Friday, February 18, 2022

నిజమైన దేశభక్తి

28/01/2022.
సాహిత్య , సాంస్కృతిక , విద్యా ఛానల్
(ప్రగతి కోసం కలం : ప్రజల కొరకు గళం .)
అంశం : నిజమైన దేశభక్తి.

నిర్వాహణ : వలిపే సత్య నీలిమ.
శీర్షిక : కళ్ళుతెరచిన కలలు.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల : జగదీశ్వరీముార్తి .కల్యాణ్ : మహారాష్ట్ర


మారుతున్న పరిస్థితులకనుగుణంగా 
మారిపోతున్న మనం ..
మన "లో" నున్న మనిషికి సంకెళ్ళు వేశాం. 
కాలంతో పాటు ఉరుకులు పరుగులు తీస్తుా
అసలెందుకు బ్రతుకుతున్నామొా కుడా
తెలీని వేగంతో దుాసుకుపోతున్నాం.
పచ్చదనం పాడెకెక్కిన నేపధ్యంలో
కమ్ముకున్న విషవాయుప్రభావానికి
మనిషి జీవితం విషకణాల వికృత చేతుల్లో
పడి నలిగిపోతోంది.
స్వాతంత్ర్య పోరాటాలు కథలై పుటలు చేరేయి.
ఉద్యమకారుల చరితలు ఊరవతల
ఊపిరిలేని శిలలై నిలిచేయి.
మువ్వన్నెల ఝండా ముడతల మధ్య ,
వెలిసిన రంగుల చారలు ఐకమత్యాన్ని 
సవాలు చేస్తున్నాయి.
రాజులు మారేరు .రాజ్యాలు మారేయి.
కొత్త చట్టాలు వచ్చేయి . 
దొమ్మిలు దోపిడీలు పెరిగేయి.
మానభంగాల వ్యుాహాల్లో అబలలు
అభమన్యులై అంతమౌతున్నారు.
రౌడీయిజం రాజ్యమేలుతోంది. 
ఓటు హక్కు నోటు పెట్టుబడిగా మారింది.
 ప్రైవేటీకరణ పురివిప్పింది. 
 ఎంతోమంది స్వాతంత్రోద్యమకారులు 
 చిందించిన రక్తపుజోరుకు విడివడిన బానిస 
బ్రతుకు సంకెళ్ళు ,తాము ఎన్నుకున్న నాయకులపాలనలో తిరిగి హస్తాలకు
బానిస సంకెళ్ళు వేస్తున్నాయి. 
ఆ నిజమెరిగి ఆక్రోశిస్తున్న మనిషి "లో "మనిషి కళ్ళుతెరిచాడు.
వత్సరానికొక్కసారి ఎగిరే" మువ్వన్నె పతాకం "
ఎందరో దేశభక్తుల త్యాగ నిరతికి నిదర్శనంగా
రాజ వీధుల్లో రాజసంగా ఎగురుతోంది.
ఎన్నో అన్యాయాలకు బలౌతున్న మనిషు "ల్లో
చైతన్యం పుంజుకుంది. 
తను కుార్చున్న కొమ్మను తామే నరుక్కున్న చందంగా తమ "ఓటు హక్కును" తామే  దుర్వినియొాగ పరుస్తున్నందుకు తమను తామే నిందించుకున్నారు.
"వందేమాతరం",  జాతీయ గీత ప్రకంపనలకు 
రగులుతున్న "దేశభక్తి" ఉద్యమకారుల చరితల
బలిదానాలకు శలాం చేసింది.
ఏమైనా  సాధించగల "అస్త్రం" తమ చేతిలో "ఓటు" రుాపంలో తమ "హక్కైన" విషయ స్ఫురణకు 
వచ్చి ఏక నిశ్ఛయానికి వచ్చేరు జనం.
తాము తిరిగి బానిసత్వ సంకెళ్ళకు బందీ అవకుాడ దు.
తల్లి భారతి ఒడిని తంగేడు పుాల పరిమళం తోనింపుతారు.
 పచ్చని పైరు తల్లి చీరను తివాచీగా పరచి,
 మవ్వన్నెల ఝండాను ముద్దబంతిపుాలతో స్వాగతిస్తారు.
 విషకణాల విరుగుడుకై పచ్చని చెట్లను నాటి
  విశ్వ వనాలను విస్తృతం చేస్తారు.
  మన భారతీయ సంస్కృతి సాంప్రదాయ కన్నెలకు
  ఉగాది ఆహ్వానాలు పంపి ఊరంతా పల్లకిలో 
  ఊరేగిస్తారు. ఇప్పటికీ కళ్ళుతెరవకుండా 
  ఉంటే తమ వినాశనానికి తామే కారకులైనట్టు.
  మనలోనీ మార్పు  మనలో దాగిఉన్న 
  నిజమైన దేశభక్తికి నిదర్శనం .
  రండి ..మనమంతా ఒక్కటై మన జాతీయ ఝండాకు 
  వందన సమర్పణ చేద్ధాం. 
  స్వతంత్ర భారత పౌరులుగా మన దేశాన్ని 
  మనమే తీర్చి దిద్దుకుందాం.
  వందే.....మాతరం...వందే.....మాతరం.
  
  హామీ: 
  నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
  నా స్వీయ రచన.

No comments:

Post a Comment