*నాన్న...*
ఆ పుస్తకం నిండా గాయాలే
ఆ పుస్తకమే నాన్న...
ఆ సముద్రం నిండా బడబాగ్నులే
ఆ సముద్రమే నాన్న
ఆ శిఖరం నిండా ఎగుడుదిగుడులే
ఆ శిఖరమే నాన్న
ఆ గుడి నిండా అడిగింది దానం చేసే త్యాగఫలాలే
ఆ గుడే నాన్న
చదివితే అర్థం కాడు
అనుభవించిన కొద్ది ఆవహించే ఱేడు నాన్న
అదేమిటో
నాన్న మంచోడిలా కనిపించే చెడ్డోడు
చెడ్డోడిలా కనిపించే మంచోడు
నాన్న...
నీ గూర్చి చెప్పడానికి నేను ఎవడిని
నీకు నమస్కారం అంతే...
*అభిరామ్ 9704153642*
No comments:
Post a Comment