Tuesday, June 21, 2022

చిత్ర కవిత

13.6.23
మహతీసాహితీకవిసంగమం
అంశం:చిత్రకవిత:
మ.సా.క.సం: 19
క.సం:1
ప్రక్రియ:   ఆటవెలది పద్యాలు.

శీర్షిక :పిల్లల్లారా రారండోయ్ .

రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .


కణపు రుాపు లోన  కరకుక రోనాయె
కలత లేపె నుగద కాటు వేసి
పాఠ శాల లేక  బాలల లసిరింట.
నేడు స్కుాలు పోవ నెగిరి మురిసె ॥

ఆను లైను స్కుాళ్ళు అలసత్వ మునుపెంచె
ఆట పాట లేని అసహ నములు.  
అట్టి సమయ మిపుడు అలవోక గాపోయె
బడికి పోవ నెంచె  బాల సఖులు ॥

చదువు మాట జెప్ప చాలనల్లరిజేయు
పిల్ల లెంతొ మురిసె పిలువ స్కుాలు
బరువు పొత్త ములతొ  బాల బాలికలంత
పాఠ శాల జేర పరుగు లిడెగ ॥

విద్య నేర్చు వారు విషయ యొాచన గల్గి
జ్ఞాన వంతు లౌచు జగము లేలు
భాగ్య వంతులు గద బాలలం దరుచాల
చదువ నేర్చు వారి  చరిత ఘనము॥

****************************

No comments:

Post a Comment