Wednesday, June 22, 2022

కుానలమ్మ పద్యాల గురించి

[4/24, 20:22] +91 90147 67045: *పంత మెందుకు* 

మొగడంటే దైవము
దేహ సగ భాగము
దాంపత్య రాగము
ఓ  జాబిలమ్మా

మొద్దు  కష్టం చేయు
చెమట దారగ పోయు
బరువు నెత్తిన మోయు
ఓ  జాబిలమ్మా

తనకుంది భాధ్యత
తనతోనే భద్రత
తను ఉంటే  భవ్యత
ఓ  జాబిలమ్మా

మగని తిట్టగ బోకు
పగని  పెట్టూ  కోకు
తగవు  చుట్టూ  కోకు
ఓ  జాబిలమ్మా

ఇంటి వాడే తాను
కంటి పాపే  కనూ
పంత ముంటే  మాను
ఓ  జాబిలమ్మా
      --ముత్యాల రఘుపతి
[4/24, 21:34] +91 78423 68534: ఆధారం 
ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు!చాలా మంది వ్రాశారు.  
ఇలాంటి లయ ఛందస్సు అండీ 
బాగుంటుంది.. ప్రాసలూ, మాత్రలు ఉండాలి. 🙏👌
[4/24, 21:42] +91 90147 67045: సార్.. ఇది. ఆరుద్ర గారి కూనలమ్మ పదాల మాదిరి కవితా ప్రక్రియ గా చెబుతారు
[4/24, 22:48] A. రాజ్యలక్ష్మి గారు (cpk సంస్థ): ఈ కవితలు కూనలమ్మ పదాలను పోలి ఉన్నాయి. ఛందస్సు పాటించారా అన్నది తెలియదు
ఉదాహరణ కు  ఓ కూనలమ్మ పదం

ఆలి కొన్నది కోక
అంతరిక్షపు నౌక
అంతకన్నను చౌక
ఓ కూనలమ్మా
[4/24, 22:49] A. రాజ్యలక్ష్మి గారు (cpk సంస్థ): ఆరుద్ర గారు 150 వరకూ సరదాగా రాసి తర్వాత మానేశారు. ఇవి చాలా పాతకాలం నుంచి ఉన్న పద్యరూపం
[4/24, 22:52] +91 78423 68534: 10 మాత్రలు ఉండాలి అలాగే 
చివరి పాదం ఒకటి  తక్కువగా. 
ఆది అంత్య ప్రాస అసలు అందం. !🙏శుభరాత్రి.

No comments:

Post a Comment