Tuesday, March 1, 2022

మహిళ మహోన్నత శిఖరం

శీర్షిక  : మహిళ మహోన్నత శిఖరం .

శతాబ్ధి ప్రారంభంలో అచారాలపేరుతో
సతీసహగమనం, బాల్యవివాహాలు, 
వర్ణవిభేదాలు, భ్రూణ హత్యలు, 
ఆడ శిశువులను చంపడం,లాంటి ఎన్నో
దురాచారాలు ప్రధానంగా స్త్రీ లు
మాత్రమే ఎదుర్కొనేవారు.॥

దానికి కారణం పెద్దలు నిర్ణయించిన 
ఆచారవ్యవహారాలను గౌరవించడం .
మరో కారణం  అక్షరాశ్యత లేక-సమాజ
సంస్కరణలకు ఆవకాశాలు లేకపోవడం ॥

స్వాతంత్ర్యం రాకముందే సమాజ సంస్కరణ
ఆవశ్యకతను తెలుసుకున్న కొందరికి
రాజారామ్‌మోహన్‌రాయ్‌ తలపెట్టిన 
మత, సంఘసంస్కరణ కార్యక్రమాలు 
వారి అభిమతానికి  దోహదం చేశాయి॥

ఈ  ఉద్యమం ద్వారా ఎన్నో అత్యుత్తమ 
వ్యక్తిత్వాలు వెలుగులోకి వచ్చాయి.అటుపై
ఆంగ్ల పరిపాలన పై వ్యతిరేకతతో పాటు
సంఘ సంస్కరతోద్యమాలకు అవసరమైన 
సామాజిక దృక్పథానికి పునాది పడింది ॥ 


కందుకూరి, గురజాడ , రఘుపతి
 వెంకటరత్నం, చిలకమర్తి మున్నగువారు 
 సంఘ సంస్కరణోద్యమాల్లో కీలక పాత్ర
 పోషించారు. వీళ్లతోపాటు ఆంధ్రదేశంలో 
 అనేకమంది మహిళా సంఘ సంస్కర్తలు 
 అడుగు ముందుకేశారు ॥
స్త్రీని శక్తితో పోలుస్తాం. 
స్త్రీలోని విశేష లక్షణం సహనం. 
ఈ సహనంతో స్త్రీ సాధించలేనిది లేదు. 
సంసారం, రాజకీయం, సంఘసంస్కరణ,
 చదువు, ఆరోగ్యం, శాస్త్రం, చట్టం 
 మున్నగు క్షేత్రాల్లో చదువు వల్ల
 వచ్చే సామర్థ్యాలతో సాధించే 
 కార్యాలే కాకుండా అనుభవం, ధైర్యం, 
 తెలివీ, త్యాగభావం వల్ల వచ్చే 
 యోగ్యతలతో సాధించే కార్యాలు కూడా 
 స్త్రీ జాతి మహిమను చాటి చెప్పే సందర్భాలున్నాయన్నది తెలిసిన విషయమే. స్త్రీ
ఆనాడుా ఈనాడుా కుాడా మహిళలు 
మహారాణులై  ప్రగతి పథంలో 
పురుషునితో సమానమైన బాధ్యతలను
నిర్వర్తిస్తుా అన్నిటా ముందంజ వేస్తున్నారు॥
బాల విద్య ,బాల్యవివాహాలు  రుాపుమాపే 
దిశగా ముందడుగేస్తుా ఉద్యమాల బాటలో 
ఉత్తేజితులై విజయకేతనాన్నెగురవేసారు.
శక్తి రుాపుణులై బానిస శృంఖలాలను 
తృంచివేసారు .


మహిమాన్వితమైన శక్తి రుాపిణిగా
ఆత్మవిశ్వాసం ,సహనశీలతలతో పాటు
కార్య దీక్షతో  కుాడిన పట్టుదలతో 
మహిళ లు సాధించిన విజయా లెన్నో ..॥
మహిళాభ్యుదయమన్న వెలుగు బాటలో
మహిని మహోన్నతంగా ముందుకు
నడిపించగలిగిన  అద్రుశ్య శక్తికి
ప్రతిరుాపమే  స్త్రీశ్రక్తి  అన్నది సత్యం ॥

విద్య, వైద్య , సాంకేతిక , శాస్త్ర
విజ్ఞాన , సాహిత్య సంగీతాది 
అనేక కళా రంగాలలో నిష్ణాతులైన 
స్త్రీ లు ఎన్నో ఉద్యమాలు, చేసి 
మరెన్నో కష్ట నష్టాలకోర్చి తమ ప్రతిభను నిరుాపించుకున్న వారై దేశాభ్యున్నతికి మార్గదర్శకులయ్యేరు ॥
సామాజంలో స్త్రీ కి తగిన గౌరవమిస్తే
సామసజిక మనుగడ సుసంపన్నమౌతుంది.
సమాజంలో మహిళలు  ఎన్నో రంగాల లో
 కీలకపాత్రలు పోషిస్తుా విధి నిర్వాహణలో
 తమ ప్రతిభను ప్రదర్శిస్తుా అత్యున్నతమైన
 అవార్డ్ లను  ప్రతిష్టాత్మకమైన  బిరుదులను
 గ్రహించి భరత దేశ కీర్తికి  వన్నెతెస్తున్నారు.॥
 
లక్ష్య సాధనకై  ధృడదసంకల్పంతో 
ఎన్నో అవరోధాలను అధిగమిస్తుా
అకాశంలో సగభాగమనిపించుకున్నారు॥

 సామాజిక కట్టుబాట్లకు  వేధింపులకు 
లోనౌతుానే  సమాజోద్ధరణకై నడుం బిగించి 
మహిళా సాధికారతకై పోరాడుతుా
మహిళ మహారాణీ అనిపించుకున్నారు.॥
పురుషునితో సమానంగా అడుగులేస్తుా
అసాధ్యాలను సాధ్యం చేస్తుా 
దేశ ప్రగతికి  దోహదమౌతున్న స్త్రీ 
స్వాతంత్ర్యానంతరం కుాడా 
పురుషాధిక్యతకు లోనౌతుా
అనునిత్యం  అవమానితులౌతుా 
ఆత్మహత్యలు చేసుకుంటున్నారు॥

 నేడు దేశాభ్యుదయానికై--ప్రగతి బాటలో
స్త్రీ ల సాధికారతకై ఉద్యమిస్తున్న 
మహిళలు , నేటి మహిళలకు 
స్ఫుార్తిదాయకులై  నిస్సహాయ
మహిళల అంతరంగాల లో 
ఆత్మస్థైర్యాన్ని  నింపుతున్నారు..॥

పుట్టినింట పున్నమి వెలుగైన స్త్రీ , 
మెట్టినింట  మహలక్ష్మి స్వరుాపమై
మమతలు పంచుతుంది.
తమ విధినిర్వాహణలో వీసమంతైనా
విసుగుచుాపక చిరునవ్వుల వెలుగౌతున్న 
స్త్రీల కు గౌరవమిచ్చి,  అధికారమిస్తే
సామాజిక,ఆర్ధిక మనుగడ అత్యంత 
మెరుగై  సుసాధ్యమౌతుంది అనడంలో
ఎమాత్రముా సందేహం లేదు.

అసాధ్యాయాలను సాధ్యం చేయగలిగే 
ఆత్మ నిర్భరత తో ప్రగతి పథానికి 
బాటలు వేస్తున్న అతివలు ,
గృహిణిగా  అత్మ సమర్పణ చేసుకుంటుా
అత్యున్నమైన మానవ సృష్టికి  
ముాల కారకురాలై,
అమ్మతనానికి  అది రుాప మౌతుా
భరత భవితకు పునాదులౌతున్నారు ॥

సామాజిక ఒడిదుడుకుల  బాఁటలో 
అన్ని ముళ్ళ బాటలను ఛేదించుకుంటుా 
సామాజిక చైతన్యానికి మారుపేరుగా
తనను తాను తీర్చిదిద్దుకుంటుా.
సామాజిక  అనాగరిపు సంకెళ్ళను
 తుంపి, సమాజ చైతన్య స్రవంతిగా 
 ప్రగతిబాటలో ప్రేరణ నిస్తున్న ప్రేమైక
చైతన్య స్వరుాపిణులైన  మహిళలు. మన 
భరతమాత కీర్తి కిరీటంలో కలికితురాయిలు.
ఎన్నో సిరులకు నెలవైన స్త్రీ లను గౌరవిద్దాం .
స్త్రీశక్తికి మన వంతు సహకారాన్నందించి  
మన దేశ భవిష్యత్తుకు బంగారు బాట వేద్ధం ॥

***************

No comments:

Post a Comment