28 /02/2023 :
తపస్వీ మనోహరం , గ్రుాప్ సంకలనం కొరకు.
అంశం : సిసింద్రీలు
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
1 . ఓ అవమానం
మనిషిని మానసికంగా కృంగదీస్తుంది.
మానసిక మధనం, మనిషి విజయానికి దోహదమౌతుందు ॥
2. ఓ క్రోధం.
తనవారైన హితులను కుాడా దుారం చేస్తుంది.
తన కోపమే తన శతృవౌతుంది. ॥
3.ఓ ముార్ఖత్వం.
మనిషిని ఆలోచన లేని అవివేకిని చేస్తుంది.
మనిషిని అందలం నుంచి అధోగతికి దిగజారుస్తుంది.॥.
4 .ఓ పట్టుదల.
అనుకున్నది సాధించేందుకు అడుగు ముందుకేయిస్తుంది.
అట్టి సాధనే విజయానికి సోపానమౌతుంది. ॥
5 . ఓ ధర్మదేవత
తేడాలు చుాపనని, కళ్ళకు గంతలు కట్టుకుంది.
తేలు కొండె వంటి "సత్తా తొత్తుల చేతిలో ఆటబొమ్మయ్యింది
6. ఓ న్యాయం.
మారుతున్న అధికారిక బలం ముందు మొాకరిల్లింది
మరో దారి కానరాక ,తోలుబొమ్మగా మారింది.
7 .. ఓ పంతం.
మనం , చేయలేమనుకున్న పనికి , ప్రేరణనిస్తుంది.
మనిషి దశ లేని పోరాటానికి , దిశను చుాపిస్తుంది.
8 .ఓ ఆలోచన
మనసులో క్రోధాన్ని మధించి మనసును శాంతపరుస్తుంది
మనసుతో ఆలోచింపజేసి, మార్గదర్శకం చేస్తుంది.
9 .ఓ విత్తనం.
ఓ మొలక వృక్షమై మనిషి వేటుకు నేలకుాలిపోతుంది
ఓ పిండం పెరిగి కామం కాటుకు, రక్తపుముద్దైపోతుంది.
10. ఓ కాలం.
మారుతున్న మనసుల కాళ చిత్రాలు గీస్తోంది.
మానవత్వం మరచిన వారికి మరణమృదంగాలు వినిపిస్తోంది.
11. ఓ వర్ణం.
వర్ణాల కలయికై నిలచిన భరతమాత కీర్తి పతాకం.
వర్ణ భేదాల హోరుతో , దేశ అశాంతికి కారణం .
12 .ఓ ఓటు
బతుకు ఎన్నికలో ,మనిషి హక్కుకు గుర్తింపు పత్రం.
బడుగు వర్గాల పుాట కుాటి నోటై, కలల్ని కుాల్చే సిత్రం .
13
ఓ పదవి.
ఎన్నికల ముందు మాటల కోటల సామ్రాజ్యం.
ఎన్నికల తరువాత అధికార వేటల విందు భోజ్యం.
14 .ఓ ప్రమాణం .
అన్నమాటను నిలబెట్టుకునే నమ్మకానికి సాక్ష్యం.
అవకాశం కోసం వాడుకునే ,అక్కరలేని లక్ష్యం.
15 .ఓ మంచితనం .
మానవత్వం నిండిన మనిషి నడవడికల వెలుగు
మనిషి "లో" మనిషిని దాచే మాయా ముసుగు.
16. ఓ న్యాయం.
ఆది, ధర్మానికి పీట వేసే పవిత్ర శాశనం .
ఆధికారిక బలానికి అవసరంలేని లేపనం.
17 .ఓ అద్దం .
మనను మనకు యధాతథంగా చుాపే నిజమైన నేస్తం.
మనిషి "లో" వికారాలను దాచే అందమైన అబద్ధం .
18 .ఓ భుాతం
అల పంచభుాతాల కలయికై ప్రకృతిని సంరక్షిస్తుా..
ఆరవ భుాతమైన డబ్బుగా అర్భకులను శాశిస్తుా..
19. ఓ స్త్రీ
అమ్మగా, ఆలిగా, అత్తింటి బరువు, బాధ్యతగా....
అవసరమొస్తే అన్యాయాన్నెదిరించే అపర కాళిగా
20 . ఓ దొంగ .
దొరికితే , కటకటాల్లో , ఆకలిబాధల తప్పుగా
దొరల వేషంలో దోచుకుంటున్నా, అంతస్తుల్లో, ఒప్పుగా
21. ఓ పోలీసు
రాటుకు, పొిటుకు భయపడక న్యాయానికి అండగా
రంకు రాజకీయాల రక్షకుడై , దేశానికి దండగ.
22 . ఓ నాయకుడు.
ఉద్యమాల బాటలో ప్రజల కోసమై ప్రాణాలర్పించే వాడు
ఉన్నదంతా పరుల సొత్తు చేస్తున్న దేశ ద్రోహి నేడు .
23 .ఓ ప్రజా గాయకుడు.
భాధలకు బాణీలు కట్టే వేల గొంతుకల ప్రశ్నతడు.
బరువు నిందలకు బలౌతున్న , మంది లేని అనాధతడు.
24 . ఓ కవి .
అక్షరాలను అస్త్రంగా కుార్ఛే ఆక్రోశాల ఆవేశం .
అక్షర తుాటాలతో అరులను శాశించే విప్లవ సింగం
25. ఓ అక్షరం.
ఆవేశమై ప్రజల గుండెల్లో మండే కణంలా..
ఆదర్శాల బాటలో, వెలుగు నింపే దివ్య జ్యోతిలా॥
26 . ఓ స్నేహం.
కలిమి లేముల వ్యత్యేసాలు చుాడనిది
కష్టంలో ఉన్నపుడు కడదాక నిలచినది.
27 . ఓ గురువు
అజ్ఞానాంధకారంలో జ్ఞాన జ్యోతిని వెలిగించువాడు.
ఆదర్శాల బాటలో అర్ధ బలం లేని వాడు .
28.ఓ గడియారం
కాల గమనానికి సమయ నిర్దేశం చేసిన పరికరం.
కాలాన్ని సద్వినియొాగ పర్చుకునేవారికి వరం.
29. ఓ వనిత
హక్కుల పోరాటంలో ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్న జోరు
ఆకాశంలో సగభాగంగా నిలుపుకున్న పేరు .
30 .ఓ కన్నీరు.
ఎంత చలిలోనైనా గడ్డ కట్టని ఉధృత ప్రవాహం.
ఎంతటి భాధనైనా ఉపశమింపజేసే చల్లని లేపనం.
31 . ఓ ప్రేమ
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించేది.
ఒకరికొకరై జీవితాన్ని పంచుకొనేది.
32. ఓ వర్షం
కర్షకుల కాయ కష్టానికి ఉపశమనం.
కరువు లేని కాలానికి పచ్చచీర కట్టిన పసిడి ధనం .
33 . ఓ కల .
ఆశలకు రెక్కలు వచ్చి ఎగిరే ఆనంద విహంగం.
ఆశయాల గెలుపుకు అడుగేయించే అద్భుత రంగం .
34. ఓ జ్ఞాపకం .
తలపు దోసిలిలో నిండే పరిమళ పుాలగంధం.
తాత్కాలిక కలయికల కన్నీటి కథనం.
35 . ఓ కవిత.
మనిషిలో ఉద్వేగానికి ఊపిరి పోసే ఊపై ఉండాలి.
మార్పు కోరే బాటలో పోరాటాల ఊసై నిండాలి.
36 .ఓ కవిత్వం.
విశ్వ శాంతికై ,లిఖిత నినాదాల స్వరమైన కవి గర్జన.
విశ్వ చైతన్య కారణమైన విజ్ఞాన సముపార్జన .
37 . ఓ తల్లి గర్భం
మల ముాత్రాలు నిండిన పున్నామ నరక కుాపం .
మరో జీవి పుట్టుకకు జీవం పోసే మర్మ ద్వీపం.
38 . ఓ భ్రష్టాచారం .
సమాజ ,నీతి, నియమాలకు వెరవని భోగం .
సమాజాన్ని చీడపురుగులా పట్టిపీడించే విష రోగం.
39. ఓ రాజకీయం
ప్రజా హితులను సజీవంగా పుాడుస్తున్న శవ పేటిక.
ప్రజల కలలకు చితి పేరుస్తున్న స్మశాన వాటిక .
40 . ఓ అడుగు.
మీ, నా, ఉద్యమాలకు బాటగా, నాడు-
మీనమేషాలు లెక్కెడితే మిగలదింకేమీ, నేడు.
41 . ఓ పోరాటం .
అధర్మానికి అడ్డు గోడై అంతిమ విజయం సాధిస్తుంది.
ఆత్మ రక్షణ లేని అంతిమయాత్రౌతుంది.
42 . ఓ చైతన్యం.
స్వదేశంలో ,సుాన్యమై ..ప్రజల కన్నీటి ధారగా...
స్వ కృత- వికృతాలకు , పరదేశపు విందుగా..॥
43 . ఓ కారాగారం .
పరువుగల న్యాయ ధర్మాల సంకెళ్ళకు సాక్ష్యమౌతోంది.
పెరుగుతున్న పాపుల రక్తంతో ప్రక్షాళన చేసుకుంటోంది.
44 . ఓ తుప్పు.
మలినమైన ఇనుముకు పడితే విసిరి పారేస్తాం .
మసలే అధికారానికి పడితే దేశ వినాశనం చుాస్తాం.
45 . ఓ మానవత్వం .
మారిపోయిన మనిషిని వదలి వెళ్ళిపోయింది.
మంచి మనిషి కానరాక , మట్టిలో కలిసిపోయింది .
46 . ఓ వేలం పాట.
విదేశీ పర్యాటకులకు విందు భోజనం పెడుతుా..
విక్రయాల వేటలో స్వదేశ సంపత్తికి వేలం పాడుతుా.
47 . ఓ మందిరం .
ముాఢ భక్తులకు కోర్కెలు తీర్చే పవిత్ర దేవతలచట .
ముడుపుల పేరుతో ధనాన్ని దోచుకునే పాపుల కోట .
48. ఓ సిపాయి.
పోరు మధ్యలో ప్రాణం పోయినా పట్టించుకోని అనాధ.
పొందని ఆనందాలకు పుస్తెలుాడిన ఓ భార్య బాధ .
49. ఓ సైనికుడు.
దేశ రక్షణకై ప్రాణాలర్పించేందుకు వెరవని ధైర్యం .
దెబ్బతిన్న గాయాలకు ఉపశమనం లేని దైన్యం
50 . ఓ కామం .
వావి వరుసలు మరచిన పైశాచికానికి ముాలం.
వరుస దురాగతాల చెలగు దేహాన్ని బాధించే శుాలం.
హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.
------------------------------------------
06/02/2023.
"తపస్వీ మనోహరం" పోటీ కొరకు ,
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1. ఓ ఆలోచన .
--------------
మనిషి మస్తిష్కానికి పదును పెడుతుంది
మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుంది .
2. ఓ ఆవేశం.
----------
ఆశయ నిర్ణయాలకు ఆనకట్ట వేస్తుంది.
ఆఖరున అంతరాళలో ఆవేదన మిగులుస్తుంది.
3. ఓ మాట తీరు.
-------------
ఎంత మంది మనుషులను దగ్గర చేస్తుందో
ఎంతమంది మనసులను గాయం చేస్తుందో ..
4. ఓ అబద్ధం ...
-------------
శస్త్రమై జీవితాల్ని నాశనం చేస్తుంది.
శత్రువై నీలో మనిషిని హత్య చేస్తుంది.
5. ఓ చరిత.
------------
జీవిత గమనంలో ఆశయాలకై .పోరాటం.
జీవితమంతా ఉద్యమాలతో ముగిసిన కథనం.
6. ఓ భవిత.
-----------
అందమైన కలలతో ఆనంద తీరం వైపు .
అడుగడుగు అవరోధాలకు, అగుపడని గమ్యం వైపు.
7. ఓ రాజకీయం.
---------------
స్వాతంత్ర్యం నిండిన దేశానికి గొడ్డలి పెట్టు.
స్వార్ధ పుారిత నిర్ణయాలకు మనిషి జీవితాలే తాకట్టు.
8.ఓ స్త్రీ.
--------+
కారుణ్య ముార్తిగా మనలను కనిపెంచిన అమ్మ .
కామం నిండిన కళ్ళకు అంగట్లో ఆట బొమ్మ.
9. ఓ పురుషుడు.
----------------
మానవత్వంతో మసలితే మనుషుల్లో దేముడు
మదాహంకారంతో మసలితే , మృగతుల్యుడు .
10. ఓ మనిషి.
-------------
సమత -మమతల బాటలో సాధిస్తాడు విజయం .
సమానత్వ భావనతో మసలితే భుాతలమే స్వర్గం .
హామీ :
పై సిసింద్రీలు ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని
నా స్వీయ రచనలు.
08/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
1.ఓ మహిళ :
తన వారికోసం ఎంతైనా త్యాగం చేస్తుంది.
తనను అపహాస్యావమానాలు చేస్తే అపర కాళిగా మారుతుంది.
సంఖ్య : 2.
ఓ స్త్రీ .
ఆత్మవిశ్వాసంతో అడుగేస్తున్న ఆదర్శ వనిత. ॥
అందుకే మారుతున్న కాలంలో మార్చుకుంది తలరాత.
3. ఓ వనిత .
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన దీన చరిత.
ఓర్పుతో నేడన్నరంగాల్లో విజయపథాన్నేలిన అపరాజిత ॥
4.హోళీ:
రంగులు నిండిన ఆనంద వసంతోత్సవం .
రగిలే వర్ణ భేదాలను వదిలిపెట్టి అందరొక్కటైన దినం .
10/03/2023.
ప్రక్రియ : సిసింద్రీలు. (లఘు ప్రక్రియ).
రుాపకర్త : శ్రీ కార్తీక్ నిమ్మగడ్డ గారు.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
5 .ఓ అవమానం :
మనిషి మనసుని ముక్కలుగా చేస్తుంది.
మనసులోనున్న ఆత్మాభిమానం మనిషిని కుంగదీస్తుంది.
6. ఓ సంస్కారం.
సంఖ్య :
సమాజంలో, గౌరవాన్ని నిలబెట్టుకోవాలని చుాస్తుంది.
సరి-సమానతల భావంతో ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంది
ఓ సిగ్గులేనితనం.
పరువు ,మర్యాదలకు వెరవనిది .
పది మందిలో నున్నా పద్ధతి లేని నడత కలిగేది.
8. ఓ అహంకారం
నడిమంత్రపు సిరి వచ్చేసరికి నెత్తికెక్కేది.
నలుగురి మధ్య ఇంగిత జ్ఞానం లేక ప్రవర్తించేది.
14/03/2023.
ఓ సాధింపు.
మనలొని ఓర్మికి పెద్ద పరీక్ష.
మరీ హద్దులు మీరితే , తనకు తానుగా వేసుకున్న శిక్ష.
ఓ పుస్తకం
కొందరికి అందమైన హస్త భుాషణం.
కోరిన వారికి కొదవలేని జ్ఞాన భండారం.
21/03/2023. (పంపినది).
ఓ కల .
తీరని కోరికలను తీరుగా చుాపించే కమ్మని స్థితి.
తీరిన నిద్రతో తిరిగి పొందలేని ఆనందానుభుాతి .
No comments:
Post a Comment