7/03/2022.
శీర్షిక : నడిచే నక్షత్రాలు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
మనసులోతుల్లో దాగి ఉన్న ఆకాంక్షలు
తీరని కోర్కెలకు చెక్ పెడుతున్న ఆంక్షలు
ఎదగాలన్న భావాలకు ఎగురుతున్న కోర్కెలు
కళ్ళాలు వేస్తుా కదలనివ్వని సంకెళ్ళు.॥
ఉద్యమాల బాటలో ఎక్కుపెట్టిన తుాణీరాలు
స్వాతంత్ర్య సమరంలో గెలుపు నినాదాలు
బాల్య వివాహాలుా' బాల వితంతుల వంటి
అమానుష ఆచారాల వివాదాలు
స్వాతంత్ర్యోద్యమబాటలో
సమసిపోయిన సమస్యలు ॥
అన్ని రంగాల లో అడుగు పెట్టిన అతివలు
పురుషునితో సమానంగా వేస్తున్న అడుగులు॥
ఆకాశంలో సగభాగమంటుా ఆదరణలు
హారతి పడుతుా ఆదరిస్తున్న నేటి ఆచారాలు ॥
ఇంటా బయటా బాధ్యతలలో నిష్ణాతులు
కట్టుా బట్టా మారినా వీడని సంస్కారాలు॥
నాటికీ నేటికీ తమ శక్తిని నిరుాపించుకుంటుా
ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న మహోగ్ర శిఖరాలు॥
ఎందరికో స్ఫుార్తి నిస్తున్న వీర నారీ మణులు॥
మహిళా దినోత్సవ వేడుకల్లో విజయ కేతనమై
ఎగురుతున్న దేశ భారతి కీర్తి కిరీటాలు.
ప్రగతి పథానికి పుాల బాటలేస్తున్న
నడిచే నక్షత్రాలు..నేటి మహిళామణులు॥
******************************
తమ ప్రతిభతో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న
మహిళామణులందరికీ సాదర అభినందనలతో
ఈ నా కవిత అంకితం.
No comments:
Post a Comment