[6/20, 15:07] p3: 20/06/2022
మహతీ సాహితీ కవి సంగమంలో
అంశం : చిత్ర కవిత.
శీర్షిక : అగ్నిలో అర్ఘ్యం.
రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
మ. సా.క.సం.:19.
కవిత సంఖ్య : 1.
ప్రక్రియ : వచన కవిత.
--------------------
స్వార్ధమే రాజ్యమేలుతున్న ప్రపంచంలో
ధనమే ముాలమై దౌర్జన్యాలు చేయిస్తోంది.
రాజకీయంలో రౌడీయిజం చోటు చేసుకున్నాక
చదువు-సంధ్యలు చంకనాకిపోయాయి.॥
నోటుకు ఓటు అమ్ముడు పోతోంది
నల్ల కోటు నాటకీయమైంది.
పదవులకు చదువులతో పనిలేదు.
నాయకులకు నీతి న్యాయాలతో పనిలేదు॥
నాటి జ్ఞాన నిధులైన పుస్తకాల దొంతులు
నేటి అజ్ఞాన తిమిర కుహరంలో బందీలై
బుాజుపట్టిన భావాలకు బరువై
అలనాటి వైభవాన్ని కోల్పోయాయి.॥
మనిషి మేధస్సు మారణహోమం చేస్తోంది.
విజ్ఞానం విచిత్ర చరవాణికి దాసోహమంది.
మానం కోల్పోయిన మంచి- మర్యాదలు
నగ్న శరీరంతో నాట్యాలు చేస్తున్నాయి ॥
నేడు న్యాయానికి మానం లేదు.
మానానికి రక్షణ లేదు.
బంధాలకు బాధ్యతలేదు.
అనుబంధాలకు ఆప్యాయతలేదు ॥
విద్యార్దులలో అణకువలేదు.
ఉపాధ్యాయులలో నిజాయతీ లేదు.
పాలకులలో పరిపాలనా సమర్ధత లేదు.
ప్రజలలో అన్యాయాన్నెదిరించే ధైర్యం లేదు॥
గుడిసెలు కాలుతున్నాయి .
మిద్దెలు కుాలుతున్నాయి.
అరాచక రాజ్యంలో అక్రమాల దోపిడీకి
బలహీన వర్గాలు బలి పశువులౌతున్నాయి ॥
అంతస్థుల భవనాల్లో
నిదుర రాని రాబందులు
కడుపు నిండినా, కాలక్షేపానికి
అసమర్ధత నిండిన బడుగు -
జీవితాలతో విధాత రాయని
వింత ఆటలాడుకుంటున్నాయి॥
**************************
[6/20, 20:55] +91 6303 460 295: 1️⃣1️⃣✅ పుల్లాభట్ల వారు..
మసాకసం.. 19..
మీ శీర్షిక.. *అగ్నిలో అర్ఘ్యం*👌
ప్రక్రియ.. *వచనకవిత*👌
సమాజంలో ప్రధాన భాగమైన విద్యా వ్యవస్థను అవస్థల పాలు చేస్తున్న అన్ని రంగాలను.. నిప్పులతో కడిగిపారేశారు... చాలా ఆవేశంతో.. ఆవేదనతో సాగింది మీ కవిత..
*బడుగుల జీవితాలతో విధాత రాయని వింత ఆటలాడుకునే రాబందులకు* కాలం మూడే సమయం వస్తుందని ఆశిద్దాం..
చాలా బాగా రాశారు..
ధన్యవాదాలు మరియు అభినందనలు
👏👏👏💐💐💐🙏🙏🙏
No comments:
Post a Comment