Shankar chintakindi
మీ కవితలు చాలా బాగుంటాయి..నా పుస్తకపు పుటల్లో దాచుకునేట్టుగా.. 👌
మచ్చుకి యీ క్రింది విధంగా...
👍👍🫡
జీవితమే నడిసంద్రపు నావ
తెలియని బ్రతుకు ఒడిదుడుకుల త్రోవ
అలల ఒరవడికి మునుగునో తేలునో
ఎవరిని అడిగేది? ఏమని అడిగేది??
గడిచిన జీవిత పుటలు తెరవగా
జ్ఞాపకాలే దొంతరలై కదిలే
వెదికి చూడ వెతలెన్నో కలచె
మదిలో గుస గుస వ్యథ కలిగించె
ఎవరిని ఎన్నని ఏమిటి లాభం
గడిచిన జీవితమే ఒక శాపం
ఒంటరినై నే నిలిచిన క్షణం
మనసే నాతో మాట్లాడు నేస్తం
భువిలో ఎన్నో అక్షరమాలలు
ఉచ్ఛ నీచ ఆచారపు దాడులు
జాతి మతముల జాడ్యపు మరకలు
తెరవని తలుపుల అడ్డుగోడలు
జీవిత దశలో ఆఖరి పిలుపుకు
అన్నీ వీడి తెరవాలి తలుపులు
చాలించెడి ఈ తనువు పాత్రతో
రాదేది నీ వెనుక యాత్రలో
ఒంటరినై నే నిలిచిన క్షణంనా
మనసే నాతో మాట్లాడు నేస్తం...
.. పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి 👏
No comments:
Post a Comment