రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .
అంశం:దత్తపది
కనుమ,వినుమ,మనుమ,చనుమ
ప్రక్రియ : సీస పద్యము
(కనుమ)పం డగనాడు కష్టించు రైతుతో
మిత్ర భావము తోడ ( మనుమ) నీవు॥
కడు ప్రేమ మీరంగ కలిసి పండగ జేయ
(చనుమ) వారికడకు జక్క గాను॥
పట్టుపు ట్టములిచ్చి పలకరింపుల తోడ
(వినుమ)వా రిదిమాట వివర ముగను ॥
తగుపంట ఫలముకు తగుసాయ మునుజేయు
అతడన్న దాతగా అవని వేల్పు ॥
(సీస పద్యము మొదటి ప్రయత్నము.)
ప్రక్రియ:పద్యం : ఆటవెలది.
(కనుమ ) మంచి నెపుడు కనులార భువిలోన
(చనుమ )గురుల కడకు చదువు లొప్ప
(మనుమ) మహిని మంచి మాటతో జనులతో.
(వినుమ) శుభము లిచ్చు విలువ పెరుగు ॥
No comments:
Post a Comment