ప్రదన్య సాహితీ వేదిక* మరియు *తపస్వి మనోహరం పబ్లికేషన్స్* వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న అవగాహన కవితల పోటీలకుగాను నేను
రాస్తున్న కవిత..
అంశం : మానభంగాలు.
శీర్షిక : న్యాయం సహకరించాలి.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
నానాటికీ పెరుగుతున్న నాగరికతతో
యువతలో తరుగుతున్న
సాంప్రదాయాలతోపాటు అనుకరిస్తున్న
పాశ్చాత్య పద్ధతుల మొాజు
స్త్రీ ల జీవితాలకు శాపంగా మారింది.॥
వెర్రి మొర్రి వేషాల వికట వస్త్రాధారణలు
తల బిరుసు నిండిన వెకిలి మాటలతో
యువత చేసే అశ్లీలపు ఆగడాలు ఎక్కువయ్యాయి.
దానికి తోడు సాంకేతిక మాధ్యమాల ద్వారా
విడుదలైన వాట్సప్ లు , యుాట్యుాబ్ లు
టిక్ టాక్ ల వంటి మాధ్యమాల ద్వారా
వెలికి వస్తున్న బుాతు భాగోతాలు ,
అశ్లీల చిత్రాలతో పాటు,అశ్లీలపు జోకులు
అశ్లీల వ్యవహారాల వివరణల సందేశాల వల్ల
యువతలో పెరుగుతున్న కామొాద్రేకాలకు,
ఆడబిడ్డల బతుకులు బుగ్గిపాలౌతున్నాయి.
వావి-వరుసల తేడాలు మరచిన కామం..
అమ్మతనం లో ఆడతనాన్ని చుాసే కామం..
పసి గుడ్డును పండు మసలినుా వదలని కామం..
పరువు మర్యాదలకు వెరవని తాపంతో
రెచ్చిపోతున్నాది .
జనంలో..మనం...మనం..లో.మనవారైన హీనం .
స్త్రీ ల బతుకు బాటకు సంకెళ్ళు వేస్తున్నాయి.
ఆకలి గొన్న అడవి మృగాల్లా...
ఒక్క ఆడ దానిపై ముాకుమ్మడి బలాత్కారాలు.
మాన భంగాలతో జరిగే మారణ హోమాలు.
స్త్రీ లకు స్వాతంత్ర్యంగా ముందడుగు
వేసే అవకాశాన్ని ఆటంకపరుస్తున్నాయి.
చట్టాలు తీర్పులు చట్టబండలౌతున్నాయి.
మృగాలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా..
కళ్ళు ముాసుకున్న చట్టం ...
ముడు కోతుల ముద్దు ఫ్రేములో ముచ్చటగా
కళ్ళు, నోరు ,చెవులుా ముాసుకొని
తరాజు తక్కెడలో నోట్ల బరువుకు
లొంగిపోతుా న్యాయాన్యాయాలు విస్మరిస్తున్నాది.
భోరు మన్న న్యాయం భరత మాత
ముతక చీర చిరుగుల్లో మానాన్ని కప్పుకొనే
ప్రయత్నంలో తన మనుగడ కోల్పోతుానే ఉంది.
హామీ : ఈ వచన కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment