03/06/2023.
శీర్షిక : నిదురలో నీ " రసం "
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్. మహారాష్ట్ర .
నిదురలో నీ " రసం "
మెడడుకు మేత వేస్తొింది.
బురద జల్లుతున్న బుద్ధిని
అంతరాత్మ ప్రక్షళన చేయ ప్రయత్నిస్తుా
ఆగ్రహంతో అడుగుతోంది..॥
ఎందరెందరో పోరి తెచ్చిన స్వాతంత్ర్యం .
ఆత్మార్పణల రుధిరం ధారపొిసి
మనకై తెచ్చిన ఆనందం .
ఈనాడు తిరిగి బాంచన్ బ్రతుకులకు
శ్రీకారం చుడుతోందని.అర్ధం కాలేదా..?
అక్రమాలకు ఆహుతౌతున్న
అప్ప చెల్లెళ్ళ ఆగని కన్నీటి ధర్నాల -
ఆమడ దుారపు అగచాట్లు కనపడడంలేదా.?
వృద్ధాశ్రమాల వెలసిన గోడలమధ్య
విలవిలలాడుతున్న జన్మదాతల
పగుతున్న గుండె జారి నీదాకా ఇంకా చేరలేదా..?
వావి వరుసలు మరచిన కామాంధుల
కబంధ హస్తాల్లో నలుగుతున్న పడతుల
ఆగని ఆక్రోశాలకు నీ గుండె ద్రవించడం లేదా..?
పాపం పుణ్యం ఎరుగని పసిపాపల
అమాయక చిరునవ్వుకు, ఐనవారమంటుా
పుాసిన మాయని వికృత మచ్చలు
నిన్ను భయపెట్టడం లేదా...॥
భారతీయులంరిదీ వసుధైక కుటుంబం
అన్నమాట ఏ కలుగులో దాచేవో..మర్చిపొియావా..?
ప్రస్తుత సమాజంలో మరుగున పడిన
మానవత్వం పిశాచ తాండవం చేస్తోంది...
..నీకుా తెలుసుగా.
ఒక్కడుగు ముందుకేయెచ్చుగా.... ధైర్తం లేదా.?
నేను ,నాదన్న స్వార్ధంలో ఆనందపడాలా..?
ఏం బావుకుందామనీ..?
నువ్వుంటున్న నీ దేహమే నీదికాదు.
ఆ దేహం విడిచి పోతే, గాలిలో కలిసిపోతావుగా?
ఈలోపలే ఏం వెలగపెడదామనీ....?
ఒకడుగుడు ముందుకేయవయ్యా....
ఒక మంచి ఆలోచన నీకు తోడౌతుంది.॥
మేముా, మనము అన్న భావనకు
పదునుపెట్టయ్యా....
మీతో నేనున్నానంటుా చేయుాత నందించవయ్యా.
కత్తిలా ఝళిపించే కలం రాసే పదాలతో
కొందరి కన్నీటినైనా తుడిచే ప్రయత్నం చేయి ॥
ఉద్యమాలు చెయ్యలేం ,
నిరాహారదీక్షలు చెయ్యలేం .
ధైర్యంగా నిలబడి .పోరాడేవారికి
కనీసం మాట సాయమైనా చేయలేం ॥
ఎందుకంటేమనం కవులం (అనుకుంటున్నాం)కదా..
మాటతో ,చేతతో, చేయలేని ఉద్యమాన్ని
కనీసం రాత బాటనైనా నడిపించవయ్యా..॥
.వేల ఆర్తనాదుల అధరాలల లో కొన్నిటికైనా
విరిసిన చిరునవ్వు అవ్వవయ్యా ....
కోట్ల జనుల నిస్సహాయత్వం,
కోరుకుంటున్న చిన్ని చిన్ని ఆనందాలకు
మీ వంతు వరంగా చిన్ని కవితను
చిరుకానుకగా ఇచ్చి చుాడవయ్యా.....
నీలో నిజమైన మనిషిని తట్టి లేపు
ఆనాడు నువ్వనుభవించే బ్రహ్మానందానికి
నిన్ను నువ్వే మర్చిపోతావు.॥
మారిన నీ ఆలోచనలు , చరిత్ర
సాహిత్య పుటల్లో తర తరాల వెలుగులను
నింపే ఆశాజ్యోతు లౌతాయి.॥
వెలుగులో నిజాల్ని వెలికి తీసే
నిలకడగల నిత్యానంద యొాగి స్వరుాపవై
చిరంజీవి వౌతావయ్యా.....
లే ...లేచి .నిజాల బాటలో
అడుగు లేయడం నేర్చుకో..
లే...లే...లే.....అంటుా..
లేపుతున్న అంతరాత్మ కుదుపులకు
నిద్రమత్తు వదిలింది..చుట్టుా చుాశా..
ఎదురుగా తోటలో విచ్చుకుంటున్న మందారం..
విలాసంగా నావైపు చుాస్తుా తలనుాపుతోంది.
నీకన్నా నేనే నయమంటుా...॥
దీనికెందుకో ఇంత ధీమా...అనుకుంటుా
తేరపారి కిటికీలోంచి చుాశాను ..
ఆకలికి వాలిన తుమ్మెదకు అది ఆనందంగా
తనలో దాచుకున్న మధురసాన్నందిస్తొింది..
పరమానందం అనుభవిస్తుా..
ఆశ్ఛర్యం... మంచం దిగే ప్రయత్నంలో
.అనుకోకుండా....ముందడుగేశా..॥
ఈ కవిత నా స్వీర రచన.
No comments:
Post a Comment