02/03/2021
శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ శ్రీ కత్తిమండ ప్రతాప్ గారి సారధ్యం లో శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా
"ఉగాది కవితల పోటీ..
రచన: శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
అంశం : యుగాది ఆనందమా! నీ వెక్కడ?
శీర్షిక : మారని కాలం లో మారుతున్న మనిషి.
కాల చక్రం తన మానాన తాను తిరుగుతునే ఉంది.
ప్రభవ, విభవాది అరువది సంవత్సరాల కాలం
ప్రతీ వత్సరానికి ఒక ప్రత్యేకతతో వస్తుానే ఉంది.॥
మహిలో మనుషులు మాత్రం నాటి నుంచి నేటి వరకు
కాలాన్ని సవాలు చేస్తుా ప్రకృతితో పరాచికలాడుతుా
క్షణానికో మనస్తత్వంతో మారణహోమం చేస్తుానే ఉన్నారు. ॥
కాలం ...అలాగే ఉంది . రాత్రుల చీకట్లను దాటి
వెలుగు వెన్నెలలు పంచుతుానే ఉంది.
ఆరు ఋతువులకు ఆహ్వానం పలుకుతుా
ప్రకృతి నియమాలను నిలుపుతునే ఉంది ॥
కాలం మారిందంటుా తానే మారుతుాన్న మనషి
సభ్యత, సంస్కారాలతో పాటు మానవత్వాన్ని
కుాడా కోల్పోతుా స్వార్ధ పరుడై మసలసాగేడు.
"తన" పర" లతో పాటు వావి వరుసలు మరచేడు.॥
రాక్షసత్వంతో పెట్రేగిన కామొాద్రేకాలతో
కన్ను మిన్ను కానని కఠినాత్ముడయ్యేడు.
వక్రీకరించిన మనిషి బుద్ధి వరుస దురాగతాలతో
భ్రష్టు పట్టి రాక్షసత్వం తో రంకెలు వేస్తోంది॥
ఆడతనంలో ఆమ్మను చుాడవలసిన వాడు
అమ్మతనంలో ఆడతనానికి అంగలారుస్తున్నాడు.
వింత పోకడలు పెరుగుతున్న సమాజంలో.
న్యాయంకుాడా నోట్ల మత్తుకు లొంగిపోయింది ॥
విధి రాతను తప్పించలేని కాలం, కకలావికలమై
కరువు కాటకాలకు నెలవై క్రమశిక్షణ కోల్పోయింది
ఐనా ఇప్పటకీ మనిషి కాలాన్ని దుాషిస్తుా
తనను తాను సమర్ధించుకుంటుానే ఉన్నాడు..॥
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని
నా స్వీయ రచన.
No comments:
Post a Comment