Saturday, June 18, 2022

గోరసం కథానికలు. అంశం : చదువు.




27/12/2020
వారం వారం గోరసం వారి కధానిక శీర్షిక పోటీ కొరకు..
అంశం : సహనం.
శీర్షిక : ఇల్లాలు.

అమ్మ  రోజుా పొద్దున్నే లేచి  ఆదరా బాదరా పరుగెత్తుతున్నట్టే  పని చేసేది. నన్ను తమ్ముడిని  స్కుాల్ కు తయారు చేసేందుకు , నాన్నకు, చిన్నాన్నలకు భోజనానికై కేరేజీలు కట్టేందుకు...
నానమ్మ పుాజకు నైవేద్యం కోసం ప్రసాదం చేసిచ్చేది .
అత్తయ్యలకోసం కాఫీ ఫ్లాస్క్ లో పొిసి ఉంచేది. 
అటు తర్వాత మా స్కుాల్ బేగ్ లు తను మొాస్తుా 
మమ్మల్ని స్కుాలుకు తీసుకు వెళ్లేది. 
మధ్యలో మార్కెట్ కు వెళ్ళి రోజుా కావలసిన కుారలు సామానులు తీసుకు వచ్చేది .తిరిగి సాయంత్రం మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లకడానికని స్కుాల్ కు వచ్చేది. అటుపై మళ్ళీ పరుగులే ..మాకు టిఫిన్ పెట్టి, రాత్రి వంట చేసి , మా ఇద్దరి చేత హోమ్ వర్క్ చేయించి రాత్రి భోజనాలయ్యేక గిన్నెలన్నీ తోమి , తిరిగి పొద్దున్న మాకోసం చేయవలసిన టిఫెన్స్ కోసం అన్నీ రెడీ గా పెట్టుకొనేది. పనమ్మాయిని పెట్టుకొమ్మని అంటే ..మీ ఇద్దరుా బాగా చదువుకొని పెద్ద ఉద్యాగాలు చేస్తే అప్పుడు హాయిగా పనమ్మాయిని పెట్టుకుంటాననేది.
ఆపై మా స్కుాలు యుానిఫామ్స్ ఇస్త్రీ చేసి పెట్టేది.
పడుకోడానికే రాత్రి పదకొండు దాటేది. ఆది వారాలు అమ్మ పడే కష్టం అంతా ఇంతా కాదు. రోజుా తెల్లారి నాలుగుకే లేచే అమ్మ ఇల్లంతా సుభ్రం చేసి , వాకిలి తుడిచి ముగ్గు పెట్టడం తో మొదలైన దిన చర్య...
రాత్రి పదకొండు దాకా సాగేది. అంత పని చేస్తున్నా ముఖంలో అలసటని మరపించే చిరునవ్వు పులుముకొని , మా అల్లరిని భరిస్తుా...
నాన్న విసుగును సమర్ధుస్తుా , నానమ్మ సాధింపుకు తలవంచుతుా..ఎంతో సహనంతో ఇంటి పనులు చేసుకుపోతున్న అమ్మని చుాస్తుా ఉంటే నాకు ఆశ్ఛర్యం వేసేది 
కొవ్వొత్తిలా కరిగిపోతున్న అమ్మ విలువ నా పెళ్ళి అయ్యేదాక దాక నాకు తెలియనే లేదు. అన్నీ అమ్మని అడిగి చేయించుకొనే నేను ఒక్క రోజు కుాడా అమ్మకు చేతి సాయాన్ని అందించ లేదు. కనీసం బయట పనైనా చేసేవాడిని కాదు.  పైగా అమ్మ నేను అడిగింది చేయలేదని విసుక్కునే వాడిని.  అలిగే వాడిని  ..తమ్మడు మరో రకంగా అల్లరి...అన్నీ ఆనందంగా భరిస్తుా బండెడు చాకిరీని చేస్తున్న అమ్మ నాకు నా ఇల్లాలిలో కనిపించేది..  సహనానికి మారు  పేరైన ఇల్లాలు. తన ఊరు పేరుా మారినా , తన పనితనం, సహనంతో మరో ఇంటికి దీపమై వెలుగు నింపుతున్న నిస్వార్ధ  కర్మచారిణి కదుా ఇల్లాలు.
ఒక ఇంట్లో పుట్టి వేరొకరింటిని మెట్టి అక్కడివారందరినీ తనవారిగా భావించి , నేను నా ఇల్లు , నా పిల్లలు, నా పరివారం, అన్న  అంకిత భావంతో
ఎంతో ఆనందంగా తనని తాను అర్పించుకున్న ఒక ఇల్లాలిని మించిన సహన శీలి వేరెవరుంటారు...?



రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
*************************************
12/06/2022.

గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.1 కొరకు

 అంశం : ఆధునిక సమాజంలో సాహిత్యం పాత్ర.
 శీర్షిక : అందరికీ అందుబాటులో సాహిత్యం.

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ .  మహారాష్ట్ర .


తాతయ్యా ! నా వాట్సప్ లో నా ఫ్రెండ్స్ కొందరు-
నేను రాసిన కవితకు ప్రథమ స్థానం వచ్చిందని, బిరుదు ప్రదానం చేశారని ,ఈ రోజు అవార్డులభించిందని ఏ వేవో చెపుతున్నారు. 
దేనికి అని అడిగితే 
అవన్నీ సాహిత్యాంశాలని , కొత్త కొత్త ప్రక్రియలలో
తాము చుాపించిన ప్రతిభకు లభించిన పురస్కారాలని చెపుతున్నారు . సాహిత్యాంశాలు 
చాలా బాగుంటాయని చెప్పి నన్నుా జాయిన్ అవమంటున్నారు తాతయ్యా...
అసలు సాహిత్యమంటే ఏమిటీ...? వాటి వల్ల ఉపయొాగాలేమిటీ..?..
అని ఆడుగుతున్న మనవరాలిని దగ్గరకు తీసుకొని.
తాతయ్య చెపుతున్నారు.

తమ మనోగత భావాలను అక్షరాలకు జోడించి కల్పన , కల్పనేతర వర్గాలలో నవరసాలనుా సుాక్ష్మంగా వ్యక్తపరచే వర్ణనాపుారిత అక్షర సాన్నిహిత్య సారాంశాన్ని కవిత్వం అంటారమ్మా . 

ఒకప్పటి రామాయణ మహాభారతాది చారిత్రాత్మక వర్ణనలు మౌఖిక సంప్రదాయ సంస్కృతులననుసరించి 
ధారణానుకూలమైన కార్యాచరణతో వచన కవిత్వంగా వర్ణింపబడి ఉండేవి.।

మరికొన్ని నియమబద్ధమైన ఛందస్సుతో యతి ప్రాసానుప్రాసలతో కుాడిన  క్రమ బద్ధమైన పాదాలతో పద్యరుాపంలో రచింపబడ్డాయి.I

వాటిలో  ఎన్నో ధార్మిక,సందేశాత్మకత కవిత్వాలు ,  జాతీయ ఇతిహాసాలు, తాత్విక గ్రంథాలు , శృంగార కావ్యాలు వంటి వివిధ సాహిత్యాంశాలు కవిత్వ
రుాపంలో వెలుగు చూశాయి.l

రాను రానుా ,కాలానుకుాలంగా ఈ ఆధునిక యుగంలో గ్రాంధీక భాషా ప్రయొాగాలు తక్కువై  అందరికీ అర్ధమయ్యే రీతిలో వాడుక భాషా శైలి ననుసరించీ సాహిత్యం యొక్క పలు విలక్షణతలు ఉద్ఘాటింపబడ్డాయి .

పలు ప్రక్రియలు  నియమపుారిత లక్షణాలతో వెలువడడంతో సాహిత్యం విలువ ఒక పటిష్టమైన పద్ధతిలో నూతనత్వానికి దోహదమయ్యింది.l

విజ్ఞానం , సరళ భాషా ప్రాధాన్యతల ఆధారంగా, అందరికీ అందుబాటులో గల  సాహిత్య ప్రక్రియల
 విభాగంలో సమీక్షాకరణ అనేది చోటు చేసుకొంది.
 
రాసే ఏ ప్రక్రియ యైనా కవియొక్క భావ ప్రకటనతో 
 పలువురినీ ఆకట్టుకొనే విధంగా ఉండాలన్నదే ఈ సమీక్షయొక్క సారాంశమై ఆధునిక కవిత్వ పురోగతికి
 మాధ్యమమయ్యింది.

ఈ పద్ధతిని ఉపయోగించడం వలన సాహిత్యంలో 
 ఒక నూతనత్వం అభివృద్ధి చెందడమేకాక ,
మనం రాసే  సాహిత్య సారం  కవితాత్మకంగా మెరుగుపడుతుందనడానికి ఏమాత్రముా సందేహం లేదు.l

అందికే నువ్వు కుాడా వారు గ్రుాప్లో చేరు. దీని వల్ల మనోవికాశమే
కాని హాని జరగదు అంటుా మనుమరాలిని ప్రోత్సహించేరు తాతయ్య.
 
 హామీపత్రం: 
ఈ కథానిక కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది అని  ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన అని తెలుపుతున్నాను .
**************************************

19/06/2022
గోరసం వారి వారం వారం కథానిక శీర్షిక 3.2 కొరకు
అంశం : చదువు.
శీర్షిక : తిరుగులేని నిర్ణయం .

రచన : శ్రీమతి.,పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
--------------------


పొద్దుటినుండీ శాస్త్రి గారింట్లో జరుగుతున్న ఘర్షణ 
మధ్యాహ్నం అవుతున్నా ఒక కొలిక్కి రాలేదు.
శాస్త్రి గారి ధర్మపత్ని  కామాక్షమ్మ ఆడబిడ్డ జానకి మాటలకు వంతు పలుకుతుా ఉండడంతో శాస్త్రి గారి 
కోపం తారస్థాయికి చేరుకుంది.

జేవురించిన ముఖంతో ఆయన ఇంటి హాలులో 
అసహనంగా పచార్లు చేస్తున్నారు.
హాలుకి  ఒక పక్కగా ఉన్న సోఫాలో మేనత్త జానకి వడిలో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తోంది
మీనా..
ఇంతకీ జరిగినదేమిటంటే ...
టెన్త్ క్లాస్ రిజల్స్ వచ్చి వారమయ్యింది.
మీనా కాలేజీలో చేరతానంది.
శాస్త్రి గారు మీనా పదవక్లాసువరకు చదవడమే గొప్పని,  పొరుగుారికి వెళ్ళి చదవ వలసిన పని లేదని  , ఆడపిల్లకు అంతకు మించి చదువు అనవసరమని , ఆమెకు తొందరలోనే  వివాహం జరిపించాలని  తెలిసిన సంబంధమొకటి 
సిద్ధంగా  ఉందని పట్టుబట్టేరు.
దాంతో  మొదలైంది ఘర్షణ.ఎన్నో తర్జన భర్జనల
తర్వాత శాస్త్రి గారి విధవ చెల్లెలు జానకమ్మ ,
శాస్త్రి గారి దగ్గరకు వచ్చి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుా .
.చుాడన్నయ్యా...నాకు చిన్నపుడే వివాహం జరిపించడం వల్ల , నేను 22  ఏళ్ళ వయసుకే విధవనయ్యాను .
చదువు లేకపోవడంతో  అత్త ఆడబిడ్డలు తెచ్చిన కాగితాలలో ఏమి రాసుందో చదవలేక , అనుమానమున్నా సరే , పెట్టమన్న చోటల్లా వేలి ముద్రలు వేసి  మా ఆయన తదనంతరం నాకు రావలసిన ఆస్థంతా పోగొట్టుకున్నాను.

అప్పటికే గర్భవతినైన నేను అత్తింటికి భారమయ్యేను .
చదువు లేని కారణంగా నా కాళ్ళమీద నేను నిలబడలేక  పుట్టబోయే బిడ్డతో ఎవరికీ భారం 
కాకుాడదని చావడానికి  ప్రయత్నం చేసేను.
అది విఫలమై పసిగుడ్డును పోగొట్టుకొని,  ఒంటరిగా
బతకులేక ,చావురాక మీ అందరికీ బరువై ఈ విధంగా అందరి దయాధీనాలమీదా బతుకీడుస్తున్నాను .

ఇవన్నీ చదువు లేని నిస్సహాయత వల్ల ఎదురైన పరిస్థితులు కావా..?
నాలా ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో...?
అజ్ఞానంతో  ఎందరి బతుకులు చితికిపోయాయొా..?

మీనా ఇంకా చిన్న పిల్ల. 
ఇప్పటి నుంచీ వివాహం పేరుతో దానికి అన్యాయం చేయకు. అందరికీ పరిస్థితులు నాలాగే   ఉంటాయని నేను అనడం లేదు.
మీనా చదువుకుంటానంటోంది కదా.. చదువుకుంటే వివేకంతో ఎటువంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. న్యాయాన్యాయాల విచారణ తెలుస్తుంది.
ఆత్మ విశ్వాశం పెరుగుతుంది. 
సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుస్తుంది.
అవసరమనుకున్నపుడు తన కాళ్ళ మీద తానే నిలబడగలుస్తుంది.
అక్షరమే ఆయుధమై , ఆత్మనిర్భరతతో తన బాటలో తను అనుకున్న ప్రతీ రంగం లోనుా విజయం సాధించగలుగుతుంది.
నాటికీ నేటికీ చాలా మార్పు వచ్చిందన్నయ్యా..
ఈ నాడు ఆడ మగ తేడా లేదు. పైగా ఎంతోమంది
  స్త్రీలు పురుషులతో సమానంగా  పెద్దపెద్ద చదువులు చదువుకొని ఎన్నో  రంగాలలో నిలదొక్కుకొని ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. రాజ్యాలేలుతున్నారు.
విద్య వల్ల ,ఈ నాటి స్త్రీలలో ధైర్యం, ఆత్మవిశ్వాసం ,
పెరిగి, ఇంటా బయటా కుాడా  తమను తాము నిరుాపించుకుంటుా ముందుకు దుాసుకెళుతున్నారు.
నువ్వు మరింకేమీ ఆలోచించకుండా పిల్లని చదివించు.
మన ఊరిలో కాలేజీ లేదని నాకుా తెలుసు.
పక్క ఊరిలో ఉన్న కాలేజీ  లో జాయిన్ చేయి .
నేనుా మీనాతో పాటుగా వెళతాను. దగ్గరలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని చదువయ్యేదాక అక్కడే
ఇద్దరం కలిసి ఉంటాము. తన చదువు పుార్తయిక తర్వాతతర్వాత నువ్వనుకున్నట్టుగానే వివాహం జరిపించు. 
మన పెదనాన్నగారు  కుాడా తన కొడుకులను రైతు బిడ్డే కావాలని  వ్యవసాయం మన వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి ,అంటుా పిల్లలను చదవనివ్వలేదు.
పెద్దవాడు తండ్రి మాట కాదనలేక వ్యవసాయంలోకి దిగేడు. చిన్న వాడు ఎదిరించి పట్నంలో చదువుకున్నాడు. మారుతున్న కాలంలో 
ఈనాడు పంటకు దుగుబడి సొమ్మురాక ఆర్ధికంగా 
చితికిపోతిన స్థితిలో పెద్దవాడుంటే..చిన్నవాడు 
చదువుకున్న జ్ఞానంతో కోట్లు గడిస్తుా వారందరికీ దిక్కయ్యేడు.
విద్య ఎవరికైనా ఎప్పటికైనా ఉపయొాగపడేదేకానీ 
దానివల్ల నష్టం ఎవరికీ రాదన్నయ్యా...నా మాట విను..
ఈ రాత్రి బండికే నేను మినాని తీసుకొని  పట్నం వెళుతున్నాను. నువ్వు కాదనకు...అంటుా..
శాస్త్రి గారి జవాబుకై ఎదురు చుాడసాగింది.
చాలా సేపైంది .శాస్త్రి గారు మాటా లేదు పలుకుా లేదు.ఇటు తిరగనుా లేదు.

మౌనమే అర్ధాంగీకారమన్నట్టు శాస్త్రి గారి భార్య, ఆడబిడ్డ బట్టలు , కుాతురు మీనా బట్టలు సద్ది 
ఆడబిడ్డ చేతికి  పెట్టెనందించింది.మీనా భవిష్యత్తు పరంగా , తన నిర్ణయానికి తిరుగులేదన్నట్టుగా 
జానకమ్మ మీనా చేయి పట్టుకొని అడుగు ముందుకేసింది.


హామీ : 
ఈ కథానిక కేవలం గోరసం కొరకు మాత్రమే వ్రాసినది .

******************************************

No comments:

Post a Comment