Monday, February 21, 2022

మాతృ భాషాదినోత్సవ కవితలు 2022





21/02/2022.
మహతీ సాహితీ కవి సంగమం .కొరకు
అంశం : చిత్ర కవిత .
ప్రక్రియ :  వచన కవిత.
మ.సా.క.సం.19.
కవిత సంఖ్య : 1.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు జగతికి వెలుగు.

శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, 
తెలుగు భాషకే ఇచ్చిన నీరాజనం .
స్పష్టత, నేర్పు, భావాల, కూర్పులకు
"దేశ భాషలందు తెలుగు లెస్స "
అన్న గౌరవం ॥

అచ్చులు హల్లులులతో కుాడిన
అందమైన భావాల  నుడికారపు భాష 
హ్రస్వాలు దీర్ఘాలు పొల్లులు  నిండిన
అరవై అక్షరాల అధికారిక భాష ॥

 కళలు నిండు వనంలో కావ్య కథనాల బాట 
భావం నిండిన సాహిత్యాల  పుాదోట  -
తీయని పలుకుల  మాధుర్యపు ముాట.
తేనెలో ముంచిన వెన్న పుాసల తేట ॥
 
మనసులో నున్న  భావాలకు  
వన్నెతెచ్చు వేల అర్ధాల వెలగు బాట.
సంస్కృతపు తళుకులతో  
నిండు మెరుపుల ముద్దు మాట.
 వ్యవహారిక వెన్నెలై కురిసిన 
 అమృతం మన తెలుగు భాష ॥
 
భరత భవితల సాధికారతకు 
సాకారమైన  విద్యా రుాపం , 
 కావ్య కవన కథనాలలో నిండిన 
 భరత చరితల త్యాగధనం ॥
 భావమై కురియు చినుకు చల్లదనం 
తెలుగు భాషలో నిండు 
మాధుర్యపు కమ్మదనం. 
తేనె వంటి  తెలుగులొ
 దాగి ఉన్న తీయదనం ॥

ఏదేశమేగినా వినిపంచే 
భరత చరితల ఘన నీరాజనం
ఆప్యాయత అనురాగాల లో 
నిండైన అమ్మతనం
పలకరింతలల పులకరింతలలో
నిండు ప్రేమ నిర్మలత్వం 
నాటికీ నేటికీ అందరుా మెచ్చిన 
తెలుగుభాషలో దాగిన దేశ గౌరవం ॥

**************************
21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

సాహితీ బృందావన జాతీయ వేదిక కు,
ఉమెన్ రైటర్స్ కు  పంపినది.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .

శీర్షిక  : తెలుగు వెలుగు.

జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన అక్షర మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండు వేదం  ॥

శృతి లయల సంగీత గీతులు
కవుల కలమేలు ఫల రసాల తోటలు
వేద పురాణాది గ్రంధపు  తేటలు
తెలుగు భాషా వనములో 
పండిన  పసిడి పచ్చని పంటలు॥

నదీమతల్లుల సంగమ క్షేత్రాలు
ముక్కోటి వేల్పుల జేగుడి గంటలు
వేల పోరాటాల వీర చరితలు
తెలుగు సిగ నలరించు 
సుమ సౌగంధపు కీర్తులు॥

సంస్కృతి , సాంప్రదాయాల సారం
సత్య ,శాంతి .సద్ధర్మాలకు నిలయం 
ఐకమత్యానికి ప్రతీకగా ఎగిరే కేతనం 
తెలుగు జాతి  నిండు దనానికి నిదర్శనం 
తేనె లొలుకు మన తెలుగు భాష ॥

**************************

01/ 03 / 2022 : 

నేను సైతం కవి పత్రిక సంచిక కొరకు.

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...

అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,

శీర్షిక :  పలుకు తేనెల తల్లి.
ప్రక్రియ : వచన కవిత.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కి
 అందరి నోట పలుకు యాస గోస
 మన అందమైన తెలుగు బాష ॥

నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
రచనా శైలికి అక్షర పునాది వేసి
అష్ట దిగ్గజాల సాహిత్య వనంలో 
ఛందోబద్ధ కావ్య ,పద్య, గద్య 
కందమై,వేమన పద్యాలలో వేల
 అందాలు సంతరించుకుంటుా
కవన వనంలోవీర విహారం చేస్తున్న 
పలుకు తేనెల ముాట మన తెలుగు భాష॥

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసి, 
 తెలుగింటి ఆడపడుచుగా 
అక్షర నీరాజనాలందుకుంటున్న 
ఆదర్శ సాంప్రదాయాల
 అద్భుత చరిత , అందమైన 
 యాస గల మన తెలుగు భాష ॥

హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .


************************

ఈ వేమన కవితా నిలయం కు పంపినది.
2102/2022.

శీర్షిక : దేశ భాషలందు మేటి భాష.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


నాటి సంస్కృత భాష నుండి పుట్టి
నేటి వ్యవహారిక భాషగా మారి
జన పదాల అందమై, కావ్య కన్నెల
 గంధమై అలరారుతున్న
భవిత చరితల వెలుగు బాట
 మన తెలుగు భాష ॥

మేటి సాహిత్యపు మేలు సారమై  
అష్ట దిగ్గజాల పద్య గద్యాల 
రచనల లో  అంద ఛందాల 
మేలు కందమై అక్షరాల తోటలో 
పరిమళ గంధమై వికసించిన
సుకుమార సుందర పారిజాత 
సుమ బాల మన తెలుగు బాల ॥

సప్త స్వరాల సంగీత నాదమై 
అరువది నాలుగు కళలకు నిలయమై
కోటిరతనాల వీణగా వన్నె కెక్కిన
అందమైన భాష మన తెలుగు భాష॥

వేమన పద్యాలలో అలవోకగా
 అందాలు సంతరించుకుంటుా..
మేటి  కవుల కవన వనంలో , 
పరిమళాల గంధమై విహరిస్తున్న కావ్య-
 కవితా సుందరి మన తెలుగు భాష॥
 
 మనవైన సాంప్రదాయాల అందమై
  సమానత్వ విలువలకు బంధమై
  కీర్తి పతాకపు రంగుల బాటలో
  వేల భాషల కలుగోలుపు వేటలో
  ఐకమత్యానికి నెలవైన అందమైన 
  రంగుల పుాలతోట మన తెలుగు ॥భాష ॥
  
*********************

పంచపది =  110 
21/02/2022.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి

నేటి అంశం : మాతృభాషాదినోత్సవం.


 గిడుగువారి గొడుగులో వ్యవహారిక భాషగా
మారిన తెలుగువారి ఆత్మ గౌరవం  ॥

జానపదాల వేల కీర్తులతో జన పదాల
 జల్లై కురిసిన, నిండు చైతన్య  ధనం ॥

సప్త స్వరాల నాదమై, వేల సంకీర్తనల గాంధర్వ గానమై
 "కోటిరతనాల వీణగా "వన్నె కెక్కిన అక్షర వనం .
 
 అష్టదిగ్గజాల  ఛందోబద్ధ కావ్య రచనలకందమై ,
 "దేశ భాషలందు తెలుగు లెస్స" అని
  రాయలవారిచే  అనిపించుకుని కీర్తికెక్కిన ఘనం .

భరత మాత కీర్తి కిరీటంలో కలికితురాయైన  సకలకళా
సంపదల వేద విద్యా ఖని "మన తెలుగు భాష ఈశ్వరీ॥


ఎచటకుా పంపనిది.👇👇

జానపదాల వేల కీర్తులతో 
 జన పదాల జల్లుగా కురిసిన, చైతన్యం
పల్లె అందాల పిల్లగాలి చైతన్యం
 మన తేట తెల్లని తెలుగు భాష.॥
 
నన్నయ తిక్కన ఎర్రాప్రగడల 
శైలికి అక్షర పునాదియై..
గిడుగువారి గొడుగులో 
గ్రాంధిక మనే మసుగు తీసి
 దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కిన
 అందరి భాష నేటి మన తెలుగు భాష ॥

మేటి సాహిత్యపు మేలు సారమై  
అష్ట దిగ్గజాల పద్య గద్యాల 
రచనల లో  అంద ఛందాల 
మేలు కందమై ఒదిగిన 
సుకుమార సుందర పారిజాత 
సుమ బాల మన తెలుగు బాల ॥
 
జలజల జారే  గిరుల ఝరుల లో
నదీమ తల్లులు పారే గలగలలో
ఎగిరే పక్షుల కువకువల వేదంలో
జే గుడి గంటల ప్రణవ నాదంలో
సవ్వడి చేసే అక్షర కన్యల పద
మంజీరాల గలగలలో
నిండిన పద మంజరీ నాదం 
మన తెలుగు భాష నిండుదనం  ॥

No comments:

Post a Comment