Thursday, March 3, 2022

శీర్షిక : మహిళ మహోన్నత శిఖరం . వచన కవిత.

నమస్కారం .
గోరసం మరియూ నేనుసైతం యూట్యూబ్ ఛానల్ వారి సంయుక్త నిర్వహణలో 

 *అంతర్జాతీయ మహిళా దినోత్సవం* సందర్భంగా 
నేను చదువుతున్న కవిత ...

కవిత శీర్షిక  : మహిళ మహోన్నత శిఖరం .

చదువుతున్నది...
శ్రీమతి.,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).నుండి
--------------------


శతాబ్ధి ప్రారంభంలో అచారాలపేరుతో
సతీసహగమనం, బాల్యవివాహాలు,
 భ్రూణ హత్యలు, ఆడ శిశువులను 
 చంపడం,లాంటి ఎన్నో
దురాచారాలు... ప్రధానంగా స్త్రీ లు
మాత్రమే ఎదుర్కొనేవారు.॥

దానికి కారణం ,  పెద్దలు నిర్ణయించిన 
ఆచారవ్యవహారాలను గౌరవించడం ।.
  అక్షరాశ్యత లేక-సమాజ
సంస్కరణలకు ఆవకాశాలు లేకపోవడం ॥


రాజారామ్‌మోహన్‌రాయ్‌ తలపెట్టిన 
మత, సంఘసంస్కరణ కార్యక్రమాలతో
సంఘసంస్కరణోద్యమాలకు అవసరమైన -
సామాజిక దృక్పథానికి పునాది పడింది ॥ 

కందుకూరి, గురజాడలవంటి వారితోపాటు ఆంధ్రదేశంలో అనేకమంది మహిళా సంఘ సంస్కర్తలు 
 సంఘ సంస్కరణోద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
 
  సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ,
 చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం 
 మున్నగు క్షేత్రాల్లో చదువు వల్ల
 వచ్చే సామర్థ్యాలతో సాధించే 
 కార్యాలే కాకుండా,  అనుభవం, ధైర్యం, 
 తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే 
 యోగ్యతలతో సాధించే కార్యాలు కూడా 
 స్త్రీ జాతి  శక్తిని, యుక్తిని చాటి చెప్పేయి .
 
  నాడు బాల్యవివాహాలు రుాపుమాపి , 
బాల విద్య ఆవశ్యకతలకై పోరాడే
దిశగా ముందడుగేస్తుా ఉద్యమాల బాటలో 
ఉత్తేజితులై  దేశాభ్యుదయానికై పోరాడుతుా,
ప్రగతి బాటలో స్త్రీ ల సాధికారతకై ఉద్యమించిన
మహిళలు , నేటి మహిళలకు స్ఫుార్తిదాయకులై  నిస్సహాయ మహిళల అంతరంగాల లో 
ఆత్మస్థైర్యాన్ని  నింపుతున్నారు..॥

ఆత్మవిశ్వాసం ,సహనశీలతల
కార్య దీక్షతో  కుాడిన పట్టుదలతో 
మహిళ లు సాధించిన విజయాల ..॥
 వెలుగు బాటలో మహిని మహోన్నతంగా 
 ముందుకు  నడిపించగలిగిన  అద్రుశ్య 
 శక్తికి  ప్రతిరుాపమే  స్త్రీశ్రక్తి ...

 మహిళలు లక్ష్య సాధనకై   ఎన్నో రంగాల లో
 కీలకపాత్రలు పోషిస్తుా విధి నిర్వాహణలో
 తమ ప్రతిభను ప్రదర్శిస్తుా అత్యున్నతమైన
 అవార్డ్ లను  ప్రతిష్టాత్మకమైన  బిరుదులను
 గ్రహించి భరత చరిత కీర్తికి  వన్నెతెస్తుా
 అకాశంలో సగభాగమనిపించుకున్నారు॥

 సామాజిక కట్టుబాట్లకు  వేధింపులకు 
లోనౌతుానే  సమాజోద్ధరణకై నడుం బిగించి 
మహిళా సాధికారతకై పోరాడుతుా
"మహిళ మహారాణీ "అనిపించుకున్నారు.॥

పురుషునితో సమానంగా అడుగులేస్తుా
అసాధ్యాలను సైతం సాధ్యం చేస్తుా -
దేశ ప్రగతికి  దోహదమౌతున్నారు స్త్రీలు .

స్త్రీల కు గౌరవమిచ్చి,  అధికారమిస్తే
సామాజిక,ఆర్ధిక మనుగడ అత్యంత 
మెరుగై  సుసాధ్యమౌతుంది అనడంలో
ఎమాత్రముా సందేహం లేదు.

అసాధ్యాలను సాధ్యం చేయగలిగే 
ఆత్మ నిర్భరత తో ప్రగతి పథానికి 
బాటలు వేస్తున్న అతివలు ,
గృహిణిగా  అత్మ సమర్పణ చేసుకుంటుా
అత్యున్నమైన మానవ సృష్టికి  
ముాల కారకురాలై,
అమ్మతనానికి  అది రుాప మౌతుా
భరత భవితకు పునాదులౌతున్నారు ॥

 సామాజిక చైతన్యానికి మారుపేరుగా
తమను తాము తీర్చిదిద్దుకుంటుాన్న
మహిళలు. మన భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయిలు.॥
ఇలా
ఎన్నో సిరులకు నెలవైన స్త్రీ లను గౌరవిస్తుా
స్త్రీశక్తికి మన వంతు సహకారాన్నందించి  
మన దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేద్ధాం.


నాకు ఇంతమంచి సదవకాశాన్ని కల్పించిన 
గోరసం మరియూ నేనుసైతం యూట్యూబ్ ఛానల్ 
నిర్వాహకులకు మనఃపుార్వక ధన్యవాదాలతో పాటు

మహిళాదినోత్సవ సందర్భగా
మహిళా మణులందరికీ ఆనందశుబాకాంక్షలు తెలియజేసుకుంటుా...
.నమస్కారం .

***************


No comments:

Post a Comment