అంశం : హోళీ విశిష్టత.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి : కల్యాణ్ :మహారాష్ట్ర .
చలికాలం పోయి తొలి వేసవి ప్రవేశం
హోళీ పండుగ సందర్భంగా పసుపు,
కుంకుమలు కలిపిన రంగు నీటి జల్లులతో
ఐకమత్యపు ఆనందాల వసంతోత్సవాలు॥
పురాణ కథనాలనేకం వాటి సారం విశేషం॥
సత్య ధర్మ పాలనలకు
విజయం తథ్యమన్న అంశం
హోళికా పుార్ణిమ నాటి చరితల సారాంశం.॥
దేవతానుగ్రహంతో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణల
పౌరాణిక విశేషాల నిండు కథనాలనేకాలు
వివిధ ప్రాంతాలలో వివిధ ఆచారాలు
హోళీ పండగ నాటి విశిష్ట విశేష ఫలితాలు ॥
ఎన్నో కుల మత ఆచారాలు
వివిధ రుాపాల ప్రేమైకస్వరుాపాలు
రంగులు వేరేనా
రక్తం ఒకటేగా జీవితాలు॥
పగలు రాత్రుల కాలంలో ఎన్నో
వసంతాలు ఫాల్గుణ పుార్ణిమలో వచ్చే
"హోళికా పుార్ణిమ" నాటి విశిష్ట
పుాజాఫలితాలు॥
హోళికా రక్కశి పేరుతో
దగ్ధం చేయబడుతున్న
కక్షలుా కావేశాల సెగలు ॥
ధర్మబద్ధ విజయాలకు
అభయ పథ సోపానాలు.॥
కాల్చివేసిన చెడుతో
మంచికి పలికే స్వాగతాలు॥
సమైక్యతా భావంతో
కలిసి చేసుకొనే విందు వినోదాలు॥
మంచి చెడులకు మధ్యన
జరిగే పోరాటాలు , మంచికి జరిగే
విజయానుభుాతులతో
ఆనందాలు నిండిన
వసంతోత్సవ వినోదాలు॥
కొత్త నిర్ణయాలకు పలికే
శాంతిపుారిత స్వాగతాలు॥
మనమంతా ఒక్జటేనన్న
భావ పుారిత సందేశాలు ॥
ఒకొక్క ప్రాంతంలో ఒకొక్కవిధమైన
అచార విచారాలు
రంగులు నిండిన నీటి జల్లులతో
అందరు ఒక్కటై జరుపుకొనే
నిండైన వేడ్క వసంతాలు ॥
భిన్నత్వంలో ఏకత్వాన్ని
చుాపే ఆనందాలు॥
అందరుా ఒక్కటైన
ఆత్మీయ ఆలింగనాలు॥
గోపాల బాలుని డోలికోత్సవ
లీలా విశేష వినోదాలు ॥
ప్రహ్లాదాదుల చరితల భక్తి పథంలో
పునీత మయే మానవ జన్మబంధాలు ॥
రంగు నీటి స్నానాలతోతో సమసిపోయే
జాతి మత కుల విభేదాలు॥
మామిడి పుాతలతో
కోయిల పాడే ఆనంద గీతాలు॥
పర్వాల పేరుతో ఆరు
ఋచుల ఆహారాలకు
ఆరోగ్యం నిండిన
సాంప్రదాయ సాధనాలు ॥
నాటికీ నేటికీ భారతీయ
సంస్కృతికి వన్నెతెచ్చే
వరుస వెన్నెలలు తెచ్చే
కాంతి పండగలు॥
సమైక్యతతో సాధించే
ఐకమత్య విజయాలకు నిదర్శనాలు ॥
హోళీకా పుార్ణిమ, నాటి
వసంతోత్సవ ఫలితాలు
సంపుార్ణ చంద్ర దర్శనం తో కలిగే
ఆయురారోగ్యాలు॥,
భగవదారాధనల భక్తి పారవశ్యాలు
నిండు శాంతి సోభాగ్యాలకు
మెండైన సోపానాలు ॥
మనసులోని కల్మషాలను దగ్ధం చేసి -----
మనుషుల మనసులను ప్రక్షాళనం చేసి-----
మమతల వెలుగులను పంచే
"హోళికా పుార్ణిమ"
మనది వసుధైక కుటుంబమనే
సందేశాన్ని పంచే
వెలుగు వెన్నెలల జీవన వసంతం ॥
భరత భవితల
శాంతి సమైక్యతా జీవనానికి
దారి చుాపే
దిశా నిర్దేశిత దివ్య సందేశం ॥
*********************
No comments:
Post a Comment