మగువ మహారాణిలో
14/05/2023
అంశం : అవనికి అమ్మే ఆధారం*
శీర్షిక : అమ్మా ! నువ్వెక్కడ..?
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
అవనిలో అలిగా ,అక్కగా, చెల్లిగా ,
చెలిగా..,అల్లుకున్న బంధాలకు
ఆత్మీయతను,అనురాగాన్ని పంచి,
విలువలు నేర్పిన కొమ్మ అమ్మ॥
మన ఉనికికి ఆధారం అమ్మ .
మన నోట తొలి పలుకు అమ్మ .
మన తొలి అడుగుకు ఆసరా అమ్మ.
అక్షరాలకు అర్ధం చెప్పన తొలి గురువమ్మ. -॥
మన బాటకు మార్గదర్శై,
మన కష్టానికి తోడై, మన-
ఇష్టాలకు వరమై, నీడలా
మన వెన్నంటి ఉండి మనలను
గాచే- ఇల వెలసిన దేవత అమ్మ ॥
అమ్మ గురించిన కవితలు కొల్లలు
అమ్మ గురించిన భాష్యాలు వేలు
మన కవితల్లో జీవం అమ్మ .
నిజానికి మన స్వార్ధానికి-
బలౌతున్న బ్రతుకు అట బొమ్మ ॥
నేడు అమ్మలు, గుండెలు పగిలి -
చిందర-వందరైన గాజు దీపాలు.
వృద్ధాశ్రమాల్లో ఉనికి మరచిన
బ్రతుకు పొిరాటాల తోలు జీవాలు॥
హమిపత్రం :
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితము కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment