03/05/2022.
మహతీ సాహితీ కవి సంగమం.
మ.సా.క.సం. 19.
సాహిత్యాంశము ..ఆతుకుారి మొల్ల.
ప్రక్రియ : వచన కవిత .
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి .
కల్యాణ్ : మహారాష్ట్ర .
పుావు పుట్టగానే పరిమళిస్తుందంటారు.
మొల్ల ఆకోవకు చెందినదే .
కుమ్మరి వంశజురాలైన ఆమె చిన్నతనం నుండే
రామ భక్తి పరాయణురాలై శ్రీ రామాయణ మహాకావ్య
రచనకు శ్రీకారం చుట్టింది. ఈ రామాయణము
తేట తెలుగులో రాయబడిన పద్య కావ్యము .
మొల్ల రామాయణంలో కందపద్యాలు ఎక్కువగా ఉండడం వల్ల, కంద రామాయణం అని కుాడఆంటారు
మొల్ల రామాయణము ఆరు కాండములలో సుమారు 870 పద్యములతో
వాడుక భాషకు దగ్గరగా ఉన్న కావ్యము.
ఇన్ని కాండములను మొల్ల కేవలం
ఐదు రోజులలోనే రాసిందని ప్రతీతి.
ఈమె రచనా శైలి చాలా సరళమైన
వాడుక భాషలో , రమణీయమైన
పద్యాలతో అలరారుతుా ఉండడము వలన
అలనాటి ఎంతోమంది కవులను ఆకట్టుకొని
"మొల్ల రామాయణము" గా ప్రసిద్ధిగాంచింది.
ఆజన్మ బ్రహ్మచారిణి యైన మొల్ల
స్వంతంత్ర భావాలు కలిగి ఉండేదని,
ఈమె కులావంశ సంజాతని ,ఇంటి పేరు ఆతుకూరివారని చెపుతారు.
మొల్ల రాసిన రామాయణ కావ్యంలో
వాల్మీకి' దగ్గరనుండి 'తిక్కకవిరాజు
భోజు' వరకూ నుతించింది.అంతేకాదు
ఆమె తండ్రి రచియించిన
గ్రంథావతారికలో ఆదికవి స్థుతియందు శ్రీనాధుని స్మరించి యుండుటచేత ఈమె శ్రీనాధుని
తరువాత కాలమున ఉండేదని తెలియుచున్నది.
జ్ఞాని , కవయిత్రియైన ఈమె నిరహంకారి, నిరాడంబరతతో కుాడిన శాంతస్వభావి అన్న మాట
మనకు ఆమె రామాయణ కావ్యమునకు ముందుగా రాసిన పద్యము తోనే విశదమౌతుంది.
ఆపద్యం ...
గావ్య సంపద క్రియలు నిఘంటువులును
-గ్రామం లేవియు నెఱుఁగ, విఖ్యాత
-గోప వరపు శ్రీ కంఠమల్లేశు వరముచేత -
నెఱిఁ గవిత్వంబుఁ జెప్పఁగా నేర్చుకొంటి ॥
అంటుా ఎంతో అణకువతో
.భగవత్కృుప, పుార్వ జన్మ పుణ్య ఫలమే
తన తచనా పటిమకు కారణమని తెలియపరుస్తుంది.
ఈమె వాడుక భాషలో
రామాయణకావ్యము రాయుటకు ప్రారంభములోనే ...
"చెప్పమని రామచంద్రుడు, చెప్పించిన పలుకుమీద జెప్పెదనే నెల్లప్పుడు నిహపరసాధన,
మిప్పుణ్యచరిత్ర, తప్పులెంచకుడు కవుల్ " అన్న పలుకులతో ప్రారంభించినది.
అంతేకాదు
ఈమె పాత్రలను కండ్లకు కట్టునట్లు చింత్రించ గలదు
అన్న మాటకు సముద్ర లంఘనము చేస్తున్న హనుమంతుని వర్ణించిన తీరు మచ్చుక కొక ఉదాహరణ మాత్రమే...
గమనించండి...
మొగము బిగించి, పాదముల
మొత్తముగానట నూదిత్రొక్కి,
నీటుగ మొగమెత్తి భీకర కఠోర రవంబున
వార్చి బాహులత్యగణితలీలమాచి,
వలయంబుగ వాలముద్రిప్పి వ్రేగునన్
నగము సగంబు క్రుంగ గపినాధుడు
నింగి దాటే రివ్వునన్!!!
సరళత్వము తో కుాడిన రమణీయ రామాయణ
కావ్య సంపదను మనకందించిన మొల్ల ,కారణ జన్మురాలిగా , రచయిత్రిగా, నేటికీ మనందరి మదిలో నిండిపోయిన కారణ జన్మురాలు .
అంతటి మహనీయురాలైన మొల్ల
రచించిన రామాయణ మహా కావ్యమును
మనమంతా చదివి ఆ రామ చంద్రుని కృపకు పాత్రుల మౌదాము.
---------------------
.
No comments:
Post a Comment