Tuesday, June 21, 2022

అత్యాచారాలు అణచివేతలు

అంశం : బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు , అణచివేతలకు వ్యతిరేకంగా....

శీర్షిక :   మార్పు రావాలి.

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


వ్యవస్థలో మార్పు మారణహోమమయ్యింది.
మాదకద్రవ్యాల మత్తు, కామానికి విత్తయ్యింది.
 పెరిగిన స్వార్ధంతో మానవత్త్వం మంటకలిసిపోయి
మగాడు మృగాడై వావి వరుసలు మరిచేడు॥

ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని-
పిల్లలుా దేముడుా ఒకటేనన్న మనిషి-
నేడు పుట్టిన పసి ప్రాణంలోనుా పండు --
ముసలిలోనుా  కుాడా ఆడతనాన్ని చుాసి
 అంగలార్చే పరిస్థితికి లోనయ్యాడు.॥

పదవికోసం, మత్తు పంపిణీ ,ఓటుకు నోటన్న
 బలహీనతలతో మనిషి చిత్తైపోయాడు ॥
 పెరుగుతున్న కామంతోపేగు బంధాల్ని మరచి
 కనిపించిన ఆడతనాన్ని కబళిస్తుా వచ్చేడు.॥
 కారణం :
న్యాయస్థానాల్లో ఎన్నటికీ రాని తీర్పు లోటు
రాజ్యాంగాలలో రాజకీయ దౌర్జన్యాల వేటు.
అక్రమ అత్యాచారాలను అణచలేని వ్యవస్థలో
పెరిగిపోతున్న అరాచకాలకు తీర్పు రాని పోటు ॥

ఈ పరిస్థతి మారాలంటే,  విద్య అందరికీ
ప్రాధమిక హక్కుగా ఉచితంగా లభించాలి.
బాల కార్మిక వ్యవస్థను రుాపు మాపాలి. స్త్రీలు,
పిల్లల పరమైన చట్టాలను అమలులోకి తేవాలి॥

శిశుసంక్షేమం, ఆరోగ్యం , భద్రతాభివృద్ధి శాఖలలో
 సమర్ధత కలిగిన సభ్యులు నైతికతతొ పనిచేయాలి
 స్త్రీ, బాలికల ఆరక్షణా కేంద్రాలు న్యాయ వ్యవస్థలుా
 ఎప్పటికప్పుడు  స్పందిస్తుా జాగురుాకతతో మెలగాలి.

 అప్పుడే మన భవిత దేశ శాంతి సౌభాగ్య 
 చరిత్రకు శ్రీకారం చుట్టగలుగుతుంది ॥
 

No comments:

Post a Comment