Saturday, March 5, 2022

శీర్షిక : మగువ మనసు

అంశం : మగువ మనసు .
శీర్షిక : సహనానికి ప్రతిరుాపం .
(వచన కవిత ).

రచన : శ్రీమతి.,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------


చేయు కర్య మేదైనా 
కష్టించే గుణమామెది॥
కష్ట ఫలిత మాశించని 
వెన్న లాంటి మనసామెది ॥
గులాబీల మెత్తదనం 
మల్లెౕవంటి పరిమళం ॥
మగువ మనసు మమత నిండు
ముద్దు ముద్ద మందారం ॥
గులాబీల మృదువు నిండు 
ప్రేమ భావ మునకు మేటి
మల్లెలంటి గుభాళింపు 
వలపు వీచికలకు గీతి ॥
ముద్ద మందారపు సిగ్గు-
సంస్కారాలలో మేటి ॥
ప్రేమిస్తే పంచుతుంది  
నిన్ను మించినట్టి ప్రీతి.॥
ఆగ్రహిస్తే అవుతుంది 
 అమె ఆదిపరాశక్తి ॥
పచ్చ గడ్డి మండునట్టి 
పంతముతో నిడు జట్టీ ॥
అమ్మగా బిడ్డలపై 
ఎనలేని మమకారం .॥
కోపమొచ్చే పని చేస్తే 
ఎత్తును దుర్గావతారం॥
అనురాగం చుాపిస్తే 
ఔతుంది పుాలవనం ॥
అవమానం చేసిన 
ఆరని మంటల హోమం ॥
అత్తింటి కోడలిగా 
బాధ్యత బరువుల భారం
పుట్టినింటి ఆదరణకు 
అడుగడుగున ఆరాటం ॥
అత్తింటి పరివారం 
ఆమె సొంతమను భావం
ఆడపడుచులకు తానే 
అమ్మ ననే అభిమానం ॥
భర్త నుండి కోరునామె
నిజమైన అనురాగం ॥
అతనిష్టమె  తనదిగా 
మసలుకొనెడు బంధం ॥
సంసారపు సాగరాన 
కష్ట నష్టముల నావను 
చుక్కానై  ఒడ్డు చేర్చు
తెలివి నిండు చేత ఘనం ॥
సంద్రమంత లోతైనా
ఆమె మనసు సిరి ముత్యం.
అలజడి అలలెన్నున్నా 
అణచివేయునట్టి  గుణం ॥
కోపతాపముల దాచెడు 
శాంతమనెడు  స్వాభావం  ॥
అలసటలవి యెన్నున్నా  
చమట ధారల్లో మాయం ॥
సుడిగుండాలెన్నున్నా 
దాచు లోతు మనసులో ॥
 నిండు గుణపు నిధులన్ని 
 దాచి ఉంచు హృదిలో ॥
 మన్నికైన  ప్రేమ జుాప 
 నామె యౌను దాసోహం 
 మొాసమనీ తెలియగానె 
 మొగుడినైన వదలని తనం ॥
 అబల అబల అన్న మాట 
 సహించదు మాట  గాను - 
అబలకాను సబల నంటు
అన్ని రంగముల తాను ॥
కుటుంబ  శ్రేయసే కోరెడు
కుల సతిగా మసలునామె ॥.
 ఆత్మగౌరవము నిండిన 
 అత్మాభిమాని ఆమె ॥
చేయు కర్య మేదైనా 
కష్టించే గుణమామెది॥
కష్ట ఫలిత మాశించని 
వెన్న లాంటి మనసామెది ॥
 మనసులోని భావాలను 
 తెలుపనీని శాంత గుణం .
తనకోసం బ్రతుకదామె 
ఇదే స్త్రీ ల మనసు తత్త్వం ॥.

No comments:

Post a Comment