Thursday, February 17, 2022

మహిళా శక్తి

నమస్కారం . నాపేరు..
శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్: మహారాష్ట్ర .


ఫిబ్రవరి 13 న జాతీయ" మహిళా దినోత్సవం"
మరియు  మార్చ్ 8 వ తారీకున 
"అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా...* 

' సాహితీ బృందావన జాతీయ వేదిక '
 " మగువ మహారాణి " అనే అంశంపై యూట్యూబ్ ఛానల్ లో  అంతర్జాతీయ స్థాయిలో..
మహిళలకు పోటీలు నిర్వహిస్తున్న సందర్భంగా -
నేను రాసిన కవిత.


ఆంక్షల సంకెళ్ళు తెంచుకొని 
అన్ని రంగాల లోనుా 
మగవాడితో సమానంగా 
ఎదుగుతున్న మహిళలు  
మహిళా శక్తికి నిదర్శనాలు.
హిమాలయాల శిఖరాగ్రాలు చేరి
అంబర యాత్రలతో అలరిస్తున్న స్త్రీ లు.
ఇంటా బయటా సమాన శక్తితో
పనిచేస్తున్న  వెలుగు దీపాలు.
బాధ్యతల బాటలో  
తొలగిస్తున్నారు ముళ్ళు.
బంధాల తోటలో వికసిస్తున్న
 అనుబంధపు పరిమళాల పుాలు.
 ఏలోటుా రానీయని ఆదర్శ గృహిణులు
 ఎందులోనుా తీసిపోని వీర నారీమణులు.
ఎన్నో రంగాల లో ఎందరో ప్రసిద్ధులైన
నారీమణులు మన భరత  మాత
మకుటంలో మెరిసే కలికితురాయిలు.
తరాలు కదిలిస్తే చాలు 
తరుణీ మణుల ఉద్యమ, వీర 
స్వాతంత్ర్య , విద్యా , వినయ సంపన్నులైన
వారి గాధలు చరిత్ర పుటల్లో చదువరులకు
చక్కని స్ఫుార్తినిస్తున్నాయి.

నాటి నుండి  నేటి వరకు 
జరుగుతున్న ఎన్నో 
పోరాటాలకు  సాక్షిగా  ఎన్నో
మహిళా ఆరక్షణా కేంద్రాలు.
న్యాయ పరమైన చట్టాలు ,
మహిళా సంక్షేమ పథకాలుా 
నెలకొన్న ఘనత మహిళల
విజయానికి నిదర్శనాలు.
ఎన్నో అర్హతలతో బాటు 
మరెన్నో రంగాల లో 
ముందడుగేస్తుా దుాసుకుపోతున్న 
మహిళామణులకు స్ఫుార్తి నిస్తుా 
ప్రతి సంవత్సరముా జరుగుతున్న 
"మహిళాదినోత్సవం "మహిళా
శక్తి ప్రేరణకు దోహదమై
ఆత్మ విశ్వాసానికి నెలవై  
ముందడుగు వేయిస్తున్నదనుటలో 
సందేహములేదు.
జై మహిళా శక్తి : జై మహిళా స్ఫుార్తి.



No comments:

Post a Comment