రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర.
అంశం:శార్దూలవిక్రీడితము
శీర్షిక : సరస్వతీ స్తోత్రం .
శ్రీవిద్యా వరదాయకీ గుణవతీ
శ్రీ శారదాంబాం భజే ॥
శ్రీవిశ్వేశ్వరి బ్రహ్మ రాణి జయతే
శ్రీవిద్య సంధాయినీ ॥
యా వీణా ధరి గీత వాదనకరీ
యా వాద్య సత్పోషిణీ ॥
దేవీశ్రీ పరదేవతే శరణు, వా-
గ్దేవీ నమొా శారదే ॥
******************
శ్రీవేదా స్థిత నంద గోప కులజా
ధ్యాయే సదా వందితా॥
నిర్వేదా శిఖిపించ శోభిత ముఖా
సర్వేశ దైత్యాంతకా॥
దేవేంద్రార్చిత పాద పంకజ హరే ( వరా)
శ్రీవేణు గానాద్భుతా ॥
భావే సర్వ జనేప్సితాది వరదా
సర్వేశ ధ్యాయేత్సదా॥
No comments:
Post a Comment