05/05/2023.
"కవన కిరణాలు " లో
నాలుగవ సంకలనానికై రాసిన వచన కవిత..
శీర్షిక : కవి కాని , కవి వేదన .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
అంతరంగంలో రేగుతున్న అలజడి
నాలో అంతరాత్మను చిత్రవధ చేస్తున్న సడి.
కవిగా నా మస్తిష్కం లో కదులుతున్న భావాలు-
అణచిపెట్టిన నా పిరికితనానికి ప్రతి రుాపాలు ॥
కాగితంమీద నా కలం కురిపిస్తున్న అబద్ధపు-
అక్షరాల, ఆక్రోశం నిండిన ఆక్రందనలు .
ఉన్నది ఉన్నట్టు రాయలేని నా పిరికి తనానికి
కవితాత్మకమైన కన్నీటి సాక్ష్యాలు॥
అడ్డ త్రోవలో అడుగులేస్తుా అక్షర కన్యలను
మానభంగం చేస్తున్న నా దౌర్జన్యానికి .,
నా ఎదురుగా కుప్పలుగా పడున్న ప్రసంసాపత్రాల-
వెకిలి వేళాకోళాలు, నన్ను నిలదీస్తుా ప్రశ్నిస్తున్న
తిరుగుబాటుకు ప్రత్యక్ష సాక్ష్యాలు॥
జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించలేని తనం ,
నాలో జారిపోతున్న విలువలకు -
వలువలుాడదీసిన వైనం.-
సమాజ హితాన్ని కాంక్షించే కవిగా ఎదగలేని
నా నిస్సహాయతకు , నాలో జరుగుతున్న అంతర్మధనం ,
నాలో నిజయతీని, నమ్మలేని నిజానికి సాక్ష్యం ॥
మీకు తెలీని నిజమేంటో తెలుసా....
బాహ్య ప్రపంచంలో గొప్ప" కవిగా "
గుర్తింపబడుతున్న నన్ను ,నా అంతరంగ
"న్యాయ పీఠం" అబద్ధాల కవిగా,
నన్నేనాడో ఉరితీసేసింది .
హామీ :
ఈ కవిత నా స్వీయ రచన .
No comments:
Post a Comment