తేదీ: *30-04-2022*
*శ్రీ శ్రీ గారి జయంతి సందర్భంగా*
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : విప్లవ కవి. శ్రీశ్రీ
అల్లకల్లోలమైన జన సంద్రంలో
ఒరిగిపోతున్న ఒడిదుడుకుల నావకు
చుక్కానై , జనులకు ఉత్తేజం కలిగించే
కవితా వాహినిలో బాటను చుాపిన
బహు జన చైతన్య కవితా ఖని
హేతువాదియైన శ్రీ శ్రీ ॥
ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి
తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చి,
విప్లవ తుాణీరాలతో వింటిని సారించిన
అభ్యుదయ రచనా దురంధరుడు కవి శ్రీ శ్రీ .॥
అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించి
అందరి మన్ననలనుాపొందిన మేటి కవి శ్రీశ్రీ ॥
వ్యక్తి ఒక మహోద్యమ శక్తి" అని,
అతను సృజించిన అక్షరమే మహత్తర
మార్పుకు కారణమని ప్రత్యక్షంగా తన
కవితలతో భావోద్యమాన్ని ప్రకటించిన
విప్లవ ముార్తి శ్రీ శ్రీ ॥
గురజాడ బాటలో వాడుకైన భాషలో
మాత్రా ఛందస్సుల మహోజ్వల హోమాన్ని
సంకల్పించి , ఉద్రేకం ఉత్తేజం కలిగించే
కవన యజ్ఞానికి శ్రీకారం చుట్టిన ఘనుడు శ్రీ శ్రీ ॥
ఎన్నో విరుధ్ధమైన భావాలు గల వ్యక్తిత్వం
ఎన్నో సంఘర్షణలతో కుాడిన ఉద్వేగం.. .
హేతువాదం, నాస్తికత, మేళవించ రాసిన
మహోన్నత కవిత్వం బాటలో అతడు
రాసిన కవిత్వం , మహాప్రస్థానమై అతనికి
కీర్తి కిరీటాన్ని ఆపాదించి కవిగా ఆతనిని అందలాలకెక్కించింది ॥
శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించి,
తనదైన శైలిలో వాడి సిద్ధాంతాల
వేడిని సృజింపజేసి కవన వనం లో
మనకను విహరింపజేసిన హేతువాది గా అందరిమదిలో చిరస్థాయిగా నిలచిపోయి
విప్లవ విజేత శ్రీ శ్రీ గా ప్రసిద్ధి చెందిన
సాటిలేని మేటి కవి శ్రీరంగం శ్రీనివాసరావు ॥
No comments:
Post a Comment