Saturday, March 12, 2022

చందమామ కధలు

ప్రస్తుతం 35+ వయసున్న వారిలో చందమామ కథల పుస్తకం గురించి తెలియని వారు ఉండరు అంటే ఆశ్చర్యం లేదు.  దురదృష్టవశాత్తూ ప్రస్తుతం చందమామ ప్రచురితం కావడం లేదు. పాత పుస్తకాలు ఉన్నా బావుణ్ణు, మన పిల్లలచే చదివించవచ్చు అని చాలా మంది అనుకుంటుండవచ్చు. అటువంటి వారి కొరకే ఎవరో మహానుభావుడు 1947 జనవరి నుండి 2012 డిసెంబర్ వరకూ విడుదల అయిన అన్ని పుస్తకాలనూ PDF రూపంలో తన వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు. వీటిని ఎవ్వరమైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

వీటిని మనం పిల్లలచే చదివించవచ్చు, లేదా మనమే చదివి వినిపించవచ్చు. దీనివలన పిల్లలకు తెలుగు చదవడం వస్తుంది, అలానే భాషపై పట్టు కూడా పెరుగుతుంది. మనం చంపేసిన ఎన్నో తెలుగు పదాలు ఈ కథలలో ఉంటాయి. కథల రూపంలో నేర్పడం కనుక, ఇది కొంత తెలికగానే ఉంటుంది. 

అవకాశం ఉన్నవారు, మీ పిల్లలు చదువుకునే బడిలో తెలుగు బోధించే వారికి కూడా వీటిని పంపండి. 

లింక్: http://granthanidhi.blogspot.com/2020/04/candamama.html?m=1

Wednesday, March 9, 2022

ధన్యోస్మి .

పాండురంగ విఠల పంచపది..

శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

పంచపది  ప్రక్రియ రుాపకర్తలు.
కవన సాహిత్య రంగానికి మాననీయ మహారాజులు.
కవులు కళాకరులను ప్రోత్సహించే గుణమున్న 
ఆదరణీయ అధ్యాపకులు ॥
సాటి లేని రచనల మేటి కవులైననుా నిరాడంబరులు॥
వారి ఆశీర్వాదామృత జల్లుల తో జగదీశ్వరీ 
జన్మము  ధన్యమైనది  విఠలా ॥

కొటేషన్లు

*తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన
 పదపల్లవాలలో ఇవి కొన్ని. 
 వీటిని ఎవరు రాశారో  చూద్దాం...*

1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 
     నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 
*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*

2. ‘‘కప్పివుంచితే కవిత్వం,
     విప్పి చెబితే విమర్శ’’
*డా.సి.నారాయణరెడ్డి*

3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ,
     ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 
*కాళోజి*

4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 
*నన్నయ*

5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 
*సుబ్బారావు పాణిగ్రాహి*

6. ‘‘రాజే కింకరుడగు 
     కింకరుడే రాజగు’’ 
*బలిజేపల్లి లక్ష్మీకాంతం*

7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 
     వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 
*బసవరాజు అప్పారావు*

8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని 
     తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 
*గుర్రం జాషువా*

9. ‘‘అత్తవారిచ్చిన అంటు మామిడి తోట, 
      నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 
*కాళ్ళకూరి నారాయణరావు*

10. ‘‘గాయపడిన కవి గుండెల్లో 
        వ్రాయబడని కావ్యాలెన్నో’’ 
*దాశరధి*

11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 
*నార్ల వెంకటేశ్వర రావు*

12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 
*తిరుపతి వెంకట కవులు*

13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 
*గురజాడ*

14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 
*గరిమెళ్ళ సత్యనారాయణ*

15. ‘‘పరమేశా గంగ విడుము, పార్వతి చాలున్‌’’ 
*శ్రీనాథుడు*

16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు...   
        ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 
*పోతన*

17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా...
      తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 
*గద్దర్*

18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 
*శ్రీ శ్రీ*

19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను,
       మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 
 *వెన్నలకంటి*

20. ‘‘రావోయి బంగారి మావా 
       నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 
*కొనకళ్ల వెంకటరత్నం*

21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన 
       చుల్కన కాదె యేరికిన్‌’’
*అల్లసాని పెద్దన*
 
22. ‘‘ఏ గతి రచియించిరేని,
        సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 
*చేమకూరి వేంకటకవి*

23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 
*త్యాగయ్య*

24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 
*ధూర్జటి*

25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన 
        అప్పుడు బంధువులు వత్తురు’’ 
*బద్దెన*

26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు,
        దానహీను జూచి ధనము నవ్వు’’ 
*వేమన*

27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 
*కంచర్ల గోపన్న*

28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 
*సుద్దాల హనుమంతు*

29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు 
       ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 
*ఆరుద్ర*

30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా 
       సవతిబిడ్డల పోరు మనకేలా’’ 
*వేముల శ్రీ కృష్ణ*

31. ‘‘వీరగంధము తెచ్చినారము, 
        వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 
*త్రిపురనేని రామస్వామి*

32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 
*బాలాంత్రపు రజనీ కాంతరావు*

33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ 
       తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 
*అడవి బాపిరాజు*

34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’
*కరుణశ్రీ*
 
35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా 
        పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా 
        నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 
*గుడ అంజయ్య*

36. ‘‘తను శవమై - ఒకరికి వశమై 
        తనువు పుండై - ఒకరికి పండై 
        ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 
*అలిసెట్టి ప్రభాకర్*

37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే 
        మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 
*సావిత్రి*

38. ‘‘నేను పుట్టకముందే....
        దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 
*ఖాదర్ మొహియుద్దీన్*

39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను,
        నీ ఆదేశాన్ని మన్నించలేను"
*బాలగంగాధర తిలక్*

40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన 
        నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 
*అన్నమయ్య*

41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు   
        విఘ్నాయాససంత్రస్తులై’’ 
*ఏనుగు లక్ష్మణ కవి*

42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 
*పాలగుమ్మి విశ్వనాథం*

43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ,
        ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 
*చలం*

44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి 
       మా అమ్మే రాణి అయినా, 
       గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’
*విమల*
 
45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది 
        కూకుండనీదురా కూసింతసేపు’’ 
*నండూరి సుబ్బారావు*

46. ‘‘మాయమైపోతున్నడమ్మా మ


To see more posts like this and join KAVIYATRA , click here 👇👇

https://kutumbapp.page.link/qjFG6zYDNtbcF6Ta6

Monday, March 7, 2022

నడిచే నక్షత్రాలు.

7/03/2022.
శీర్షిక : నడిచే నక్షత్రాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .

మనసులోతుల్లో దాగి ఉన్న ఆకాంక్షలు
తీరని కోర్కెలకు చెక్ పెడుతున్న ఆంక్షలు
ఎదగాలన్న  భావాలకు ఎగురుతున్న కోర్కెలు
కళ్ళాలు వేస్తుా కదలనివ్వని సంకెళ్ళు.॥
ఉద్యమాల బాటలో ఎక్కుపెట్టిన తుాణీరాలు
స్వాతంత్ర్య  సమరంలో గెలుపు నినాదాలు
బాల్య వివాహాలుా' బాల వితంతుల వంటి
అమానుష ఆచారాల వివాదాలు
స్వాతంత్ర్యోద్యమబాటలో 
సమసిపోయిన సమస్యలు ॥
అన్ని రంగాల లో అడుగు పెట్టిన అతివలు
పురుషునితో సమానంగా వేస్తున్న అడుగులు॥
ఆకాశంలో సగభాగమంటుా  ఆదరణలు 
హారతి పడుతుా ఆదరిస్తున్న నేటి ఆచారాలు ॥
ఇంటా బయటా బాధ్యతలలో  నిష్ణాతులు 
కట్టుా బట్టా మారినా వీడని  సంస్కారాలు॥
నాటికీ నేటికీ తమ శక్తిని నిరుాపించుకుంటుా
ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న మహోగ్ర  శిఖరాలు॥
ఎందరికో స్ఫుార్తి నిస్తున్న వీర నారీ మణులు॥
మహిళా దినోత్సవ వేడుకల్లో విజయ కేతనమై
ఎగురుతున్న   దేశ భారతి కీర్తి కిరీటాలు.
ప్రగతి పథానికి పుాల బాటలేస్తున్న 
నడిచే నక్షత్రాలు..నేటి మహిళామణులు॥

******************************

తమ ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న 
మహిళామణులందరికీ  సాదర అభినందనలతో
ఈ నా కవిత అంకితం.

Saturday, March 5, 2022

శీర్షిక : మగువ మనసు

అంశం : మగువ మనసు .
శీర్షిక : సహనానికి ప్రతిరుాపం .
(వచన కవిత ).

రచన : శ్రీమతి.,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------


చేయు కర్య మేదైనా 
కష్టించే గుణమామెది॥
కష్ట ఫలిత మాశించని 
వెన్న లాంటి మనసామెది ॥
గులాబీల మెత్తదనం 
మల్లెౕవంటి పరిమళం ॥
మగువ మనసు మమత నిండు
ముద్దు ముద్ద మందారం ॥
గులాబీల మృదువు నిండు 
ప్రేమ భావ మునకు మేటి
మల్లెలంటి గుభాళింపు 
వలపు వీచికలకు గీతి ॥
ముద్ద మందారపు సిగ్గు-
సంస్కారాలలో మేటి ॥
ప్రేమిస్తే పంచుతుంది  
నిన్ను మించినట్టి ప్రీతి.॥
ఆగ్రహిస్తే అవుతుంది 
 అమె ఆదిపరాశక్తి ॥
పచ్చ గడ్డి మండునట్టి 
పంతముతో నిడు జట్టీ ॥
అమ్మగా బిడ్డలపై 
ఎనలేని మమకారం .॥
కోపమొచ్చే పని చేస్తే 
ఎత్తును దుర్గావతారం॥
అనురాగం చుాపిస్తే 
ఔతుంది పుాలవనం ॥
అవమానం చేసిన 
ఆరని మంటల హోమం ॥
అత్తింటి కోడలిగా 
బాధ్యత బరువుల భారం
పుట్టినింటి ఆదరణకు 
అడుగడుగున ఆరాటం ॥
అత్తింటి పరివారం 
ఆమె సొంతమను భావం
ఆడపడుచులకు తానే 
అమ్మ ననే అభిమానం ॥
భర్త నుండి కోరునామె
నిజమైన అనురాగం ॥
అతనిష్టమె  తనదిగా 
మసలుకొనెడు బంధం ॥
సంసారపు సాగరాన 
కష్ట నష్టముల నావను 
చుక్కానై  ఒడ్డు చేర్చు
తెలివి నిండు చేత ఘనం ॥
సంద్రమంత లోతైనా
ఆమె మనసు సిరి ముత్యం.
అలజడి అలలెన్నున్నా 
అణచివేయునట్టి  గుణం ॥
కోపతాపముల దాచెడు 
శాంతమనెడు  స్వాభావం  ॥
అలసటలవి యెన్నున్నా  
చమట ధారల్లో మాయం ॥
సుడిగుండాలెన్నున్నా 
దాచు లోతు మనసులో ॥
 నిండు గుణపు నిధులన్ని 
 దాచి ఉంచు హృదిలో ॥
 మన్నికైన  ప్రేమ జుాప 
 నామె యౌను దాసోహం 
 మొాసమనీ తెలియగానె 
 మొగుడినైన వదలని తనం ॥
 అబల అబల అన్న మాట 
 సహించదు మాట  గాను - 
అబలకాను సబల నంటు
అన్ని రంగముల తాను ॥
కుటుంబ  శ్రేయసే కోరెడు
కుల సతిగా మసలునామె ॥.
 ఆత్మగౌరవము నిండిన 
 అత్మాభిమాని ఆమె ॥
చేయు కర్య మేదైనా 
కష్టించే గుణమామెది॥
కష్ట ఫలిత మాశించని 
వెన్న లాంటి మనసామెది ॥
 మనసులోని భావాలను 
 తెలుపనీని శాంత గుణం .
తనకోసం బ్రతుకదామె 
ఇదే స్త్రీ ల మనసు తత్త్వం ॥.

Thursday, March 3, 2022

108 రాగాల ఆరోహణ అవరోహణలు

సంకీర్తన యజ్ఞం సభ్యులందరికీ నమస్కారములు. 
మనం మే 5వ తేదీ2020 న ప్రారంభించిన రాగ యజ్ఞం 112 రోజులు సాగి 108 రాగాలను చర్చించుకోవడం జరిగింది. వీటిలో నుండి మనం చాలా వరకు గ్రహించ గలిగాము. అన్ని ఆరోహణ, అవరోహణలు ఒక దగ్గరకు తెచ్చి అందిస్తే అది ఉపయోగపడుతుందని భావించి గత రెండు రోజులుగా ఈ పట్టిక తయారు చేశాను. అందరూ దీనిని కాపీ చేసుకొని ఉపయోగించుకుని సాధన చేస్తారని ఆశిస్తూ... 
మీ రమేష్ బాబు శీపాన


సూచన:
సంఖ్య= మేళకర్తా రాగ సంఖ్య
మే=మేళకర్తా రాగము
జ =జన్య రాగము. 


1 . రేవతి (2 జ) 
ఆ:స రి1 మ1 ప ని2 స
అ:స ని2 ప మ1 రి1 స


2. హంసధ్వని (29 జ) 
ఆ:స రి2 గ3 ప ని3 స
అ:స ని3 ప గ3 రి2 స


3. కళ్యాణి (65 మే) 
ఆ:స రి2 గ3 మ2 ప ద2 ని3 స
అ:స ని3 ద2 ప మ2 గ3 రి2 స


4. మోహనము (28 జ) 
ఆ:స రి2 గ3  ప ద2 స
అ:స  ద2 ప  గ3 రి2 స


5. అభేరి (భీంప్లాస్) (22 జ) 
ఆ:స గ2 మ ప  ని2 స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స


6. తోడి/సింధుభైరవి (8 మే / జ) 
ఆ:స రి1 గ2 మ1 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప మ1 గ2 రి1 స


7. హిందోళం (20 జ) 
ఆ:స గ2 మ1 ద1 ని2 స
అ:స ని2 ద1  మ1 గ2 స


8. మధ్యమావతి (22 జ) 
ఆ:స రి2 మ1 ప ని2 స
అ:స ని2 ప    మ1 రి2 స


9. శుధ్ధసావేరి (29 జ) 
ఆ:స రి2 మ1 ప ద2 స
అ:స ద2 ప    మ1 రి2 స


10. ఉదయరవిచంద్రిక (22 జ) 
       /(శుధ్ధ ధన్యాసి)
ఆ:స గ2 మ1 ప ని2 స
అ:స ని2 ప  మ1 గ2 స


11. శ్యామా(సామా) (28 జ) 
ఆ:స రి2 మ1 ప ద2 స
అ:స ద2 ప    మ1 గ3 రి2 స


12. చక్రవాకము (16 మే) 
ఆ:స రి1 గ3 మ1 ప ద2 ని2 స
అ:స ని2 ద2 ప   మ1 గ3 రి1 స


13. ఆనంద భైరవి (20 జ) 
ఆ:స గ2 రి2 గ2 మ1 ప ద2 ప  స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స


(అన్య స్వరం ద2. కాని  మూర్చన లో కూడా అన్య స్వరమే ఉంటుంది. సంగీత ఫ్రేజ్ లలో మాత్రమే ద1 వుంటుంది.) 


14. షణ్ముఖ ప్రియ (56 మే) 
ఆ:స రి2 గ2 మ2 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప మ2 గ2 రి2 స


15. శివరంజని (22 జ) 
ఆ:స రి2 గ2 ప ద2 స
అ:స ద2 ప గ2 రి2 స


16. కానడ (22 జ) 
ఆ:గ2 రి2 స రి2 గ2 మ1 ప మ1 దా2 ని2 స
అ:స ని2 ప ద2 ప మ2 గా2 మ1 రి2 స


17. శ్రీ రాగము (22 జ) 
ఆ:స రి2 మ1 ప ని2 స
అ:స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స


18. శంకరాభరణము (29 మే) 
ఆ:స రి2 గ3 మ1 ప ద2 ని3 స
అ:స ని3 ద2 ప మ1 గ3 రి2 స


19. మాయామాళవ గౌళ (15 మే) 
 ఆ:స రి1 గ3 మ1 ప ద1 ని3 స
అ:స ని3 ద1 ప మ1 గ3 రి1 స


20. హంసానంది (53 జ) 
ఆ:స రి1 గ3 మ2 ద2 ని3 స
అ:స ని3 ద2 మ2 గ3 రి1 స


21.చంద్ర కౌస్ (9  జ & 21 జ) 
ఆ:స గ2 మ1 ద1 ని3 స
అ:స ని3 ద1 మ1 గ2 స


22.కాపి (22 జ) 
ఆ:స రి2 గా2 మ1 రి2 ప మ1 ప ద2 ని2 స
అ:స ని2 ద2 ప మ1 గ2 రి2 స 
( ని3 & ద1 అన్య స్వరములు ) 


23.బిలహరి  (29 జ) 
ఆ: స రి2 గ3 ప ద2  స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


24.బౌళి (15 జ) 
ఆ: స రి1 గ3  ప ద1  స
అ: స ని3 ద1 ప  గ3 రి1 స


25.ఖమాస్  (28 జ) 
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
(కాకలి నిషాదం ని3. అన్య స్వరం) 


26.కీరవాణి (21 మే) 
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ1 గ2 రి2 స


27.వలజి (16 జ) 
ఆ: స  గ3  ప  ద2  ని2  స
అ: స ని2 ద2 ప  గ3 స


28.ధర్మవతి  (59 మే) 
ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స


29.అమృత వర్షిణి (66 జ) 
ఆ: స గ3 మ2 ప ని3 స
అ: స ని3 ప మ2 గ3 స 


30.భాగేశ్వరి(భాగేశ్రీ) (22 జ) 
ఆ: స గ2 మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స 


31.సరస్వతి (64 జ) 
ఆ: స రి2 మ2 ప ద2 స
అ: స ని2 ద2 ప మ2 రి2 స


32.ఖరహరప్రియ(22 మే) 
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స


33.తిల్లాంగ్ (28 జ) 
ఆ: స గ3 మ1 ప ని3 స
అ: స ని2 ప మ1 గ3  స
(కాకలి నిషాదం ని3 అన్య స్వరము) 


34.శుభ పంతు వరాళి(45 మే) 
ఆ: స రి1 గ2 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ2 రి1 స


35.యమునా కళ్యాణి (65 జ) 
ఆ: స రి2 గ3 ప మ2 గ3 ప ద2 ని3 ద2 స
అ: స ని3 ద2 ప మ2 గ3 మ1 రి2 స
(శుద్ధ మధ్యమము మ1 అన్య స్వరము) 


36.వసంత (17 జ) 
ఆ: స మ1 గ3 మ1  ద2 ని3 స
అ: స ని3 ద2  మ1 గ3 రి1 స


37.మలయమారుతము (16 జ) 
ఆ: స రి1 గ3 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప గ3 రి1 స


38.నాట (36 జ) 
ఆ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స
అ: స ని3  ప మ1 రి3 స


39.హరికాంభోజి (28 మే) 
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స


40.శహన (28 జ) 
ఆ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 స


41.మాండ్ (29 జ) 
ఆ: స గ3 మ1 ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


42.గౌరీ మనోహరి (23 మే) 
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ2 రి2 స


43.నీలాంబరి (29 జ) 
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స
అ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స


44.భైరవి (20 జ) 
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స


45.ద్విజావంతి(జైజవంతి) (28 జ) 
ఆ: స రి2 మ1 గ3 మ1 ప ద2  స
అ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 
గ3 రి2 స ని2 ద2 స


46.దేశ్ (28 జ) 
ఆ: స రి2  మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
(కాకలి నిషాదము ని3 అన్యస్వరము) 


47.బృందావన సారంగ (22 జ) 
ఆ: స రి2 మ1 ప ని3 స
అ: స ని2 ప మ1 రి2 గ2 రి2 స
(ని3 అన్య స్వరము) 


48.అఠాణా  (29 జ) 
ఆ: స రి2  మ1 ప  ని3 స
అ: స ని3 ద2 ప మ1 ప గ3 రి2 స


49.సింహేంద్ర మధ్యమము (57 మే) 
ఆ: స రి2 గ2 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ2 రి2 స


50.చారుకేశి (26 మే) 
ఆ: స రి2 గ3 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ3 రి2 స


51.బేహాగ్ (29 జ) 
ఆ: స గ3 మ1 ప ని3 ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


52.కాంభోజి (28 జ) 
ఆ: స రి2 గ3 మ1 ప ద2  స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
ని2 ద2 ప ద2 స


53.రీతిగౌళ (22 జ) 
ఆ: స గ2 రి2 గ2 మ1 ని2 ద2 మ1 ని2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ2 మ1 ప మ1 గ2 రి2 స


54.కేదార గౌళ ( 28 జ) 
ఆ: స రి2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స


55.యదుకుల కాంభోజి (28 జ) 
ఆ: స రి2  మ1 ప ద2  స
అ: స ని2 ద2 ప మ1గ3 రి2 స


56.ఝంఝూటి/సెంచురుట్టి(28 జ) 
ఆ: ద2 స రి2 గ3 మ1 ప ద2 ని2
అ: ని2 ద2 ప మ1 గ3 రి2 స ని2
ద2 ప ద2 స


57.పహాడి (29 జ) 
ఆ: స రి2 గ3 ప ద2 ప ద2 స
అ: ని3 ద2 ప గ3 మ1 గ3 రి2 స నీ3
ద2 ప ద2 సా


58.పీలు(22 జ) 
ఆ: ని2 స గ2 మ1 ప ని2 ద2 ప స
అ: స ని2 ద2 ప ద2 ప మ1 గ2 రి2 స ని2 స


59.అభోగి (22 జ) 
ఆ: స రి2 గ2 మ1 ద2 స
అ: స ద2 మ1 గ2 రి2 స


60.ముఖారి(22 జ) 
ఆ: స రి2 మ1 ప ని2 ద2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
(శుద్ధ దైవతం ద1 అన్యస్వరం) 


61.పటదీప్ (22 జ) 
ఆ: ని2 స గ2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
నీ2 స గ2 రీ2 స


62.సారంగ (65 జ) 
ఆ: స రి2 గ3 మ2  ప ద2 ని3 స 
అ: స ని3 ద2 ప మ2 రి2 గ3 మ1 రి2 స
( శుద్ధ మధ్యమము మ1 అన్య స్వరము) 


63.కదన కుతూహలం(29 జ) 
ఆ: స రి2 మ1 ద2 ని3 గ3 ప స 
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


64.ధన్యాసి(8 జ) 
ఆ: స గ2 మ1  ప ని2 స 
అ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స


65.సావేరి (15 జ) 
ఆ: స రి1 మ1  ప ద1 స 
అ: స ని3 ద1 ప మ1 గ3 రి1 స


66.అసావేరి (8 జ) 
ఆ: స రి1 మ1  ప ద1  స 
అ: స ని2 స ప ద1 మ1 ప రి1 గ2 రి1 స


67.పున్నాగ వరాళి(8 జ) 
ఆ: ని2 స రి1 గ2 మ1  ప ద1 ని2 
అ: ని2 ద1 ప మ1 గ2 రి1 స ని2


68.దర్బారు (22 జ) 
ఆ: స రి2 మ1  ప ద2 ని2 స 
అ: స ని2 ద2 ప మ1 రి2 గ2 గ2 రి2 స


69.దర్బారీ కానడ (20 జ) 
ఆ: ని2 స రి2 గ2 రి2 స మ1  ప ద1 ని2 స 
అ: స ద1 ని2 ప మ1 మ1 గ2 మ1 రి2 స


70.జోన్పురి(20 జ) 
ఆ: స రి2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స


71.కామ వర్ధిని(పంతు వరాళి)(51 మే) 
ఆ: స రి1 గ3 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ3 రి1 స


72.నఠ భైరవి(నరభైరవి) (20 మే) 
ఆ: స రి2 గ2 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స


73.బేగడ(29 జ) 
ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని3 ద2 ప స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


74.వకుళాభరణం(14 మే) 
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని2 స
అ: స ని2 ద1 ప మ1 గ3 రి1 స


75.సరసాంగి(27 మే) 
ఆ: స రి2 గ3 మ1 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ1 గ3 రి2 స


76.నాదనామ క్రియ(15 జ) 
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 
అ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3


77.మార్వా (15 జ) 
ఆ: స గ3 మ1  ద1 ని3 స
అ: స ని3 ద1 ప గ3 మ1 గ3 రి1 
     స రి1 గ3 రి1 స


78.రాగేశ్వరి/రాగేశ్రీ (28 జ)
ఆ: స గ3 మ1  ద2 ని2 స
అ: స ని2 ద2  మ1 గ3 రి2 స


79.లలిత (15 జ) 
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అ: స ని3 ద1 మ1 గ3 రి1 స


80.కురంజి (29 జ) 
ఆ: స ని3 స రి2 గ3 మ1 ప 
అ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స


81.కేదారం (29 జ) 
ఆ: స మ1 గ3 మ1 ప ని3 స
అ: స ని3 ప మ1 గ3 రి2 స


82.మలహరి (15 జ) 
ఆ: స రి1 మ1 ప ద1 స
అ: స ద1 ప మ1 గ3 రి1 స


83.హందోళ వసంతము (20 జ) 
ఆ: స గ2 మ1 ప ద1 ని2 స
అ:స ని2 ద1 ప ద1 ని2 ద1 మ1
గ2 రి2 స


84.హంస నాదం (60 జ) 
ఆ: స రి2 మ2 ప ద3 ని3 స
అ: స ని3 ద3 ప మ2 రి2 స
        (లేక) 
ఆ: స రి2 మ2 ప  ని3 స
అ: స ని3 ప మ2 రి2 స


85.శ్రీ రంజని (22 జ) 
ఆ: స రి2 గ2 మ1  ద2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ2 రి2 స


86.సురటి (28 జ) 
ఆ: స రి2 మ1 ప ని2 స
అ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స


87.ఆరభి (29 జ) 
ఆ: స రి2 మ1 ప ద2  స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స


88.దేవ గాంధారి (29 జ) 
ఆ: స రి2 మ1 ప ద2  స
అ: స ని3 ద2 ని2 ద2 ప మ1 గ3 రి2 స
(ని2 అన్య స్వరం) 


89.హమీర్ కళ్యాణి (65 జ) 
ఆ: స ప మ2 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప మ2 మ1 
     గ3 ప మ1 రి2 స
(శుధ్ధ మధ్యమము మ1 అన్య స్వరము) 


90.మోహన కళ్యాణి (65 జ) 
ఆ: స రి2 గ3 ప ద2  స
అ: స ని3 ద2 ప మ2 గ3 రి2 స


91.గౌళ (15 జ) 
ఆ: స రి1 మ1 ప ని3  స
అ: స ని3 ప మ1 రి1 గ3 మ1 రి1 స


92.పూర్వీ కళ్యాణి (53 జ) 
ఆ: స రి1 గ3 మ2 ప ద2 ప  స
అ: స ని3 ద2 ప మ2 గ3 రి1 స


93.బహుదారి (28 జ) 
ఆ: స గ3 మ1 ప ద2 ని2  స
అ: స ని2  ప మ1 గ3 స 


94.నాగస్వరావళి (28 జ) 
ఆ: స గ3 మ1 ప ద2  స
అ: స ద2 ప మ1 గ3 స


95 సౌరాష్ట్రము (17 జ) 
ఆ: స రి1 గ3 మ1 ప మ1 ద2 ని3 స
అ: స ని3 ద2 ని2 ద2 ప మ1 గ3 రి1 స 
(ని2 అన్య స్వరము) 


96 సారమతి (20 జ) 
ఆ: స రి2 గ2 మ1 ద1 ని2 స
అ: స ని2 ద1 మ1 గ2 స 


97 జన సమ్మోహిని (28 జ) 
ఆ: స రి2 గ3 ప ద2 ని2 స
అ: స ని2 ద2 ప గ3 రి2 స 


98  వరాళి (39 జ) 
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అ: స ని3 ద1 ప మ2 గ1 రి1  స 


99 నాటకురంజి (28 జ) 
ఆ: స రి2 గ3 మ1 ని2 ద2 ని2 ప ద2 ని2 స
అ: స ని2 ద2 మ1 గ3 రి2 స


100 మధువంతి (59 జ) 
ఆ: స గ2 మ2 ప ని3 స
అ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స


101.మధుకౌస్(సుమనేశ రంజని) (58 జ) 
ఆ: స గ2 మ2 ప ని2 స
అ: స ని2 ప మ2 గ2 స  
(ని3 అన్య స్వర ప్రయోగము కలదు) 


102 వాసంతి (27 జ) 
ఆ: స రి2 గ3 ప ద1 స
అ: స ద1 ప గ3 రి2 స


103 ఆందోళిక (22 జ) 
ఆ: స రి2 మ1 ప ని2 స -(మధ్యమావతి) 
అ: స ని2 ద2 మ1 రి2 స -(నాగవల్లి) 


104.మారు బిహాగ్ (29 జ) 
ఆ: స గ3 మ1 ప ని3 స
అ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స 


105.అల్హైయా బిలావల్ (29 జ) 
ఆ: స రి2 గ3 ప ద2 ని3 స
అ: స ని3 ద2 ప ద2 ని2 ద2 ప 
      మ1 గ3 మ1 రి2 స
(ని2 అన్య స్వరం) 


106.జయంతశ్రీ (20 జ) 
ఆ: స గ2 మ1 ద1 ని2 స
అ: స ని2 ద1 మ1 ప మ1 గ2 స


107.కనకాంగి (1 మే) 
ఆ: స రి1 గ1 మ1 ప ద1ని1 స
అ: స ని1 ద1 ప మ1 గ1 రి1 స


108.రసిక ప్రియ  (72 మే) 
ఆ: స రి3 గ3 మ2 ప ద3 ని3 స
అ: స ని3 ద3 ప మ2 గ3 రి3 స


          🙏జై శ్రీమన్నారాయణ🙏

శీర్షిక : మహిళ మహోన్నత శిఖరం . వచన కవిత.

నమస్కారం .
గోరసం మరియూ నేనుసైతం యూట్యూబ్ ఛానల్ వారి సంయుక్త నిర్వహణలో 

 *అంతర్జాతీయ మహిళా దినోత్సవం* సందర్భంగా 
నేను చదువుతున్న కవిత ...

కవిత శీర్షిక  : మహిళ మహోన్నత శిఖరం .

చదువుతున్నది...
శ్రీమతి.,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).నుండి
--------------------


శతాబ్ధి ప్రారంభంలో అచారాలపేరుతో
సతీసహగమనం, బాల్యవివాహాలు,
 భ్రూణ హత్యలు, ఆడ శిశువులను 
 చంపడం,లాంటి ఎన్నో
దురాచారాలు... ప్రధానంగా స్త్రీ లు
మాత్రమే ఎదుర్కొనేవారు.॥

దానికి కారణం ,  పెద్దలు నిర్ణయించిన 
ఆచారవ్యవహారాలను గౌరవించడం ।.
  అక్షరాశ్యత లేక-సమాజ
సంస్కరణలకు ఆవకాశాలు లేకపోవడం ॥


రాజారామ్‌మోహన్‌రాయ్‌ తలపెట్టిన 
మత, సంఘసంస్కరణ కార్యక్రమాలతో
సంఘసంస్కరణోద్యమాలకు అవసరమైన -
సామాజిక దృక్పథానికి పునాది పడింది ॥ 

కందుకూరి, గురజాడలవంటి వారితోపాటు ఆంధ్రదేశంలో అనేకమంది మహిళా సంఘ సంస్కర్తలు 
 సంఘ సంస్కరణోద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
 
  సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ,
 చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం 
 మున్నగు క్షేత్రాల్లో చదువు వల్ల
 వచ్చే సామర్థ్యాలతో సాధించే 
 కార్యాలే కాకుండా,  అనుభవం, ధైర్యం, 
 తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే 
 యోగ్యతలతో సాధించే కార్యాలు కూడా 
 స్త్రీ జాతి  శక్తిని, యుక్తిని చాటి చెప్పేయి .
 
  నాడు బాల్యవివాహాలు రుాపుమాపి , 
బాల విద్య ఆవశ్యకతలకై పోరాడే
దిశగా ముందడుగేస్తుా ఉద్యమాల బాటలో 
ఉత్తేజితులై  దేశాభ్యుదయానికై పోరాడుతుా,
ప్రగతి బాటలో స్త్రీ ల సాధికారతకై ఉద్యమించిన
మహిళలు , నేటి మహిళలకు స్ఫుార్తిదాయకులై  నిస్సహాయ మహిళల అంతరంగాల లో 
ఆత్మస్థైర్యాన్ని  నింపుతున్నారు..॥

ఆత్మవిశ్వాసం ,సహనశీలతల
కార్య దీక్షతో  కుాడిన పట్టుదలతో 
మహిళ లు సాధించిన విజయాల ..॥
 వెలుగు బాటలో మహిని మహోన్నతంగా 
 ముందుకు  నడిపించగలిగిన  అద్రుశ్య 
 శక్తికి  ప్రతిరుాపమే  స్త్రీశ్రక్తి ...

 మహిళలు లక్ష్య సాధనకై   ఎన్నో రంగాల లో
 కీలకపాత్రలు పోషిస్తుా విధి నిర్వాహణలో
 తమ ప్రతిభను ప్రదర్శిస్తుా అత్యున్నతమైన
 అవార్డ్ లను  ప్రతిష్టాత్మకమైన  బిరుదులను
 గ్రహించి భరత చరిత కీర్తికి  వన్నెతెస్తుా
 అకాశంలో సగభాగమనిపించుకున్నారు॥

 సామాజిక కట్టుబాట్లకు  వేధింపులకు 
లోనౌతుానే  సమాజోద్ధరణకై నడుం బిగించి 
మహిళా సాధికారతకై పోరాడుతుా
"మహిళ మహారాణీ "అనిపించుకున్నారు.॥

పురుషునితో సమానంగా అడుగులేస్తుా
అసాధ్యాలను సైతం సాధ్యం చేస్తుా -
దేశ ప్రగతికి  దోహదమౌతున్నారు స్త్రీలు .

స్త్రీల కు గౌరవమిచ్చి,  అధికారమిస్తే
సామాజిక,ఆర్ధిక మనుగడ అత్యంత 
మెరుగై  సుసాధ్యమౌతుంది అనడంలో
ఎమాత్రముా సందేహం లేదు.

అసాధ్యాలను సాధ్యం చేయగలిగే 
ఆత్మ నిర్భరత తో ప్రగతి పథానికి 
బాటలు వేస్తున్న అతివలు ,
గృహిణిగా  అత్మ సమర్పణ చేసుకుంటుా
అత్యున్నమైన మానవ సృష్టికి  
ముాల కారకురాలై,
అమ్మతనానికి  అది రుాప మౌతుా
భరత భవితకు పునాదులౌతున్నారు ॥

 సామాజిక చైతన్యానికి మారుపేరుగా
తమను తాము తీర్చిదిద్దుకుంటుాన్న
మహిళలు. మన భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయిలు.॥
ఇలా
ఎన్నో సిరులకు నెలవైన స్త్రీ లను గౌరవిస్తుా
స్త్రీశక్తికి మన వంతు సహకారాన్నందించి  
మన దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేద్ధాం.


నాకు ఇంతమంచి సదవకాశాన్ని కల్పించిన 
గోరసం మరియూ నేనుసైతం యూట్యూబ్ ఛానల్ 
నిర్వాహకులకు మనఃపుార్వక ధన్యవాదాలతో పాటు

మహిళాదినోత్సవ సందర్భగా
మహిళా మణులందరికీ ఆనందశుబాకాంక్షలు తెలియజేసుకుంటుా...
.నమస్కారం .

***************