Monday, June 26, 2023

చిత్ర కవిత. (చిత్రం: అక్షరాలకు రెక్కలు వచ్చాయి).

[26/06, 8:05 pm] JAGADISWARI SREERAMAMURTH: 26/ 06 /2023.
మహతీ  సాహితీ కవి సంగమం.

చిత్రకవిత -

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .


అక్షరాలు నిండిన పుటలలో
అవని నుండి ఆకాశం వరకు నిండి ఉన్న విజ్ఞానం.
దేశ విదేశాల సంస్కృతి సంప్రదాయాల నెరిగించే 
జ్ఞాన పరమైన విషయ సంపదల  సారం !!

మానవ మేధకు పదును  పెడుతున్న విజ్ఞానం
మనసు పుటల్లో మనిషి భావాలకు రెక్కలొచ్చిన వైనం
 అంతరిక్ష ప్రయాణం చేయిస్తున్నా ఆకాశ విహంగం
ఆశల తీరాలకు చేరాలన్న ఆశయాలకు ప్రతిరూపం!!

అక్షరాల బాట లో సాగిన అనంత విశ్వం.
విశ్వం వేటలో దాగిన  చతుర్వేద విజ్ఞానం.
రేయింపవళ్ల  రెక్కల కష్టానికి లెక్కకు రాని
బ్రతుకు పోరాటాలకు బంధీలవుతున్న అక్షర కన్యల ఆక్రోశం !!

ప్రకృతి  నిండిన పచ్చదనంలో జన జీవ చైతన్యం.
జాతి భేదాలు తెలియని మానవ మేధస్సు-
 పెడుతున్న పదునుకు ,మెదడులో ఆత్మవిశ్వాసం.-
 అణగారి పోతున్న అంతర్మధనానికి తార్కాణం!!

 రాజ్యాంగం రణనీతులకు  రగిలిపోతున్న న్యాయం.
విదేశాలకు అమ్ముడుపోతున్న దేశ సంపదల 
దౌర్భాగ్యానికి నలిగిపోతున్న  వ్యవస్థల పరిణామం
బ్రతుకు పోరాటాల బాటలో చితికిపోయిన జనం-!!
ఏబీసీడీల యాసతో నిండిన విదేశాలకు  ప్రయాణం !!

వెన్నుపోటు వెతలతో తల్లి భారతి తడబాటు..
భరత భవిత గ్రహ పాటుకు మాతృభూమి ఎడబాటు!!


*****************************************
[26/06, 8:29 pm] +91 94418 71767: 3️⃣7️⃣
రాజ్యాంగం రణనీతులకు  రగిలిపోతున్న న్యాయం.
విదేశాలకు అమ్ముడుపోతున్న దేశ సంపదల 
దౌర్భాగ్యానికి నలిగిపోతున్న  వ్యవస్థల పరిణామం
బ్రతుకు పోరాటాల బాటలో చితికిపోయిన జనం-!!
ఏబీసీడీల యాసతో నిండిన విదేశాలకు  ప్రయాణం !!

అంటూ తమరు వ్రాసిన కవిత చాలా చాలా బాగుంది మేడం 🙏🙏🙏

No comments:

Post a Comment