Tuesday, June 27, 2023

పద్యాలు. ( మొత్తం).



అంశం : శ్రీ క్రిష్ణుడు.

శీర్షిక : శ్రీ క్రిష్ణ  శరణం మమ ॥

ప్రక్రియ : ఉపేంద్రవజ్ర.


రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్  :  మహారాష్ట్ర .

ఉపేంద్రవజ్రకు గణములు-

IUI    U U I    IUI      U U 

జ-      త-      జ-     గ-గ


నమొాస్తు  శ్రీకృష్ణ నరాయ ణాయా.

నమొాస్తు నందాత్మ జబాల కాయా.

నమొాస్తు లీలాది విహార పారా

నమొాస్తు శ్రీశాయ సుబాల కాయా ॥ 


నమొాస్తు  దేవాది భిరర్చి తాంఘ్రీం.

నమొాస్తు శాంఖాయు ధచక్ర పాణీం .

నమొాస్తు శ్రీవత్సస వక్ష సాయాం 

నమొాస్తు గోపీ జనపాల మేయం   ॥


నమొాస్తు క్రిష్ణంవర రుాపనంతం

నమొాస్తు భక్తాశ్రిత పారిజాతం .

నమాస్తు గోపీజనలోల బృంగం.

నమొాస్తు వేణుా స్వర గీతలోలం ॥


వికుంఠ వాసాయ అకుంఠ తీర్థం.

సుపాండ వాపక్ష సుపార్ధ మిత్రం.

సుగీత బోధాత్మక  దివ్య గాత్రం 

నమొా నమః శ్రీ పురవేనమస్తే ॥


సమస్త లోకైక సురక్ష కుక్షీం

సమస్త భక్తాగ్రజ  సేవితాక్షాం

సమస్త  సౌభాగ్య సుమంగ ళాయాం

సమస్త భుామండల నాయకాయాం ॥


అనంత శ్రీశేష శయాంగ నాయాం

అనంత సంకల్ప వికల్పనాయాం

దిగంత వ్యాప్తాయ దివాకరాయాం

దశాది రుాపాయ దయాపరాయాం ॥


సునీల దేహాయ శుభాంగ నాయాం

సువేణు నాదాయ సుగాత్ర మిత్రాం

సుహేమ భుాషాది సుశోభి తాయాం॥

సుభక్త పోషాయ సుదివ్య చిత్తాం॥


చతుర్భు జాయాయ సనాత నాయాం

అనంత నంతాయ అమొాఘకాయాం

మధుర్వనే బృంద వనే విహాయాం

వ్రజ జ్జనానందన నంద బాలాం ॥


తమాల భుాషాతులసీ ప్రియాయాం

సుపీత వస్త్రాది  సుదివ్య నేత్రాం   

చిదంబ రానంద  చరాచరాయాం

శమంత కాదివ్య మణి ప్రకాశాం ॥


కుచేలపాలం బహుబంధు మిత్రం 

సుసచ్చిదానంద  సుదివ్య  క్షేత్రం 

కురుాప కుబ్జాది సురుాప దాతం

నమొాస్తు శ్రీనీల ఘనాయ శ్యామాం  ॥


*****************************



శ్రీరాజ  రాజేశ్వరీ " స్తోత్రం .

ఛందస్సు : ఇంద్రవ్రజ.

గురు శంకరాచార్యుల ఛందస్సు వైభవము

ఇంద్రవజ్రకు గణములు- త-త-జ-గ-గ, 

ప్రక్రియ : శ్లోకం.


రచన : శ్రీమతి : 

పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.

కల్యాణ్. : మహారాష్ట్ర .


---------------------

1.

మాతామ హారాజ్ఞి మతంగ కన్యే

శ్రీమన్మ హాదేవ  సుభాంగపర్ణే. 

శ్రీరాజ  రాజేశ్వరి వంద్యమాన్యే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

2.

కస్తూరి  కాశ్యామల కోమలాంగే

శ్రీమన్మనోజ్ఞే  శ్రితపాద యుగ్మే

శ్రీరాజ రాజేశ్వరి రక్షసఘ్నే (చారు హాసే).

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

3.

వందే శుభాంబిక శ్రితాశ్రితాయే

చతుర్భుజే శంకరు వల్ల భాయే 

శ్రీరాజ రాజేశ్వరి దివ్య ముార్తే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

4.

కాదంబ వాటీ కమలాలయాయే..

కస్తుారికా దివ్య సుగంధ మాల్యే

శ్రీరాజ  రాజేశ్వరి శ్యామలాంగే

పాహీ పరేశక్తి  నమొా నమస్తే ॥

5.

కామాక్షి  భుామండల నాయికాయై

వామే స్థితేశంక రురాణి మాన్యే

శ్రీరాజ  రాజేశ్వరి చిత్స్వరుాపే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

6.

వాణీ రమా సేవిత పాద పద్మే

బ్రహ్మేంద్ర దేవాదిభి రర్చితాంఘ్రే

శ్రీరాజ  రాజేశ్వరి సిద్ధి ధాత్రే 

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

7.

అవ్యాజ కారుణ్య రసప్రవాహే..

ఆనంద కైలాశ గిరీసు నందే

శ్రీరాజ  రాజేశ్వరి సుదుర్ల భాయే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

8.

క్షేత్ర స్వరుాపే ధర దైత్య దుారే

ఉన్మేష ణాక్షీ కృతకర్మ సారే 

శ్రీరాజ  రాజేశ్వరి సుయజ్ఞ రుాపే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

9.

శ్రీవేద వేద్యే స్థితి కారణేభ్యే

యంత్రస్వ రుాపేసు స్వతంత్ర రుాపే  

మాతేన వావర్ణ సుబిందు పుార్ణే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥

10.

చింతామ ణిద్వీప త్రికోణ మధ్యే

శ్రీచక్ర  మధ్యస్థి తమంత్ర మాన్యే

హేబిందు రుాపే స్థిత సింహ వాహే

పాహీ పరే శక్తి  నమొా నమస్తే ॥


అంశం : పద్యాలు (ఐచ్ఛికం ).
ప్రక్రియ : మత్త కోకిల .

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .

శ్రీల నిచ్చెడు కల్ప వల్లివి సింహ వాహిని శాంకరీ.
వేల రుాపము లేలు తల్లివి వేల్పు కొలువౌ శ్రీకరీ
ముాల మంత్రిణి,మొాక్ష రుాపిణి,మొాహ మాయ వినాశినీ
బాల , శ్రీ లలితాంబ చిద్ఘని భక్త సంకట మొాచనీ ॥

అమ్మ నీవని నమ్మి యుంటిని ఆది శక్తి పరాత్పరీ.
నిమ్మళమ్మగు భక్తి తోనిను నిష్ట గొల్చెద నీశ్వరీ  ॥
రమ్మ నంటిని జాగు సేయక రావె శ్రీ జగదీశ్వరీ
ఇమ్మ నీవభయమ్ము మాకిల ఈప్సితావర దాయినీ ॥

జోత లెట్టెద చిద్ఘనీ శుభ జ్యోతి చక్రని వాశినీ.
ప్రాతః కాలపు పుాజలందవె పార్వతీ గుణ భాసినీ
యాతనింకను తాళజాలను యామినీ జన మొాదినీ
మాత శ్రీ లలితాంబ బ్రోవవె మాత మంగళ రుాపిణీ ॥

ముండ మాలిని దుర్గ నాశిని ముక్తి మొాక్షస్వ రుాపిణీ
ఛండ ఛండిక రుాపిణీ సుప్రచండ తాండవ మొాదినీ
అండ నీవుగ మమ్ము బ్రోవవె  ఆర్త త్రాణ  పరాయణీ.
భండ దైత్య విదారిణీ భవ బంధ దుఃఖ విమొాచనీ ॥

భక్తి గొల్చెడు వారి బ్రోచిన  భాగ్య మంగళ రుాపిణీ
యుక్తి రుాపము లెన్నొ దాల్చిన శక్తి శంకరు కామినీ ॥
సుాక్తి సుందరి శాంత రుాపిణి సుార్య తేజ ప్రకాశినీ
ముక్తి నిచ్చెడు మార్గ దర్శిని ముాక దైత్య వినాశినీ ॥



No comments:

Post a Comment