఆడపిల్లలకి పంచాడు.
మనోహర్. మనసులో కుతి కుతలాడిపోయాడు.
" ఏంటి? వాళ్ళు తన దగ్గరే ఉంటారు. కానీ ఆస్తి మాత్రం ఆడపిల్లలకు కూడా ఇస్తాడా ..? ఎంత దుర్మార్గం.
ఈ ఆస్తి మగపిల్లాడినైనా తనకే కదా చెందాలి. తన దగ్గరే ఉంటూ ఆస్తి మాత్రం అందరికీ పంచేస్తే ఎలా..?
వాళ్ళు చచ్చే వరకు, తనే చూసుకోవాలి కదా!
ఇంకా ఈ పప్పులేం ఉడకవ్ .
వీళ్ళ పని చెప్తా ..ఏదో ఒకలాగా వీళ్ళని వృద్ధాశ్రమానికి పంపించేస్తా.... హమ్మా.....
ఆ క్షణం నుంచి మనోహర్ కి తల్లిదండ్రుల పైన గౌరవం తగ్గిపోయింది.
మనోహర్ లో అప్పుడు మొదలైన" కసి "క్రూరత్వంగా అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంది. ఈటెల లాంటి మాటలతో ,తల్లిదండ్రులని అవమానిస్తూనే ఉన్నాడు..
మనోహర్ లో వచ్చిన ఈ మార్పుని , తల్లిదండ్రులు గమనించారు గానీ ,ఏమి చేయలేక కళ్ళు నీళ్లు పెట్టుకునేవారు.
మనోహర్ కి మాత్రం, తల్లిదండ్రులని ఇంకా తన దగ్గర ఉంచుకోవడం అనవసరం అనిపిస్తుండేది
"కానీ వాళ్ళని బయటకి పంపడం ఎలా ? భార్య "రాజ్యం" కి ఏమీ అర్థం కాదే ..? వాళ్ళని తన తలిదండ్రుల కన్నా ఎక్కువ గౌరవంగా చూసుకుంటున్నాదే....
బయట తనను , తనను అందరూ పొగుడుతున్నారు.
పెళ్లయినా తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకొని ఎంత గౌరవంగా చూస్తున్నాడో అని.....
"అందుకే ఎవరికీ పట్టు పడకుండా" ప్లాన్" వెయ్యాలి" అనుకున్న. మనోహర్ ..
అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు...
మనోహర్ "లో" మనసు మళ్లీ బాధగా మూల్గింది.
"ఒరేయ్.. నీచుడా! వాళ్ళు నిన్ను కన్న తల్లిదండ్రులు రా!
"వాళ్ళ ఋణం తీర్చుకోరా" అంటూ ఏదో చెప్పపోయింది.
"నువ్వు లోపలికి పోతావా ?పోవా ?
మళ్ళీ నాకు ఇలాంటి సలహాలు ఇవ్వకు." అంటూ లోనికి నెట్టేసాడు.
---------------
మనోహర్ భార్య రాజ్యం, నెల తప్పింది .అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే సాకుగా, భార్య "ఇంట్లో పనులు చేస్తే కష్టం" అని చెప్పి , మనోహరో భార్యని పుట్టింటికి పంపించేశాడు." అమ్మయ్య దీని బాధ తప్పింది" అనుకుంటూ.
భార్య వెళ్ళిన నెలలోనే తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో దింపి వచ్చాడు మనోహర్ . తను ఆఫీస్ పనితో వారిని సమంగా చూసుకోలేడని , భార్య వస్తే ,మళ్లీ ఇంటికి తీసుకొస్తానని చెప్పి మభ్యపెట్టి వచ్చేసాడు ...
కళ్ళు నీళ్లు పెట్టుకుంటున్న తల్లిదండ్రులను "కసిగా" చూశాడు. "ఉండండి ఇక్కడే ..డబ్బంతా ఇచ్చేసారుగా అప్పచెల్లెళ్లకి...
ఇకపై వాళ్లే చూస్తారు మిమ్మల్ని," అనుకుంటూ,
పైకి మాత్రం వాళ్లని వదిలి వెళ్ళలేనట్టుగా వెళుతూ,," నటనలో తనను మించిన వారు లేరు "అనుకోని మురిసిపోతూ,
" నాన్న ఇచ్చిన బైక్ " ఎక్కి ,
ఇంటికి బయలుదేరాడు మనోహర్.
"ఛీ...సిగ్గులేని వెదవా" ఉంటూ ఏదో చెప్పబోతున్న మనసుని మళ్లీ పక్కకు తోసేసాడు.
----------------------------+
భార్య పుట్టింటికి వెళ్ళడం, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉండడం , సాటర్డే సండే ఆఫీసుకు సెలవులు కావడంతో, కాలక్షేపం కోసం చేసే చెత్త ఆలోచనలు బోలెడు స్వాగతం చెప్పాయి మనోహర్ కి.
కనిపించిన ఆడవాళ్ళని ,కళ్ళతోనే ఎక్స్రే తీసేస్తున్నాడు.
ఆలోచనలోనే ఆనంద విహారాలు, శోభనాలు, జరుపుకుంటున్నాడు.
ఒకరకంగా చెప్పాలంటే , "టెన్షన్ "లేని , మా మానసిక వ్యభిచారిగా మారి ,హాయిగా జీవితం గడుపుతున్నాడు , మంచివాడుగా "మాస్క్" వేసుకున్న మనోహర్.
---------------------------------
ఏడవ నెలలో " గాజులు పెట్టిన ఫంక్షన్ కి "వెళ్లి ,
ఫంక్షన్ కి వచ్చిన లేడీస్ ని, చూసి చూడనట్టు చూస్తూ,
తృప్తిగా తిరిగి వచ్చాడు మనోహర్.
"డెలివరీ టైం ", దగ్గర పడగానే, భార్యని ఆస్పత్రిలో జాయిన్ చేసిన చోటికి బాధ్యతగా వెళ్ళాడు మనోహర్.
అక్కడ నర్సులతో మర్యాదగానే ఉంటూ ,మానసికంగా దగ్గరైన ఫీలింగ్స్ తో, మనో యాత్రలో మలినం పూసుకున్నాడు.
-------------------
టెన్షన్ గా ఉంది . మనోహర్ కి.
భార్యను "డెలివరీ రూమ్" లోకి పట్టుకెళ్ళారు
కొన్ని క్షణాల్లో తనకి "వారసుడు" పుట్టబోతున్నాడు.
తండ్రిగా చాలా ఆత్రుత పడుతున్నాడు మనోహర్.
పుట్టబోయిన పసికందు, "మీనాక్షి లా ఉంటుందా..?
రాగిణిలా ఉంటుందా..? షీలాలా ఉంటుందా..?
మీనాలా ఉంటుందా.".? అనుకుంటూ ,ఊహల్లో తేలిపోతున్నాడు. మనోహర్.
------------------
నర్స్ వచ్చి ,పిలిచే అంతవరకు ఈ లోకంలో లేడు మనోహర్. "చూడండి మీకు మగపిల్లాడు పుట్టాడు" అంటున్న నర్స్ మాటలకు తుళ్లిపడి , ఆ వైపుకు చూశాడు.
"నర్స్" తన చేతిలో ఉన్న బాబును" మనోహర్ కు" అందించింది.
మనోహర్ ఆనందంగా బాబుని, చేతులతో పట్టుకున్నాడు. చూశాడు, మళ్లీ చూశాడు మళ్ళీ మళ్ళీ చూసాడు .ఆశ్చర్యంగా చూశాడు. అదోలా చూసాడు.. మనసులో అలజడి మొదలైంది ఏంటి బాబు ఇలా ఉన్నాడు..? చిన్న పిల్లలు ఇలాగే ఉంటారా? ఏమో? మనోహర్ లో తండ్రి ప్రేమ తన్నుకొచ్చింది .
నెమ్మదిగా బాబును ముద్దు పెట్టుకున్నాడు .
లేదు ..లేదు.. " తను బాగుంటాడు .తన భార్య బాగుంటుంది. తల్లిదండ్రులూ అందంగానే ఉంటారు . భార్య వేపు వాళ్లు కూడా చాలా బాగుంటారు.
"బాబు , ఎలాగ, ఇలా పుడతాడు"
" అందంగానే ఉంటాడు "
మనోహర్ తన మనసుకు తనే, సర్ది చెప్పుకుంటూ పిల్లాడిని
" నర్స్ " కు అందించాడు..
మనోహర్ "లో" మనసు పెద్దగా నవ్వింది .
ఒరేయ్ బాగోదు నీ రక్తమేరా..?
ఒరేయ్ నీ వికృత ఆలోచనల భావమే నా కొడుకుగా నీ ముందు కొచ్చింది రా.....
" అది నిన్ను జీవితాంతం తరుముతూ, నీతోనే ఉంటుందిరా.... వాడు వచ్చేసాడు గా..ఇక నేను నీతో ఉండను . హహహహహ"అంటూ..
వెళ్ళిపోతున్న మనసును గట్టిగా పట్టుకు లాగాలనుకున్నాడు కానీ మనసు మనోహర్ "వశం" కాలేదు.
----------------------
ఏళ్లు గడుస్తున్నాయి . బాబు పెద్ద అవుతున్నాడు.
కానీ వికృతంగా....
పక్క నుంచి ఎవరో ,
ఆలోచనలు మంచివి అయితే ,ఆచరణలు మంచివౌతాయి.
ప్రస్తుతం మనుషుల్లో "రాక్షసుడు "ప్రవేశించినట్టు,
మానవత్వం లేకుండా పోయింది .వావి ,వరుసలు, మరిచిపోయాడు.
ఎక్కడపడితే అక్కడే దొంగలు ,దురాగతాలులూను .
అంటున్నాడు . పక్కనే ఉన్న అతను
అయినా "చెట్టు చెడే కాలానికి కుక్క మూతి పిందెలు పుడతాయట ".
"ఈ తరం మనుషులు చేసే పనులకి ,వాళ్ళ ఆలోచనలకి,
తగ్గట్టుగానే వాళ్ళ పిల్లలు కూడా, వికృతంగా పుట్టి, వెధవల్లా ప్రవర్తిస్తున్నారు.
" యద్భావం తద్భవతి" అన్నట్టు,
"మనసులో మంచి భావాల్ని పక్కకు నెట్టి,
చెడ్డ భావాల్ని ప్రేరేపిస్తూ ఉంటే ,ఈ ప్రపంచం ఇలాగే తయారవుతుంది, ఏం చేస్తాం ఎవరి ఖర్మ వాళ్లది"
అనుకుంటూ వెళ్లిపోతున్నారు.
మనోహర్ గతుక్కుమన్నాడు అంటే ....
"తన వికృతమైన ఆలోచనల వల్లే, తనకు ఇలాంటి బాబు పుట్టాడా ? ...
"మనసు "అద్దం" లాంటిదంటారు.
"అది తనని తనకు చూపిస్తూనే ఉంది.
"తనే నిర్లక్ష్యంగా ,ఆ అద్దాన్ని ,ముక్క ముక్కలు చేశాడు కదూ.!
"అంటే తన ప్రవర్తన అంత బాగోలేదా ? తన ఆలోచనలు తప్పా?"
"అవును . తను కూడా, మంచి మనసు మాటలను వినకుండా , ఎన్నోసార్లు నెట్టేసాడుగా ! తన వికృత ఆలోచనల వల్లే బాబు ఇలా పుట్టాడా! "
"నేను ఒక్కడినే నా ఇలా,"
అనుకుంటూ, మనోహర్ కంగారుగా బయటకు వెళ్లాడు తిరిగినచోట తిరగకుండా తిరిగాడు .తనతో ఉన్న స్నేహితుల్లో చాలామందికి ఇలాంటి పిల్లలే పుట్టారు .
కొంతమంది పిల్లలు చాలా అందంగా ఉన్నారు
అవును వాళ్ళ బుద్ధి,మనసు చాలా మంచివి .
తనలా లోపలొక లాగా, పైకొక లాగా, ఎప్పుడూ
ప్రవర్తించలేదు."
పక్క మైదానంలో తన కొడుకు" స్కూల్ ఎగ్గొట్టి "పిచ్చిపిచ్చిగా అరుస్తున్నాడు . అవతలి వాళ్ళతో దెబ్బలు తింటూ...
ఇదివరకు తన లోపల బుద్ధి ఎలా ఉండేదో ,
పుట్టిన బాబు బుద్ధి బయటకు అలా ఉంటోంది .
మరి అందుకే, అందరి చేత తన్నులు తింటున్నాడు.
మనోహర్ , బాధతో ఆలోచిస్తున్నాడు. బాబుని ఉంచుకోవాలా? వద్దా? ఏ అనాధాశ్రమంలోనో వదిలేస్తేనో....
అమ్మో తన" రక్తం పంచుకు పుట్టిన బిడ్డని" తను వదిలేయగలడా?
క్షణంలో అతని మనోగతంలో తల్లితండ్రులు మెదిలారు.
ఉడిగి పోయిన బడుగు శరీరాలతో, వణుకుతున్న చేతులతో కన్నీళ్లు తుడుచుకుంటూ.
తనలాంటి వాడికి మంచి సాస్తే అయ్యింది.
. తనకిప్పుడు" మంచి- చెడులు", చెప్పడానికి
, తన మనసు కూడా తనని వదిలిపెట్టి వెళ్ళిపోయిందే.,. ఎలా... ఇప్పుడు నేనేం చేయను ? అనుకుంటూ..
ఎటు తేల్చుకోలేని మనోహర్, పిచ్చివాడిలా "బుర్ర "పట్టుకుని కూర్చున్నాడు కొడుకు తీరును చూడలేక ,చూడలేక, చూస్తూ..
----------------------------
మనసు లోతుల్లో ఎక్కడి నుంచో లీలగా వినిపిస్తోంది .
"ఇప్పటికైనా మారు".
"మంచిని చూడు"
"మంచి మాట్లాడు"
"మంచి చేయి"
" మంచి ఆలోచనల బాటలో నడువు"
ఎటు తేల్చుకోలేనప్పుడు "మనసు మాట విను".
మనసు "అద్దం లాంటిది"
" నిన్ను నీకు "చూపిస్తుంది.
----------------------------------.