Friday, February 25, 2022

రగులుతున్న చైతన్యం

25 /02/2022.
శీర్షిక : రగులుతున్న చైతన్యం.

రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


నీలాకాశంలో పొగబారిన మేఘాలు.
పర్యావరణపు వేడి సెగలకు 
వింత రోగాలతో విచ్ఛిన్నమౌతుా 
తమలో దాచుకున్న తేమ చుక్కలను
కాపాడుకునేందుకు అకాశమంతా
పరుగులు పెడుతున్నాయి. ॥
చినుకు తడికి నోచుకోని నేల తల్లి
పచ్చని పైరు చీర , చివికిపోయి చీదర 
కంపుకొడుతుా నిస్సారమైన బ్రతుకుతో
బీటలు బారిన బీడయ్యింది.॥
మానవత్వం చచ్చిన మనుషులు
అహం నిండిన స్వార్ధంతో 
చేసిన దాడులకు విరిగిన గ్రహ 
చరియల వింత ఆకారాలు 
విచిత్ర రోదనలు చేస్తుా 
వెక్కిళ్ళు పెడుతున్నాయి-॥
వీధిన పడిన వింత ఆకారాలు
గ్రహాల మీదకు వచ్చిన 
మానవ భుాతాలను పారద్రోలేందుకు
చేస్తున్న మారణ హోమాలకు  
భుామిపైకి  దుాసుకువెళుతున్న  
విష-వాయువుల  ఆక్రమణల
దాడికి జనులు వింత రోగాలతో
వీధిలోకి రావడం మానుకున్నారు.॥
పనీ పాటా లేని  పనికిమాలిన జనం 
తోచక చేస్తున్న చెత్తపనులకి 
పుట్టుకొస్తున్న భరత భవిత 
ఆటపాటలు లేని అసహనానికి 
రగిలిపోతుా అ= అంటే అధికారం ,
ఆ = అంటే ఆక్రమణలు.. అంటుా 
చేస్తున్న అక్షరాభ్యాసానికి ఆకాసం
తన పై నున్న మిన్ను విరిగి 
మీద పడ్డట్టు కెవ్వున కేక వేసింది.॥



  

 
 
 
 







 

No comments:

Post a Comment