Friday, February 18, 2022

పేరడీ పాటలు..

ప్రక్రియ : బాలల గేయం.
అందాల ఓచిలకా... సినిమా పాట పేరడీ..
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర ..

పల్లవి:
అందాల ఓ పాపా...
వినరావె నా మాటా.

అనుపల్లవి:
నే కధలెన్నొ చెపుతానుా..నీ
మది మంచె తలచేనుా..

చరణం. 1.
పెద్దల మాటవు వినవేలా
పిలచిన పలుకవు కులుకేలా..
ముద్దుపాపవని దరికిరమ్మని
పిలచిన విసుకది ఎందుకనీ
అక్లరెందుకే చదవమందుకే
బ్రతుకు భారమని
తలచుటెందుకే ॥ అందాల॥

చరణం 2.
ఆన్ లైన్ చదువులు చదవాలీ
మొాబైలు ఆటలె విడవాలీ
పనికిరానివీ చుాచుటెందుకే
వయసు మించినా మాటలెందుకే...
పెరుగు వయసులో మంచినేర్చితే..
అడుగు అడుగునా పుాలబాటలే ...॥ అందాల ॥

చరణం:3.
కలసిరానిదీ కాలమిదీ
కాలరాసినా బ్రతుకులివీ..
అడుగు తడబడే బ్రతుకు ఆటలో
తోడురారు నీకెవరు బాటలో
ఎదురుదెబ్బలకు ఓడిపోనిదీ
మేధ నిండిన మనిషి జన్మిది..॥అందాల ॥

చరణం 4.
అమ్మా నాన్నలె దైవాలుా
పెద్దలె జ్ఞాన దీపాలుా
వారి మాటలో వెలుగు బాట జని
మాట తీపితో  పొందు కీర్తినీ..
ధనము మించినది మంచి తలపులే
మంచి నడతలే మహిని గెలుపులే..॥అందాల ॥



మహిళా దినోత్సవ సందర్భంగా...
వినుడు వినుడు రామాయణ గాధా...పాటకు పేరడీ..
రచన : శ్రీమతి : జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

శీర్షిక : మహిళలు మహారాణులు.

పల్లవి:

వినుడు వినుడు మన 
భారత నారీ జీవిత చరితలనుా
స్ఫుార్తి నిచ్చెడీ వీర వనితలా
త్యాగనిరతి  ఫలముా॥

అనుపల్లవి:
ఆలకించుచుా  ఆదరించు మన 
ఆదర్శ మహిళామణి  బాటల ॥వినుడు వినుడు॥

1.చరణం :
ఎందరెందరో వీర  వనితలా 
త్యాగ చరిత  గల భారతిదీ
 అసువులు బాసిన వీర నారులా 
నాటి ఫలితముల నేడు ఇదీ.
ఉద్యమ బాటను నడచి పోరినా
గెలుపుల దేశమిదీ
స్వాతంత్య్రమునే కోరి పోరు 
స్త్రీ శక్తికి సాక్షి ఇదీ
ఆంగ్ల పాలకుల కెదురు పోరాడు
వనితల చరితలివీ 
చెరగని గాధలివీ ॥

2. చరణం.
ఉద్యమ బాటను నడచి పోరినా
గెలుపుకు సాక్షులు మన స్త్రీ లు 
 స్వాతంత్య్రపు పోరాట బాట నడు
 వీర నారులకు  జేజేలుా   
 బానిసత్వ సంకెళ్ళు తెంపగా 
 పోరిరి వేవేలుా
ఆంగ్ల పాలకుల కెదురు పోరాడు
 శక్తుల కిడు జేలుా..
 పోరు బాటలో అసువులు బాసిన 
 స్త్రీ లకు జోహారుా
 వారికి  కైమొాడ్పుా.॥
 
 3. చరణం :
 బాల్య వివాహము సతిసహగమనము
 లాపిన  వారికి యైతోడు
 స్త్రీ ల కొరకు సంక్షేమ పథకములు
 సంస్థల నిడ పోరాడేరు .
 వేద, విజ్ఞాన ,శాస్త్ర విద్యలు  
 నేర్చిరి హక్కులుగా
 సాంకేతిక  రాజ్యాంగ చట్టముల
 బాటల నేలిరిగా
 వీర వనితల చరిత కీర్తులకు
ధీటుగ నిలచిరిగా॥
వనితల గెలుపిదెగా ॥
 ..
****************************

కవితా  ప్రక్రియ  కర్తలకు ధన్యవాదాలతో...  
బలేబలే అందాలుా సృష్టించావుా...
పాటకు పేరడీ..
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .

భలే భలే అందాలు కురిపించాయిా
మదిని మురిపించాయిా
మనసు కానందం, పొంగె పద గంధం 
కవిత కన్నెల్లు ప్రతీదినం ॥

రాసిన వన్నీ రసమయ సుధలై
పుాసిన పుాలవోలే  వికసించేయిా..
మితమైన వరుసల ఆగమ సారమై
అందరి మనసుకుా హత్తుకున్నాయిా

 మకుటమ్ములు మంచిగా , మన్నిక నీయగా॥
 పదములె పరిమళాల జల్లులై
కవన వీధి విహరించాయిా ॥

విందులుగానిడు అంశము లెన్నో
జ్ఞానపు నిధులై   మది నిలిచాయిా
అభినందనలా బహుమతులెన్నో
విజయపు చిహ్నాలై ఊరించాయిా
సాహిత్యపు బడిలో సాధించిన బిరుదులే
మా మది కానందపు నిధులేై
కలలెన్నో పండించాయిా..॥

******************


18/02/2022.
మహిళా దినోత్సవ సందర్భంగా రాసిన పాట

పగలే వెన్నెలా ....జగమే ఊయలా...
పాటకు  పేరడీ
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .


మహిళా మణులు ఈ, జగతికి రాణులుా 
మహిళ ఇలను సబలె గాని అబల కాదుా...॥

పుట్టినింట ఆనందము పంచు రాణిగా
మెట్టినింటను జ్యోతియై వెలుగు లక్ష్మి గా
కష్టసుఖములందు ఆమె తోడు నీడగా
నెరవేర్చును బాధ్యతలను అర్ధ భాగిగా
పెనిమిటి పిల్లల.. పాలిటి వరముగా
మగువే  గృహసీమను  ఏలు రాణిగా..॥

వేద వైద్య విజ్ఞానము లేలు బాటలో
విద్యలందు ఆరితేరె విజయ పథములో
నవరసమ్ము లేలు కళా రంగాలలో 
నడుముగట్టి నడచె స్త్రీ లు ప్రగతి బాటలో
పురుషుల నీడగా బాధ్యత తోడుగా
మహిళలె.. మహిని నిలచి జయము లేలెగా॥

తెల్లదొరల నొడ్డి పోరు నాటి జోరులో
స్వాతంత్ర్యము కోరి, శాంతి ,గాంధి బాటలో
బానిస సంకెళ్ళు తృుంచ ఉద్యమాలలో 
శక్తి రుాపులై నిలచిరి  స్త్రీ లు వేలలో
సాహస మేలినా మహిళలు ఎందరో
స్త్రీ శక్తికి రుాపాలై నిలిచె గెలుపులో  ॥

కత్తి పట్టెవీర నారి ఝాన్సి లక్ష్మి గా
దేశ మేలె ఇందిరమ్మ  ఎన్నో ఏళ్ళుగా
మహిళ సాధికారతకై ఉద్యమించెగా
 ఆకసాన సగ భాగిగ కీర్తు లేలెగా
మన చరితల పుటలలో
మకుటాయమానులై
మగువలె మహరాణిగ 
ఖ్యాతి గాంచెగా॥




No comments:

Post a Comment