Wednesday, March 30, 2022

స్వాగతం సుస్వాగతం .(యుగాది కవిత 2022 )

*గోదావరి రచయితల సంఘం వారిచే శ్రీ శుభకృత నామ సంవత్సర తెలుగు సంవత్సరాది పర్వదినం పురస్కరించుకుని కవితల పండగకై నేను రాస్తున్న కవిత.
*
31/03/2022.
శీర్షిక : స్వాగతం సుస్వాగతం.

రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .


ప్రతీ వత్సరం మారుతున్న గ్రహ నక్షత్రాల  
గమనాలకు అనుగుణంగా మారుతున్న కాలంలో
మంచి-చెడులతో నిండిన సుఖ- దుఃఖాలు
మనిషి జీవితంలో తెస్తున్న మరపురాని మార్పులు॥

ఏ ఏటి కాయేడు అడుగిడదామన్న ఆశల సోపానం
అడుగు దుారంలోనే  అందీ అందనంత ఎత్తుకు 
ఎదిగిపోతుాండడంతో నీరస పడుతున్న  జనంలో  
నిండిన  నిరాశ -నిస్పృహల నిట్టుార్పుల గాడ్పులు॥

కణ బాధల కన్నీటి కథనాలు ,
నోటు బందీలతో అస్తవ్యస్తమైన  జన జీవితాలు .
కామ వికారాలకు కాలిన కడుపు కోతల కన్నీళ్ళు 
కటిక దరిద్రంతో బతుకు భారమైన బడుగు జీవితాలు॥

గడచిన నాలుగు వత్సరాలలో కాలం తెచ్చిన
ఖర్మానికి తెరవేస్తుా ఆశలు తీర్చే ఆనంద పల్లకిలో,
మన  కోర్కెల వసంతాలు కొంగులో  నింపుకొని,
ఆనంద వసంతాల  అమృతాన్ని పంచేందుకు-
 
మరో ఆశాకిరణమై మనమధ్యకు  వస్తున్న 
 "శుభకృత్ యుగాది" కన్యకు  మనమంతా కలసి మంగళ గీతాలతో పలుకుదాం ఆనంద స్వాగతం ॥

హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని
నా స్వీయ రచన.

No comments:

Post a Comment