అశం : నిజం నిష్టుారమే...
శీర్షిక : శ్రీశ్రీ బాట నామాట.
రచన: శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ : మహారాష్ట్ర .
మరో ప్రపంచం మరో ప్రపంచం
మరో ప్రపంచం మనదేనోయ్
కలాలు పట్టుకు నిజాలు చెప్పుచు
కదను తొక్కుదాం మనమేనోయ్ ॥
అన్యాయాన్నెదిరించే మాటను
నిప్పు నిజాలను రాసే బాటను
నిర్భయ రీతిని సాగండోయ్
కలం కత్తిగా మార్చండోయ్ ॥
భగ భగలాడిన హ్మ్రదయాక్రోశం
భుగ భుగ ఎగసిన ఎర్రని కోపం
పిట పిటలాడే పుస్తక పుటలో
పట పటలాడుచు రాయండోయ్ ॥
అన్యాయాలకు బలియౌ బడగుల
అసభ్య చేతల అవమానితులా
స్త్రీల మాన హింసాత్మక చర్యల
చలించు చరితలె రాయండోయ్ ॥
కష్టాల్ నష్టాల్ కావిడి మొాతల
రాజకీయ అధికార రాపిడుల
చట్టపు తీర్పులె మార్చండోయ్
కవన భేరి మ్రొాగించండోయ్ ॥
మార్పు కుార్పుకై మరో ఉద్యమం
మనిషిని మనిషిగా మార్చు సాధనం
కలం హలంలో ఉదండోయ్.
కవిగా కదనం త్రొక్కండోయ్ ॥
మంచి మార్పుకై మంచి తీర్పుకై
నిజాల నిప్పును కురిపించోయ్
భరత భవతకై తపించవోయ్
భాగ్య విధాతవు నీవేనోయ్ ॥
శ్రీ శ్రీ బాటను శ్రీ శ్రీ మాటను
తర తరాల కందించండోయ్
కదిలీ ముందుకు, తోసుకు తోసుకు
అక్షర సేద్యం చేయండోయ్ ॥..॥
*************************
No comments:
Post a Comment