[21/2/2022, 12:59 pm]
JAGADISWARI SREERAMAMURTH: 21/02/2022
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...
అంశం : నేను సైతం : మాతృ భాష కొరకు,
శీర్షిక : పలుకు తేనెల తల్లి.
ప్రక్రియ : వచన కవిత.
రచన : శ్రీమతి :పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ , మహారాష్ట్ర .
గిడుగువారి గొడుగులో
గ్రాంధిక మనే మసుగు తీసి
దేశ వ్యవహారిక భాషగా వన్నెకెక్కి
అందరి నోట పలుకు యాస గోస
మన అందమైన తెలుగు బాష ॥
నన్నయ తిక్కన ఎర్రాప్రగడల
రచనా శైలికి అక్షర పునాది వేసి
అష్ట దిగ్గజాల సాహిత్య వనంలో
ఛందోబద్ధ కావ్య ,పద్య, గద్య
కందమై,వేమన పద్యాలలో వేల
అందాలు సంతరించుకుంటుా
కవన వనంలోవీర విహారం చేస్తున్న
పలుకు తేనెల ముాట మన తెలుగు భాష॥
జానపదాల వేల కీర్తులతో
జన పదాల జల్లుగా కురిసి,
తెలుగింటి ఆడపడుచుగా
అక్షర నీరాజనాలందుకుంటున్న
ఆదర్శ సాంప్రదాయాల
అద్భుత చరిత , అందమైన
యాస గల మన తెలుగు భాష ॥
హామీ: ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన .
************************
[24/4/2022, 11:20 am]
JAGADISWARI SREERAMAMURTH: 24/04/2022.
నేను సైతం కవి పత్రిక మే2022 సంచిక కొరకు.
రచన: శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
అంశం : జీవితం ఒక నాటకం.
శీర్షిక : దొరల దోపిడీల దోబుాచులాట.
జీవితం ఒక నాటకరంగం.
వికృతి చేష్టల వికార రణరంగం.
చీకటి వెలుగుల కలబోతల కావ్య కదంబం.
అంతు లేని ఆశల ఆరాటాల విహంగం॥
జీవితమే ఒక చదరంగపు ఆట.
ప్రతీ రోజుా బతుకు పోరాటాల వేట.
స్వార్ధ పుారిత ఆలోచనలతో
పన్నుతున్న వ్యుాహ రచనల కోట.॥
పదవి కోసం కొందరి పోరాటపు దాడి .
పరువుకోసం కొందరి జీవితాల బలి.
కడుపు కోతల ఆవేశాల అలజడి.
ఆకలి చుాపుల్లో నిండిన కన్నీటి తడి ॥
కుల మత భేదాల సాకుతో మనిషి
మనిషితో ఆడుతున్న కర్కశపు ఆట.
రచ్చకెక్కుతున్న రాజకీయాలకు
రంగులు పుాసి పబ్బం గడుపుకునే
కొందరి నాయకులు ఆడే దొంగాట ॥
జీవిత చదరంగం లో గెలుపు ఓటమిల ఆటకు
సవాలుగా "చెక్ "చెపుతున్న ఓటు కోట .
దొంగ బాసల దోపిడీదారుల వలలో
చిక్కుకుంటున్న బడుగు జీవితాల
బ్రతుకు పోరాటాల తల రాత ॥
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
********************************
[30/5/2022, 1:25 pm]
JAGADISWARI SREERAMAMURTH: 20/05/2022.
నేను సైతం కవి పత్రిక కొరకు.
అంశం : మరణ శయ్యపై పర్యావరణం.
శీర్షిక : కార్చిచ్చు రేపుతున్న కల్మషాలు.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .మహారాష్ట్ర .
ప్రక్రియ : వచన కవిత.
*************************::
ప్రకృతిలో సమతుల్యం లేని లోపాలకు
కొండలు గుట్టల ఆగని హననాలు కారణాలు.
జలాల్లో,గాలుల్లో చేరుతున్న కలుషితాలు.
మనుషుల్లో పునరోత్పత్తికి అవరోధాలు॥
పురుగుల మందుల ఉపయొాగాలు
పుడమి తల్లి పాలిటి శాపాలు॥
పచ్చదనం కానరాని ప్రకృతిలో
ప్రాణవాయువు కరువైన వైపరీత్యాలు.॥
కార్చిచ్చు రేపుతున్న కల్మషాలకు
పర్యావరణంలో మార్పులు.
కాలుష్యపు కంపుతో మురికి వ్యర్ధాలతో
జన జీవితాలలో రోగాల అల్లకల్లోలాలు ॥
విషపుారిత వాతావరణంలో.
పెరిగిన ఉష్ణోగ్రతల ఉధృతాలు ॥.
అశువులు బాస్తున్న పశువులు
నేల కుాలుతున్న మానవ కళేబరాలు.॥
మలమల మాడుతున్న జీవ రాసులతో
మరుభుామిగా మారుతున్న మట్టి తల్లి.
కలుషిత వ్యర్ధాల కాలుష్యపు కంపుతో
చిక్కి శల్యమైన పుడమి పడతి మరణ
శయ్యపైనుండే మార్పు పోరాటం చేస్తోంది॥
*****************************::::
హామీ :
ఈ కవిత ఏ మాధ్యమునందునుా
ప్రచురితముకాని నా స్వీయ రచన.
***************************
[27/6/2022, 3:10 pm]
JAGADISWARI SREERAMAMURTH: 27/06/2022.
నేను సైతం కవి పత్రిక జుాలై సంచిక కొరకు ,
అంశం : విప్లవం వర్ధిల్లాలి.
శీర్షిక : నిర్లక్ష్యం నెత్తురోడిస్తోంది.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
కేంద్ర తీసుకుంటున్న అసమంజస నిర్ణయాలుతో
ప్రజల ఆవేదన ఆక్రోశమై ఉద్యమాల బాటకు
ఉరకలు వేయిస్తోంది.॥
న్యాయం, దౌర్జన్యాలు నిండిన తక్కెడలో
ఇమడలేక అరాచకపు అణచివేతలకు దాసోహమంటోంది .॥
మాఫియా విక్రయాలకు, పెరుగుతున్న మద్దతు దారులు...
నోట్ బందీ కారణంగా ముాత తబడిన కర్మాగారాలు...
దేశ సంపత్తుల ప్రైవేటీకరణపై వాదోపవాదాలు.
ప్రజలలో రాజుకుంటున్న అగ్ని జ్జ్వాలలు...॥
ఇసుక మాఫియాలు, భుా కబ్జాలతో, ఆకాశాన్నంటుతున్న అన్నదాతల ఆక్రోశాలు,
పెరుగుతున్న కామానికి బలౌతున్న మానానికి ,
రక్షణ కల్పించలేని ఆరక్షణా కేంద్రాలు.॥
అమలుకాని సంక్షేమ పథకాలు ....,
బాల కార్మికులుగా బందీలైన భరత మాత భావి తరాలు...
ప్రస్థుత పరిస్థితిని తారుమారు చేస్తున్న అగ్నివీర పథకాలు...॥
ఇవన్నీ అర్ధమయినవి కొన్ని అర్ధంకానివి కొన్నిగా..
ప్రజలలో అసంతృప్తి కలిగిస్తున్న అగ్ని బీజాలు.
వీటన్నిటి పరిణామంతో రాజుకొనేవే విప్లవాలు..॥
పరిస్థితుల లో మార్పు రావడం అనివార్యమైనపుడు, ఉద్యమ బాటలో ప్రజలెన్నుకొనే మార్గం విప్లవమే ఐతే...
"విప్లవం వర్ధిల్లాలి."
హామీ : నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితముకాని నా స్వీయ రచన.
*************************************
[10/8/2022, 5:13 pm]
JAGADISWARI SREERAMAMURTH:
నేను సైతం కవి పత్రిక ఆగష్టు నెల సంచిక కొరకు...
అంశం : నేను నా దేశం .
శీర్షిక : రత్నగర్భ నా దేశం .
శీర్షిక : రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్. మహారాష్ట్ర.
ప్రక్రియ : వచన కవిత.
"జననీ జన్మ భూమిశ్చ - స్వర్గాదపి గరీయసీ". అంటే
జనని, జన్మభూమి స్వర్గము కంటె ప్రియమైనవి కదా!".
అని స్వయముగా శ్రీరామంచంద్రుడే అన్న మాట.
భిన్నత్వంలో ఏకత్వాన్ని చుాపించిన పుాదోట.
కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు విస్తరించి
విభిన్న మతాలు,భాషలు, సంస్కృతులతో విలసిల్లుతూన్న సువిశాలమైన దేశం నా దేశం .
ఆర్య భూమి, సూర్య భూమి, వీరభూమిగా
బోయి భీమన్న మాట సత్యమైన కోట.
దేశమంటే మట్టి కాదోయ్! దేశమంటే మనుషులోయ్!!- అన్న గురజాడ అప్పారావు పాట అందరి నోటా.
బ్రిటిష్ ఆర్మీని గడగడలాడించిన
ధీర వనిత ఝాన్సీ లక్ష్మిబాయి.
భారత స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికిన
తొలి ఉద్యమకారుడు మంగల్ పాండే ..
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రజలకు ప్రేరణ కలిగించిన ఉద్యమ తార భగత్ సింగ్.
అహింసా మార్గంలో అద్భుతాలు సాధించవచ్చని..
ప్రపంచానికి సరికొత్త దిశానిర్దేశనం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీజీ...
భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన వ్యక్తి
డాక్టర్ బాలా సాహెబ్ అంబేద్కర్ ...
ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన
స్వామి వివేకానంద...
నాకు రక్తం ఇవ్వండి. నేను మీకు స్వాతంత్ర్యం తీసుకొస్తాను అన్న శుభాష్ చంద్రబోస్ ..వంటి
దేశ ప్రేమికులకు జన్మ నిచ్చిన దేశం నాదేశం .
తెలుగు సాహిత్యంలో అత్యంత ప్రాచుర్యం పొందిన అష్టదిగ్గజాల వంటి కవులతో ,
ఆష్టాదశ పురాణాలకు ఆది ముాలమై..
నాలుగు వేదాలకు నిలయమైన సంప్రదాయబద్ధ
సంస్కృతికి నిలయం నా దేశం.
అరవై నాలుగు కళలతో అలరిన అక్షయ, సంగీత సాహిత్యాలకు కావ్య కవన ఇతిహాసాల సమాహారం
నా దేశం.
ఆంతులేని ఆప్యాయత ఆత్మీయత నిండిన
జన సందోహంతో, పలు భాషలు నిండు పలకరింపులతో , హిమ పన్నగ శోభలతో, సాగర, నదీ
గమనాలతో పరవసించు ప్రకృతి వన శోభలతో
అలరారుతున్న దేశం...నా దేశం ॥
వేయేల ! పుణ్య భుామి నా దేశం నమొా నమామి!
॥నన్నేలిన నా దేశం సదా స్మరామీ ॥
హామీ : పై కవితసా స్వీయ రచన.
***********************************
[05/03, 12:47 pm]
JAGADISWARI SREERAMAMURTH: 05/03/2023.
2023 -శోభకృత్ యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు ,
అంశం : ఉగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
రాబోయే "శోభకృత్" యుగాది నెచ్చెలిని
ఆహ్వానించడానికి, ప్రకృతి పడతి
సంతోషంగా స్వాగత యత్నాలు చేస్తోంది.॥
పచ్చని ఆకుల తోరణాలకు పుాల గంధాలనద్ది-
చిలుక చెలులను -కిలకిలారవాలతో
ఆనంద స్వాగతం పలకమంది.॥
పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన
తరు వనంలో, చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ కళల విరిసిన కలువ కన్నెలను
కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
చల్లని మలయమారుత వింజామరం వీచమంది ॥
కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను,
స్వాగత గీతాలాలపించమంది.॥
పక్షుల కిల కిలా రవాలు నిండిన
విశాల తరు శాఖల చల్లటి నీడలో ,
మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
అంతలోనే ఆనందంగా ఆడుగిడిన
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
ఆప్యాయతరతో ,తన వంతుగా ఈ వత్సరమంతా
అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
పలికుతుా ఆమని నెచ్చెలిని ఆనందంగా
ఆలింగనం చేసుకుంది .
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన.
*****************************
05/03/2023.
2023 -శోభకృత్ యుగాది సందర్భంగా..
ISBN కవి పత్రిక కొరకు (,క్రమ సంఖ్యవ..46)
( పంపడమైనది).
అంశం : ఉగాది.
శీర్షిక : నవ యుగాదికి స్వాగతం .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
ప్రకృతి పడతిని వరుస శోభలతో నలంకరించిన
వసంత కన్యక,రాబోయే "శోభకృత్" యుగాది
నెచ్చెలిని ఆహ్వానించడానికై ఆత్రుత నిండిన
ఆనందంతో "స్వాగత" యత్నాలు చేస్తోంది.॥
చిగురుటాకుల లేత పచ్చని తోరణాలకు -
రంగు పుాల సుగంధాలనద్దింది-
కిచ- కిచ లాడే చిలుక చెలులను పిలచి
కిలకిలారవాలతో ఆనంద స్వాగతం పలకమంది.॥
పుడమి నుదుట, పచ్చ బొట్టై నిలిచిన
తరు వనంలో, చిరు గడ్డి తివాచీ పరిచింది.
కళ -కళల విరిసిన కలువ కన్నెలను
కాలి బాటలో నిలిపి,అలసి వచ్చిన నెచ్చెలికి
చల్లని తేట నీటితో దాహం తీర్చమంది ॥
కమ్మని మావి చిగురుతో తమ కంఠాలకు
మెరుగుపెట్టుకుంటున్న వసంత కోయిలలను,
స్వాగత గీతాలాలపించమంది.॥
వసంత శోభలకు పరవసించి పురివిప్పిన
నెమలి కన్నెలను ఆనంద నాట్యాలాడమంది .
విశాల తరు శాఖల చల్లటి నీడలో ,
మట్టి సుగంధాల మేలు పల్లకి నిలిపింది॥
ప్రకృతి సిద్ధమైన ఘుమ ఘుమలతో నిండిన
ఆరు ఋచుల అరుదైన వంటకాల
విందు- వినోదాలనమర్చింది .
అంతలోనే ఆనందంగా ఆడుగిడిన
అందాల "శోభకృత్ కన్య", పుడమి చెలుల
ఆప్యాయత నిండిన హ్వానాలకు ఆశ్ఛర్యపడి
ఆప్యాయతతో ,తన వంతుగా ఈ వత్సరమంతా
అందరికీ అనేక సుఖ భోగాలను పంచి ఇస్తానని
పలుకుతుా, ఆమని నెచ్చెలిని ఆనందంగా
ఆలింగనం చేసుకుంది .
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన.
*****************************
No comments:
Post a Comment